తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naatu Naatu Viral Video: నాటు నాటు పాటకు బొమ్మ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర

Naatu Naatu Viral Video: నాటు నాటు పాటకు బొమ్మ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర

23 March 2023, 7:31 IST

  • Naatu Naatu Viral Video: నాటు నాటు పాటకు ఇప్పటి వరకు ఎన్నో పేరడీలు, విభిన్న వెర్షన్లు వచ్చాయి. కానీ ఇది మాత్రం వీటిన్నింటికీ విభిన్నంగా ఉంటుంది. ఓ బొమ్మ నాటు నాటు సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.

నాటు నాటు సాంగ్ వైరల్ వీడియో
నాటు నాటు సాంగ్ వైరల్ వీడియో

నాటు నాటు సాంగ్ వైరల్ వీడియో

Naatu Naatu Viral Video: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ క్రేజ్ ఇప్పడప్పుడే తగ్గేలా లేదు. గతేడాది నుంచి ఎంతో మంది ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎంతలా అంటే ఆ పేరడీ వీడియోలు సైతం మిలియన్ల వ్యూస్ అందుకుంటున్నాయంటే ఆ పాట క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలిచిన తర్వాత ఈ పాట క్రేజ్ మరింత పెరిగింది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు విభిన్న వెర్షన్లలో ఈ సాంగ్‌కు కాలు కదుపుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి మరోసారి నెట్టింట హల్చల్ చేస్తోంది. దీన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ తన స్పందనను తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే ఆనంద్ మహీంద్ర నాటు నాటు పాటకు సంబంధించి ఇప్పటికే పలు వైరల్ వీడియోలను షేర్ చేశారు. తాజాగా మరోసారి నెట్టింట ఓ వీడియోను పంచుకున్నారు. అంతేకాకుండా ఈ వీడియోను షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను అంటూ పోస్ట్ చేశారు. "ఓకే.. ఇదే చివరి ట్వీట్, నాటు నాటు గురించి ఇదే చివరి ట్వీట్. కానీ షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ప్రపంచం మొత్తాన్ని ఊపేసిందనడానికి ఇదే నిజమైన సాక్ష్యం" అంటూ ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను షేర్ చేశారు.

ఇప్పటి వరకు నాటు నాటు పాటకు జనం స్టెప్పులేయడం చూసుంటారు.. కానీ వీడియోలో ఓ బొమ్మ అదిరిపోయే రీతిలో నాటు నాటు స్టెప్పులేసింది. కీలుబొమ్మలాటలో మాదిరిగా చిన్న కర్రలకు దారాలు కట్టిన బొమ్మతో ఓ మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేయించింది. కర్రలను కదుపుతూ బొమ్మ చేత నాటు నాటు ఐకానిక్ స్టెప్పును వేయించింది. నిజంగా ఈ వీడియోను చూస్తే ఆమె కళకు నివ్వెరపోవాల్సిందే. బొమ్మ కాళ్లు, చేతులు పాటకు తగినట్లుగా సింక్ చేయిస్తూ అద్భుతంగా స్టెప్పులేయించింది. బొమ్మ డ్యాన్స్ చేసినప్పటికీ దానితో స్టెప్పులేయించిన ఆ మహిళ ప్రతిభ ప్రతిఒక్కరూ ప్రశంసిచాల్సిందే. ఆనంద్ మహీంద్రా కూడాఅదే చేస్తూ ఆ వీడియో ట్విటర్ వేదికగా షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. బొమ్మ డ్యాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా మహిళలను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ పురస్కారం సాధించింది. టాప్ గన్ మ్యావ్రిక్ సినిమా నుంచి లేడీ గాగా ఆలపించిన హోల్ట్ మై హ్యాండ్, బ్లాక్ ఫ్యాంతర్ వకాండ ఫరెవర్ నుంచి రిహానా పాడిన్ లిఫ్ట్ మీ అప్ లాంటి పాపులర్ సాంగ్స్‌ను కూడా అధిగమించి నాటు నాటు పాట ఆస్కార్ గెలిచింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం