Tamannaah Vijay Varma: తమన్నా.. ఇంత మోసం చేస్తావనుకోలేదు.. బాలీవుడ్ నటుడి కామెంట్ వైరల్
26 April 2023, 15:55 IST
Tamannaah Vijay Varma: తమన్నా.. ఇంత మోసం చేస్తావనుకోలేదు అంటూ బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. నిజానికి అతడు విజయ్ వర్మను టీజ్ చేస్తూ చేసిన కామెంట్ అది.
విజయ్ వర్మ, తమన్నా, గుల్షన్ దేవయ్య
Tamannaah Vijay Varma: టాలీవుడ్, బాలీవుడ్ నటి తమన్నా డేటింగ్ రూమర్స్ ఈ మధ్య కాలంలో ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలుసు కదా. హైదరాబాద్ కు చెందిన బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ కు కూడా వెళ్లిన ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్ వర్మను టీజ్ చేస్తూ బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య చేసిన కామెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అసలేం జరిగిందంటే.. విజయ్ వర్మ తాను నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దహాద్ స్నీక్ పీక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనిపై గుల్షన్ దేవయ్య స్పందిస్తూ.. విజయ్ ను టీజ్ చేసేలా ఓ ఫన్నీ కామెంట్ పెట్టాడు.
"మేరీ తమన్నా తో తూ థా.. అచ్చా ధోకా దియా హై తూనే ముఝే. థ్యాంక్ గాడ్ మేరీ ఇజ్జత్ నహీ లూటీ.. నై తో.. హే రామ్" అని గుల్షన్ దేవయ్య కామెంట్ చేశాడు. ఇక్కడ తమన్నా అంటే ఆశ. "నువ్వే నా ఆశ అనుకున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావ్.. కానీ నా పరువైతే పోలేదు. లేదంటేనా" అన్నది గుల్షన్ చేసిన కామెంట్ కు అర్థం. కానీ అతడు కావాలని తమన్నా పేరును ప్రస్తావిస్తూ విజయ్ ను టీజ్ చేయడం విశేషం.
హిందీలో తమన్నా అంటే కోరిక, ఆకాంక్ష, ఆశ అనే అర్థాలు వస్తాయి. అలా విజయ్ ను టీజ్ చేయడానికి అతడు ఇలా కామెంట్ చేశాడు. దాని వెనుక అసలు అర్థం ఏంటో తెలుసుకున్న అభిమానులు.. గుల్షన్ కామెంట్ ను లైక్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇటు తమన్నాగానీ, అటు విజయ్ గానీ తమ రిలేషన్షిప్ పై ఏమీ స్పందించలేదు.
అయితే అప్పుడప్పుడూ వీళ్లు జంటగా కనిపించడంతో డేటింగ్ నిజమే అని ఫ్యాన్స్ ఫిక్సయిపోతున్నారు. ఇప్పుడు గుల్షన్ చేసిన కామెంట్ చూస్తుంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ వీళ్ల డేటింగ్ వార్తలు బాగానే వ్యాపించినట్లు స్పష్టమవుతోంది. ఇక విజయ్ నటించిన దహాద్ సిరీస్ లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా నటించింది. ఈ సిరీస్ లో ఆమె పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తోంది.
ఈ సిరీస్ లో గుల్షన్ దేవయ్య కూడా నటించాడు. 27 మంది మహిళల హత్యల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. మే 12 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవనుంది. మే 3న సిరీస్ ట్రైలర్ రానున్నట్లు విజయ్ చెప్పాడు.