Hansal Mehta: చెత్త సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి.. బాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్-hansal mehta says terrible films make a lot of money and good ones make less money ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Hansal Mehta Says Terrible Films Make A Lot Of Money And Good Ones Make Less Money

Hansal Mehta: చెత్త సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి.. బాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్

Hari Prasad S HT Telugu
Apr 25, 2023 04:59 PM IST

Hansal Mehta: చెత్త సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి అంటూ బాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్ చేశాడు. బాక్సాఫీస్ కలెక్షన్లను బట్టి సినిమాలను అంచనా వేయడం తగదని అతడు అనడం విశేషం.

బాలీవుడ్ డైెరెక్టర్ హన్సల్ మెహతా
బాలీవుడ్ డైెరెక్టర్ హన్సల్ మెహతా

Hansal Mehta: ఈ రోజుల్లో సినిమా సక్సెస్ ను ఎలా లెక్కిస్తున్నారు? ఆ మూవీ సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్లు బట్టే కదా. కానీ బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా మాత్రం అది సరి కాదని అంటున్నాడు. నిజానికి చెత్త సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని అతడు అనడం విశేషం. బాక్సాఫీస్ నంబర్లు చూసి ప్రేక్షకులు సినిమాలకు వెళ్లొద్దని కూడా సూచిస్తున్నాడు.

ఓ ట్విటర్ యూజర్ చేసిన ట్వీట్ పై హన్సల్ ఇలా స్పందించాడు. ప్రొడ్యూసర్లు, ట్రేడ్ అనలిస్టులు చెప్పే బాక్సాఫీస్ కలెక్షన్లు వేర్వేరుగా ఉంటున్నాయని.. ప్రొడ్యూసర్లు ఉన్నదాని కంటే ఎక్కువ కలెక్షన్లు చూపిస్తున్నారని సదరు యూజర్ ఆరోపించాడు. దీనిపై హన్సల్ స్పందిస్తూ.. ఓ సినిమా బాక్సాఫీస్ అనేది ఎవరికీ సంబంధం లేని విషయం అని స్పష్టం చేశాడు.

"ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఓ సినిమా బాక్సాఫీస్ ఎవరికీ సంబంధం లేని విషయం. అది కేవలం ఆ సినిమాలో ఏదో ఒకరకంగా భాగమైన వారిపై మాత్రమే ప్రభావం చూపిస్తుంది. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. బాక్సాఫీస్ నంబర్లు చూసి ఓ సినిమాను అంచనా వేయకండి. కొన్నిసార్లు చెత్త సినిమాలు ఎక్కువ కలెక్షన్లు సంపాదిస్తే.. మంచి సినిమాలకు తక్కువ కలెక్షన్లు వస్తాయి" అని ట్వీట్ చేశాడు.

ప్రతి సినిమాను ఆడియెన్స్ తమ అనుభవం ప్రకారం అంచనా వేయాలని, తమ టికెట్ ధరకు తగిన అనుభూతి దక్కిందా లేదా అన్నదే చూడాలని హన్సల్ మెహతా సూచించాడు. అతని వాదనను కొందరు సమర్థించగా.. మరికొందరు మాత్రం బాక్సాఫీస్ కలెక్షన్లను బట్టే ఓ సినిమాకు ఆదరణ ఉంటుందని స్పష్టం చేశారు. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ కూడా హన్సల్ వాదనను సమర్థించాడు.

హన్షల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ అద్భుతాలే అయినా.. అవి కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. అతడు షాహిద్, ఒమెర్టా, అలీగఢ్, ఫరాజ్ లాంటి సినిమాలతోపాటు అర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ ఆధారంగా స్కామ్ 1992 అనే వెబ్ సిరీస్ కూడా తీశాడు.

IPL_Entry_Point