Hansal Mehta Tweet Viral: ఫెదరర్‌కు.. ఫిల్మ్ యాక్టర్‌కు తేడా తెలీదురా భాయ్..! కన్ఫ్యూజన్‌తో ఫొటో మార్చిన ప్రముఖుడు
Hansal Mehta Tweet on Federer: బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా కన్ఫ్యూజన్ అయ్యారు. రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్‌పై స్పందిచిన ఆయన.. ఫెదరర్ ఫొటోకు బదులు బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hansal Mehta Tweet on Federer is Viral: సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ అవ్వడం సహజమే. కంగారులో ఓ ఫొటోకు బదులు మరోకదాన్ని షేర్ చేసి.. తర్వాత నాలుక్కరచుకుంటాం. అయితే సెలబ్రెటీల ముఖాలను అంత సులభంగా మర్చిపోరు. టీవీల్లో, పేపర్లలో అంతెందుకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫొన్‌లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు వారి ముఖాలు తారసపడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అయితే ఓ బాలీవుడ్ ప్రముఖుడు.. ఏకంగా టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌నే మర్చిపోయాడు. ఫెదరర్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడికి ట్విటర్ వేదికగా మిస్ యూ చెబుతూ.. వేరే యాక్టర్ ఫొటోను తన పోస్టుకు జత చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. గతేడాది స్కామ్ 1992 సిరీస్‌ను తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హన్సల్ మెహతా. షేర్ మార్కెట్‌లో లాజిక్స్, గిమ్మిక్స్ కళ్లకు కట్టినట్లు తన సిరీస్‌లో చూపిన హన్సల్.. సోషల్ మీడియాలో చిన్న ఫొటోను షేర్ చేయడంలో కన్ఫ్యూజన్ అయ్యాడు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్‌పై స్పందించిన హన్సల్ మెహతా.. అతడి ఫొటోకు బదులు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఫొటోను పోస్ట్ చేశాడు. "రోజర్ ఫెదరర్ ఇకపై నిన్ను మిస్ అవుతాం" అంటూ అర్బాజ్ ఫొటోను జత చేశాడు. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా హన్సల్ మెహతా పెట్టిన పోస్టుపై విశేషంగా స్పందిస్తున్నారు.
"ఫెదరర్ రిటైర్మెంట్‌పై ఇదే బెస్ట్ ట్వీట్" అని ఒకరు పోస్టు పెట్టగా.. "అర్బాజ్, ఫెదరర్ ఇద్దరూ ఒకేలా ఉన్నారు" అని మరో యూజర్ తెలిపారు. "ఫెదరర్ యాక్టింగ్ నువ్వు మిస్ అవ్వవనే ఆశిస్తున్నా" అంటూ ఇంకొకరు స్పందించారు. అంతేకాకుండా కొంతమంది హన్సల్ మెహతా ట్వీట్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు.
టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో తనదైన విజయాలతో దూసుకెళ్లిన ఫెదరర్ ఈ ఏడాది జరగనున్న లేవర్ కప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని గురువారం ట్విటర్ వేదికగా తెలియజేశాడు. వయస్సు రీత్యా తన బాడీ ఆటకు సహకరించడం లేదని తెలిపాడు. కెరీర్‌లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు రఫెల్ నాదల్(22), నొవాక్ జకోవిచ్(21) ముందున్నారు. దీర్ఘకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న ఫెదరర్.. ఆటకు దూరంగా ఉన్నాడు. తన కెరీర్‌రో 6 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఓ ఫ్రెంచ్ ఓపెన్, 8 వింబుల్డన్‌లు, 5 యూఎస్ ఓపెన్ టైటిళ్లు నెగ్గాడు.
సంబంధిత కథనం
టాపిక్