తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amazon Mini Tv In Telugu: తెలుగులో వచ్చేసిన అమెజాన్ మినీ టీవీ.. ఆ టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ ఇక తెలుగులోనే..

Amazon Mini TV in Telugu: తెలుగులో వచ్చేసిన అమెజాన్ మినీ టీవీ.. ఆ టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ ఇక తెలుగులోనే..

Hari Prasad S HT Telugu

19 April 2024, 19:15 IST

google News
    • Amazon Mini TV in Telugu: తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. అన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లను ఫ్రీగా అందించే అమెజాన్ మినీ టీవీ ఇప్పుడు తెలుగులోనూ వచ్చేసింది.
తెలుగులో వచ్చేసిన అమెజాన్ మినీ టీవీ.. ఆ టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ ఇక తెలుగులోనే..
తెలుగులో వచ్చేసిన అమెజాన్ మినీ టీవీ.. ఆ టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ ఇక తెలుగులోనే..

తెలుగులో వచ్చేసిన అమెజాన్ మినీ టీవీ.. ఆ టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ ఇక తెలుగులోనే..

Amazon Mini TV in Telugu: ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నా వాటికి సబ్‌స్క్రిప్షన్ ఉంటేనే చూడగలం. కానీ తన ఓటీటీలో ఉన్న అన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లను ఫ్రీగా అందిస్తుంది అమెజాన్ మినీ టీవీ. ఇప్పుడీ ఓటీటీ తెలుగులోనూ వచ్చేసింది. దీంతో ఇందులోని 200కుపైగా టాప్ మూవీస్, వెబ్ సిరీస్ లను తెలుగులోనూ ఉచితంగా చూడొచ్చు.

తెలుగు, తమిళంలలో మినీ టీవీ

అమెజాన్ మినీ టీవీ ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన ఒరిజినల్స్ ను రూపొందించింది. కొన్నేళ్లుగా ఈ ఓటీటీని ప్రేక్షకులకు ఉచితంగా అందిస్తోంది అమెజాన్. అయితే ఇన్నాళ్లూ కేవలం హిందీలోనే అందుబాటులో ఉండేది. తాజాగా తెలుగు, తమిళం భాషల్లోనూ ఈ షోలను తీసుకొచ్చారు. వాటిని కూడా ఫ్రీగా చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కింది.

మినీ టీవీలో హిందీ ఒరిజినల్స్ తోపాటు హాలీవుడ్, కొరియన్ మూవీస్, షోల డబ్బింగ్ వెర్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ తెలుగులో డబ్ చేసి తీసుకొచ్చింది. ఈ ఓటీటీలో ఇలా 200కుపైగా సినిమాలు, వెబ్ షోలు తెలుగు, తమిళం భాషల్లోకి డబ్ చేశారు. హిందీ ఒరిజినల్స్ అయిన హంటర్, ఫిజిక్స్ వాలా, రక్షక్, హైవే లవ్ లాంటివి తెలుగులోకి వచ్చాయి.

వీటికి తోడు హాలీవుడ్ సినిమాలను కూడా తెలుగులో తీసుకొచ్చారు. వీటిలో ట్విలైట్, నౌ యు సీ మీ, హంగర్ గేమ్స్ సిరీస్, స్టెప్ అప్, రెడ్ లాంటివి ఉన్నాయి. కొరియన్, టర్కిష్, మాండరిన్ భాషల తెలుగు డబ్బింగ్ వెర్షన్లు కూడా మినీ టీవీలో చూడొచ్చు.

మరింత మందికి చేరువగా మినీ టీవీ

అమెజాన్ మినీటీవీ వచ్చి చాలా ఏళ్లే అవుతోంది. ఇందులో ఎంతో క్వాలిటీ కంటెంట్ కూడా ఫ్రీగా అందుబాటులో ఉంది. ఇప్పుడు వీటిని తెలుగు, తమిళం భాషల్లోకి తీసుకురావడంపై అమెజాన్ మినీటీవీ హెడ్ అమోఘ్ దుసాద్ స్పందించారు. "వాళ్ల ఫేవరెట్ షోలను ప్రతి ఒక్కరూ తమ భాషల్లో ఆస్వాదించాలన్నదే మా లక్ష్యం. ఇప్పుడు మేము తీసుకొచ్చిన డబ్బింగ్ కంటెంట్ ను ప్రేక్షకులు ఆస్వాదిస్తారని భావిస్తున్నాం" అని అమోఘ్ అన్నారు.

అమెజాన్ మినీటీవీ వెబ్ సైట్, యాప్ రెండూ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ షాపింగ్ యాప్ లోనూ మినీటీవీ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మినీటీవీలోని కంటెంట్ చూసే వీలుంది.

ఇందులో ముఖ్యంగా యువత మెచ్చే ఒరిజినల్స్ ఎన్నో ఉన్నాయి. ఆస్పిరెంట్స్, హాఫ్ సీఏ, యే మేరీ ఫ్యామిలీ, క్రష్డ్, సిక్సర్, హైవే లవ్ లాంటి వెబ్ సిరీస్ చూడొచ్చు. ఇప్పుడీ కంటెంట్ అంతా తెలుగులోనూ రావడంతో మినీటీవీ క్రేజ్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెజాన్ కు చెందిన ప్రైమ్ వీడియో ఓటీటీ కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే అందులోని కంటెంట్ చూడాలంటే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం