Mini TV Web Series: అమెజాన్ మినీ టీవీలోని టాప్ వెబ్ సిరీస్ ఇవే.. ఎక్కడైనా ఫ్రీగా చూసేయండి-amazon mini tv top web series you can watch these shows for free half ca half love half arranged campus beats web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Amazon Mini Tv Top Web Series You Can Watch These Shows For Free Half Ca Half Love Half Arranged Campus Beats Web Series

Mini TV Web Series: అమెజాన్ మినీ టీవీలోని టాప్ వెబ్ సిరీస్ ఇవే.. ఎక్కడైనా ఫ్రీగా చూసేయండి

Hari Prasad S HT Telugu
Mar 12, 2024 03:15 PM IST

Mini TV Web Series: ఓటీటీల యుగంలో అన్నీ సబ్‌స్క్రిప్షన్ల మీద సినిమాలు, షోలు అందిస్తుంటే అమెజాన్ మినీ టీవీ మాత్రం ఫ్రీగా కొన్ని క్వాలిటీ వెబ్ సిరీస్ లను తీసుకొచ్చింది. అందులో టాప్ వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం.

అమెజాన్ మినీ టీవీలోని టాప్ వెబ్ సిరీస్ ఇవే.. ఎక్కడైనా ఫ్రీగా చూసేయండి
అమెజాన్ మినీ టీవీలోని టాప్ వెబ్ సిరీస్ ఇవే.. ఎక్కడైనా ఫ్రీగా చూసేయండి

Mini TV Web Series: అమెజాన్ మినీ టీవీ నేటి యూత్ కు ఓ వరం అనే చెప్పాలి. పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మంచి మంచి వెబ్ సిరీస్ లను ఈ ఓటీటీ అందిస్తోంది. అందులోనూ ఈ సిరీస్ లన్నీ నేటి యువత మెచ్చేవే.

కామెడీ, లవ్, మిస్టరీ, డ్రామా.. ఇలా అన్ని జానర్లకు చెందిన వెబ్ సిరీస్ ప్రస్తుతం మినీ టీవీలో ఉన్నాయి. వాటిలో కచ్చితంగా చూడాల్సిన టాప్ వెబ్ సిరీస్ ఏవో మీరే చూడండి.

మినీ టీవీలో చూడాల్సిన వెబ్ సిరీస్ ఇవే

అమెజాన్ మినీ టీవీని మొబైల్లో, ల్యాప్‌టాప్ లో, టీవీలోనూ ఫ్రీగా చూసే వీలుండటం విశేషం. అమెజాన్ షాపింగ్ షాప్, వెబ్‌సైట్ల నుంచి కానీ లేదంటే నేరుగా మినీ టీవీ వెబ్‌సైట్ ద్వారా ఈ ఓటీటీలోకి వెళ్లొచ్చు. ఎలాంటి సబ్‌స్క్రిబ్షన్, లాగిన్ వివరాలు అవసరం లేకుండా అందరూ అన్ని షోలనూ చూడొచ్చు.

హాఫ్ సీఏ (Half CA)

హాఫ్ సీఏ.. మినీ టీవీ రూపొందించిన వెబ్ సిరీస్. దేశంలో ఎంతో కఠినమైన కోర్సుల్లో ఒకటైన చార్టెర్డ్ అకౌంటెంట్ చదవాలనుకునే వాళ్లు పడే కష్టాలు, చివరికి అన్ని అటెంప్ట్స్ ముగిసినా సీఏ పూర్తి చేయలేక హాఫ్ సీఏగా మిగిలిపోయే వారి జీవితాలను అద్దం పట్టేలా రూపొందించిన సిరీస్ ఇది. ప్రతి స్టూడెంట్, యువతను ఆకట్టుకునే సిరీస్ ఇది.

హాప్ లవ్ హాఫ్ అరేంజ్డ్ (Half Love Half Arranged)

ఈ కాలం రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో చూపించిన వెబ్ సిరీస్ ఈ హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్. మాన్వీ గంగ్రూ, కరణ్ వాహి నటించిన ఈ సిరీస్ మిలిన్నియల్స్ కు కచ్చితంగా నచ్చుతుంది. మూడేళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్నా కూడా బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేయకపోవడంతో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్సయిన 30 ఏళ్ల గైనకాలజిస్ట్ రియా తన్వార్ (మాన్వీ) స్టోరీయే ఈ హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్.

హు ఈజ్ యువర్ గైనాక్ (Who’s Your Gynac)

మహిళలు ఎదుర్కొనే సెక్సువల్ హెల్త్ సమస్యలను పరిష్కరించాలనుకునే ఓ 21 ఏళ్ల యువతి డాక్టర్ విధూషి కొత్తార్ (సబా ఆజాద్) చుట్టూ తిరిగే సిరీస్ ఇది. కొత్త డాక్టర్ గా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఆ యువతి ఎదుర్కొనే సవాళ్లను ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు.

క్యాంపస్ బీట్స్ (Campus Beats)

ఓ డ్యాన్స్ అకాడెమీలోని కొందరు స్టూడెంట్స్ చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ క్యాంపస్ బీట్స్. టైటిల్ తోనే యువతను ఆకట్టుకునే ప్రయత్నం మేకర్స్ చేశారు. మొదటి నుంచీ చివరి వరకూ ఎంతో ఇంట్రెస్టింగా సాగే సిరీస్ ఇది.

హ్యాక్: క్రైమ్స్ ఆన్‌లైన్ (Hack: Crimes Online)

హ్యాకర్లు.. వాళ్ల పని పట్టే ఎథికల్ హ్యాకర్ల మధ్య నడిచే ఇంట్రెస్టింగ్ వార్ ఈ హ్యాక్: క్రైమ్స్ ఆన్‌లైన్. రిపబ్లిక్ డే పరేడ్ కంటే ముందు దేశంలో తయారైన ఓ అత్యాధునిక డివైస్ మాయం కావడం, దాని ద్వారా హ్యాకర్లు ఎన్నో అరాచకాలకు పాల్పడం, వారికి చెక్ పెట్టడానికి సైబర్ టీమ్ వేసే ఎత్తుగడలతో ఈ హ్యాక్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది.

బడ్తమీజ్ దిల్ (Badtameez Dil)

ఓ సిన్సియర్ లవ్ కోరుకునే అమ్మాయి.. ప్రేమ ఒకరిపై కలిగినా తనను ఆకర్షితులను చేసే అమ్మాయిలందరితోనూ చనువుగా ఉండే అబ్బాయి చుట్టూ తిరిగే కథే బడ్తమీజ్ దిల్. ఫ్రెండ్స్ గా మొదలై.. తర్వాత దూరమై, మళ్లీ ప్రేమికులుగా మారే ఈ ఇద్దరి స్టోరీ ఇంట్రెస్టింగా ఉంటుంది.

IPL_Entry_Point