తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amaran First Review: శివ కార్తికేయన్, సాయిపల్లవి సినిమా అమరన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ విషయాలు అద్భుతం అంటూ..

Amaran First Review: శివ కార్తికేయన్, సాయిపల్లవి సినిమా అమరన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ విషయాలు అద్భుతం అంటూ..

28 October 2024, 11:58 IST

google News
    • Amaran Movie First Review: అమరన్ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో శివకార్తికేయన్, సాయిపల్లవి లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ప్రదర్శితమవటంతో ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చేసింది. ఈ చిత్రం ఎలా ఉందో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించారు.
Amaran First Review: శివ కార్తికేయన్, సాయిపల్లవి సినిమా అమరన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ విషయాలు అద్భుతం అంటూ..
Amaran First Review: శివ కార్తికేయన్, సాయిపల్లవి సినిమా అమరన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ విషయాలు అద్భుతం అంటూ..

Amaran First Review: శివ కార్తికేయన్, సాయిపల్లవి సినిమా అమరన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ విషయాలు అద్భుతం అంటూ..

అమరన్ సినిమా అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదల అవుతోంది. తమిళంతో పాటుత తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం వస్తోంది. ఈ మూవీలో తమిళ హీరో శివకార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించారు. భారత అమర సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజ్ జీవితంపై అమరన్ చిత్రం రూపొందింది. ఈ మూవీకి రాజ్‍కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.

భారత ఆర్మీ స్టాఫ్‍కు అమరన్ సినిమా ప్రీమియర్‌ను మూవీ టీమ్ ఇటీవల నిర్వహించింది. ఈ ప్రీమియర్లకు సైనికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో రివ్యూ రాశారు. చిత్రం ఎలా ఉందో తన అభిప్రాయాన్ని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ఈ మూవీకి తన రివ్యూను ఇచ్చారు.

అద్భుతమైన స్క్రిప్ట్, యాక్టింగ్

అమరన్ సినిమా రివ్యూను మణి సారధి అనే వ్యక్తి పోస్ట్ చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్, డైరెక్షన్, యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. “అమరన్ స్పెషల్ స్క్రీనింగ్ చూడడం గౌరవంగా భావిస్తున్నా. స్ఫూర్తివంతమైన అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ జీవితం, త్యాగం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. నమ్మశక్యం కాని విధంగా స్క్రిప్ట్, దర్శకత్వం, యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్ ఉండి నినమ్రతతో ఉన్న ప్రధాన నటీనటులు, దర్శకుడిని కలిశా. ఇండియన్ ఆర్మీకి సెల్యూట్” అని ఆయన అమరన్ మూవీ గురించి రాసుకొచ్చారు.

అమరన్ చిత్రానికి వచ్చిన ఈ ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది దీన్ని షేర్ చేస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

2014 ఏప్రిల్‍లో కశ్మీర్‌లోని ఓ గ్రామంలో ఉగ్రవాదుల కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ అమరుడయ్యారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆశోకచక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆయన జీవితం ఆధారంగా అమరన్ చిత్రం వస్తోంది. రచయితలు శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియన్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మిలటరీ హీరోస్ బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజ్‍కుమార్ పెరియసామి తెరకెక్కించారు.

గర్వంగా ఉంది

అమరన్ సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో సాయిపల్లవి మాట్లాడారు. అమరన్ చిత్రాన్ని చేసినందుకు తాను చాలా గర్వపడుతున్నానని సాయిపల్లవి చెప్పారు. ఇది మామూలు సినిమా స్టోరీ కాదని, ఓ సైనికుడి నిజమైన జీవితం అని ఆమె అన్నారు. అమరన్ మంచి చిత్రం అని చెప్పారు.

అమరన్ సినిమాను లోకనాయుకుడు, తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ నిర్మించారు. మహేంద్రన్, వివేక్ కృష్ణని కూడా సహ నిర్మాతలుగా ఉన్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

తదుపరి వ్యాసం