OTT Thriller: అమలాపాల్, జీతూజోసెఫ్ మలయాళం థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్!
06 October 2024, 13:17 IST
OTT Thriller: అమలాపాల్ లెవెల్ క్రాస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఆహా ఓటీటీలో ఈ వారమే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. ఈ సినిమాకు దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
ఓటీటీ థ్రిల్లర్
OTT Thriller: అమలాపాల్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లెవెల్ క్రాస్ ఈ వారమే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆహా ఓటీటీ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా పోస్టర్‌ను ఆహా ఓటీటీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అక్టోబర్ 11న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ థ్రిల్లర్ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. షరాఫుద్దీన్ కీలక పాత్రలో నటించాడు.అర్భాఫ్ అయూబ్ దర్శకత్వం వహించాడు. జూలైలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
జీతూ జోసెఫ్ ప్రజెంటర్...
మలయాళం అగ్ర దర్శకుడు జీతూ జోసెఫ్ లెవెల్ క్రాస్ మూవీకి ప్రజెంటర్‌గా వ్యవహరించాడు. జీతూ జోసెఫ్ శిష్యుడిగా దృశ్యంతో పాటు పలు సినిమాలకు అర్ఫాజ్ అయూబ్ పనిచేశాడు. లెవెల్ క్రాస్ మూవీతోదర్శకుడిగా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో అమలాపాల్, ఆసిఫ్ అలీ ఇద్దరు డ్యూయల్ రోల్‌లో కనిపించారు.
పది కోట్ల బడ్జెట్...
దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లెవెల్ క్రాస్ మూవీ రెండు కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. టైమ్ లూప్ పాయింట్‌ను ఆడియెన్స్‌కు అర్థవంతంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. లెవెల్ క్రాస్ మూవీకి సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతో అమలాపాల్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఓ పాట పాడింది.
లెవెల్ క్రాస్ కథ ఇదే...
శిఖా (అమలాపాల్) ఓ సైకలాజిస్ట్. . మానసిక సమస్యలతో బాధపడుతోన్న శిఖా డాక్టర్ జింకోను కలుస్తుంది. అక్కడే ఆమె కొత్త వరల్డ్ లోకి ఎంటర్ అవుతుంది. ఎడారికి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో రైల్వే గేట్‌మెన్‌గా పనిచేస్తున్న రఘు (ఆసిఫ్ అలీ) ఆమెకు తారసపడతాడు. అక్కడ తన పేరును చైతాలిగా (అమలాపాల్) చెబుతుంది శిఖా. ఆమె అలా ఎందుకు చెప్పింది. అసలు రఘు ఎవరు? జార్జ్‌కు శిఖా ఎందుకు దూరమైంది? రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటన్నదే ఈ మూవీ కథ.
రెండు సినిమాలు...
2024లో ఆడుజీవితంతో పాటు లెవెల్ క్రాస్ సినిమాల్లో కనిపించింది అమలాపాల్. రెండు సినిమాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. మలయాళంలో కొన్నేళ్లుగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ప్రయోగాత్మక సినిమాలే ఎక్కువగా చేస్తోంది అమలాపాల్. 2022లో వచ్చిన మలయాళ మూవీ కడావర్‌కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది అమలాపాల్. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన బాలీవుడ్ భోళాలో గెస్ట్ రోల్ చేసింది.
తెలుగులో...
తెలుగులోనూ రామ్‌చరణ్ నాయక్, అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. గత ఏడాది బిజినెస్‌మెన్ జగత్ దేశాయ్‌ను పెళ్లిచేసుకున్నది అమలపాల్. ఆమెకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. 2014లో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లిచేసుకున్నది అమలాపాల్. మనస్పర్థల కారణంగా 2017లో అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఈ ఏడాది జూలైలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది అమలాపాల్.