Mohanlal Jeethu Joseph: దృశ్యం కాంబో మళ్లీ వస్తోంది.. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ మూవీ అనౌన్స్‌మెంట్
Mohanlal Jeethu Joseph: దృశ్యం కాంబో మళ్లీ వస్తోంది. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ మూవీ అనౌన్స్‌మెంట్ గురువారం (జులై 13) జరిగింది. మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు.
Mohanlal Jeethu Joseph: మలయాళంలో మొదట వచ్చిన దృశ్యం మూవీ ఎంత పెద్ద హిట్టో తెలుసు కదా. రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీలోని ట్విస్టులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత తెలుగు, హిందీల్లోనూ ఈ దృశ్యం రీమేక్స్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడా మూవీ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరూ రామ్ అనే మరో మూవీ చేస్తున్నారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ మరో సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. అయితే ఇది దృశ్యం సీక్వెల్ కోసమో లేదంటే రామ్ మూవీ కోసమో కాదు. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్ట్. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ ఈ కొత్త ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసింది. రామ్ పూర్తి కాగానే ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా చాలా వరకూ కొచ్చి, త్రివేండ్రంలలోనూ షూటింగ్ జరుపుకోనుంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మోహన్‌లాల్ మరోవైపు వృషభ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా నటిస్తున్నాడు.
మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన దృశ్యం మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా రెండు భాగాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. నిజానికి మలయాళం కంటే కూడా తెలుగు, హిందీల్లో ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ముఖ్యంగా దృశ్యం 2 అయితే మలయాళంలో కేవలం రూ.25 కోట్లు రాబట్టగా.. హిందీలో అయితే రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది.