తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Alpha Review: ఆల్ఫా రివ్యూ.. సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ అండ్ విజువల్ వండర్ మూవీ ఆకట్టుకుందా?

Alpha Review: ఆల్ఫా రివ్యూ.. సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ అండ్ విజువల్ వండర్ మూవీ ఆకట్టుకుందా?

Sanjiv Kumar HT Telugu

13 April 2024, 11:55 IST

google News
  • Alpha Movie Review In Telugu: ఓటీటీలో ఎన్నో చిత్రాలు అలరిస్తున్నాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న సినిమాల్లో ఆల్ఫా ఒకటి. 2018లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మంచి టాక్ తెచ్చుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో ఆల్ఫా రివ్యూలో చూద్దాం.

ఆల్ఫా రివ్యూ- సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ అండ్ విజువల్ వండర్ మూవీ ఆకట్టుకుందా?
ఆల్ఫా రివ్యూ- సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ అండ్ విజువల్ వండర్ మూవీ ఆకట్టుకుందా?

ఆల్ఫా రివ్యూ- సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ అండ్ విజువల్ వండర్ మూవీ ఆకట్టుకుందా?

Alpha Review In Telugu: సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌లో అనేక సినిమాలు వచ్చాయి. కానీ, ఒక మనిషి, ఒక తోడేలు కలిసి ప్రాణాల కోసం పోరాటం చేసే సినిమాలు చాలా అరుదుగా వచ్చాయి. అలాంటి వాటిలో ఆల్ఫా మూవీ ఒకటి. 2018 ఆగస్ట్ 17న థియేటర్లలో విడుదలైన ఆల్ఫా మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.

ఆల్ఫా మూవీలో కోడి స్మిత్ మెక్‌ఫీ, జోహన్నెస్ హౌకుర్ జోహన్నెసన్, నటాసియా మాల్తే, లియోనార్ వరెలా, స్పెన్సర్ బోగర్ట్, జెన్స్ హుల్టెన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆల్బర్ట్ హ్యుస్ దర్శకత్వం వహించారు. 51 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 99 మిలియన్లకుపైగా వసూలు చేసి మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు ట్రెండింగ్‌లో కొనసాగుతున్న సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఆల్ఫా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

2000 సంవత్సరాల క్రితం ఒక గిరిజన తెగ ఉంటుంది. వారి నాయకుడు టా (జోహన్నెస్ హౌకుర్ జోహన్నెసన్) వారు జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తుంటారు. శీతకాలానికి సరిపడే మాంసం కోసం వేటకోసం వెళ్తారు. గిరిజన తెగ నాయకుడు టా బృందంతోపాటు అతని కుమారుడు కేడా (కోడి స్మిత్ మెక్‌ఫీ) కూడా వేటకు వెళ్తాడు. కానీ, ప్రమాదవశాత్తు ఓ లోయలో పడిపోతాడు. దాంతో కేడా చనిపోయాడనుకుని తెగ బృందం వెళ్లిపోతుంది.

హైలెట్స్

లోయలో పడిన కేడా బతికి ఎలా బయటపడ్డాడు? లోయలో నుంచి పైకి ఎలా వచ్చాడు? తన వాళ్లు ఉన్న ప్రాంతానికి కేడా చేరుకున్నాడా? ఈ ప్రయాణంలో ఇతర జంతువుల నుంచి కేడాకు ఎలాంటి ప్రమాదం ఎదురైంది? తనపై దాడి చేసిన తోడేలు (ఆల్ఫా)ను కేడా ఎందుకు కాపాడాల్సి వచ్చింది? కేడా, తోడేలు ఎలాంటి ప్రయాణం చేశారు? చివరికి ప్రాణాలతో తల్లిదండ్రులను కేడా, తోడేలు చేరుకున్నారా? అనేది తెలియాలంటే ఆల్ఫా మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఆది మానవులు జంతువులను వేటాడి వాటి మాంసాన్ని నిప్పుపై కాల్చి వండుకుని తినేవారని తెలిసిందే. అనంతరం వాటిని వేటాడటమే కాకుండా వాటిలో కొన్ని జంతువులను మచ్చిక చేసుకుని, జీవణానికి ఉపయోగించుకున్నారు. మనిషి, జంతువు మనుగడకు ఎలా ఒక్కటి అయ్యాయో సర్వైవల్ థ్రిల్లర్ అంశాలతో చూపించిన సినిమానే ఆల్ఫా.

తండ్రీకొడుకుల ఎమోషన్

గిరిజన తెగలో యువ వేటగాడు అయిన కేడా లోయలో పడిపోవడంతోనే ఆల్ఫా సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దానికంటే ముందు జరిగిన కథను చూపించి తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఎమోషన్‌ అర్థమయ్యేలా ఆవిష్కరించారు. ఆ ఎమోషన్ ఆ తర్వాత అంతగా క్యారీ అవ్వదు. లోయలో నుంచి బయటపడిన కేడాపై తోడేళ్ల గుంపు అటాక్ చేయడం, దానిలో ఒకదాన్ని కేడా కత్తితోగాయపరచడం సీన్లు కథవైపు ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.

ఆసక్తిగా మనిషి-తోడేలు సీన్స్

ఆ తర్వాత గాయం చేసిన తోడేలుకు చికిత్స చేయడం, దానికి ఆల్ఫా అని పేరు పెట్టడం, ఇద్దరూ కలిసి ఎడారి, మంచులో తమ వాళ్లను కలుసుకునేందుకు ప్రయాణించడం ఆసక్తిగానే ఉంటుంది. కానీ, రిపీటెడ్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఒకటిరెండు సార్లు మాత్రమే ఈ ఇద్దరిపై ఇతర జంతువులు చేసే దాడి, వాటినుంచి కేడా, ఆల్ఫా కాపాడుకునే తీరు మెప్పిస్తుంది. మధ్యలో తన కన్నవాళ్ల గురించి ఆలోచించే సీన్లు అంతగా ఎమోషనల్‌గా కనెక్ట్ కావు.

ఆకట్టుకునే క్లైమాక్స్

డైలాగ్స్ కూడా గొప్పగా అనిపించవు. కానీ, విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. ముఖ్యంగా రాత్రి పూట చూపించే విజువల్స్ సూపర్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. జంతువులను మనుషులు ఎలా మచ్చిక చేసుకున్నారు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఎలా చూశారో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ద్వారా చూపించారు. కానీ, అది చాలా వరకు అర్థం కాకపోవచ్చు.

ఆల్ఫా మీనింగ్

ఆల్ఫా అంటే ఒక నాయకుడు అని అర్థం వస్తుంది. తన వారిని కాపాడటమే కాకుండా ప్రత్యర్థులు, తన వారి నుంచి ఎదురయ్యే ఛాలెంజ్‌లకు ఎప్పుడూ రెడీగా ఉండి ఎదుర్కొనే వాళ్లనే ఆల్ఫా అంటారని సినిమాలో తన కొడుకు కేడాకు తండ్రి టా చెబుతాడు. ఆల్ఫా అని సమర్థవంతమైన నాయకత్వపు లక్షణాలు ఉన్న తోడేలును అంటారని వేటకు వెళ్లేముందు రోజు రాత్రి కొడుకుకు లీడర్‌షిప్ గురించి వివరిస్తాడు. ఈ సీన్ తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ ఎలివేట్ చేసేలా ఉంది.

గంటన్నర రన్ టైమ్

ఇక సినిమాలో ప్రతి ఒక్కరూ బాగా నటించారు. తెలుగు డబ్బింగ్ అంతగా బాగుండదు. కానీ, వారు మాట్లాడే తెగ విచిత్రంగా ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూస్తే మంచి ఫీల్ వస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే గంటన్నర రన్ టైమ్ ఉన్న ఆల్ఫా మూవీని వీకెండ్‌లో టైమ్ పాస్‌కు ఫ్యామిలీతో సహా చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం