Pushpa 3: పుష్ప 3 షూటింగ్ మొదలయ్యేది మూడేళ్ల తర్వాతే? - స్టోరీ ఇదేనా? విలన్స్ ఎవరంటే?
05 December 2024, 16:31 IST
Pushpa 3: పుష్ప 2కు కొనసాగింపుగా పుష్ప 3ని మేకర్స్ అనౌన్స్‌చేశారు. పుష్ప ది రాంపేజ్ పేరుతో మూడో భాగం తెరకెక్కుతోన్నట్లు ప్రకటించారు. పుష్ప 3 స్టోరీపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తోన్నాయి. మూడో పార్ట్ షూటింగ్ 2028లో మొదలయ్యే అవకాశం ఉందని చెబుతోన్నారు.
పుష్ప 3
Pushpa 3: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 తొలిరోజే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ మూవీ 125 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రీమియర్స్ షోస్ కలుపుకొని మొదటిరోజు పుష్ప ది రూల్ మూవీ 250 కోట్లకుపైనే వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
పాజిటివ్ టాక్...
ప్రీమియర్స్ షోస్ నుంచే పుష్ప 2 మూవీకి పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. అల్లు అర్జున్ యాక్టింగ్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తోన్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. మాస్ యాక్షన్ అంశాలు బలంగానే దట్టించి సుకుమార్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించాడు.
పుష్ప 3 ది రాంపేజ్...
పుష్ప 2కు కొనసాగింపుగా పుష్ప 3 కూడా రాబోతుంది. పుష్ప ది రూల్ సీక్వెల్‌లో పార్ట్ 3 ఉండబోతున్నట్లు అనౌన్స్‌చేశారు. పుష్ప ది రాంపేజ్ అనే టైటిల్‌తో పార్ట్ 3 రాబోతోంది. పుష్ప 2 క్లైమాక్స్‌లో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉండబోతున్నందని సుకుమార్ హింట్ ఇచ్చేశాడు.
పార్ట్ 3లో జగపతిబాబు మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. పుష్పపై పగతో రగిలిపోతున్న ప్రతాపరెడ్డి, జాలీరెడ్డి, మంగళం శీను, దాక్షాయణితో పాటు మిగిలిన విలన్స్ గ్యాంగ్ అంతా ఒక్కటైనట్లుగా పుష్ప 2లో చూపించారు. సీఏం సిద్ధప్పతో దూరం కావడంతో పుష్పరాజ్ ఒంటరివాడైపోయినట్లు ప్రజెంట్ చేశారు. విలన్స్ గ్యాంగ్స్ అందరితో పుష్పరాజ్ చేసే పోరాటం నేపథ్యంలోనే పార్ట్ 3 కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది.
మరో కొత్త విలన్ కూడా....
భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర పార్ట్ 3లోనూ సర్‌ప్రైజింగ్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతాపరెడ్డి, జాలీరెడ్డి, భన్వర్ సింగ్ షెకావత్‌తో పాటు మరో కొత్త విలన్ కూడా ఉంటాడని అంటున్నారు.
జైలులో పుష్పరాజ్...
మరోవైపు చాలా రోజుల క్రితం రిలీజైన పుష్ప 2 టీజర్‌లో జైలు నుంచి పుష్పరాజ్ తప్పించుకున్నట్లుగా...అతడిని చూసి పులి రెండు అడుగులు వెనక్కి వేసినట్లుగా సుకుమార్ చూపించారు. పుష్పరాజ్‌కు జాలీరెడ్డి గన్ గురిపెట్టే సీన్స్ టీజర్‌లో కనిపించాయి. ఈ సీన్స్ పుష్ప 2 సినిమాలో మాత్రం లేవు. వీటిని కట్ చేశారా...పార్ట్ 3 కోసం దాచిపెట్టారా అన్నది అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. పుష్ప రాజ్‌పై పగతోనే ప్రతాప రెడ్డి అతడిని జైలుకు పంపిస్తాడని, ఈ సన్నివేశాలు పార్ట్ 3లో ఉండొచ్చని అభిమానులు చెబుతోన్నారు.
2028లోనే...
పుష్ప ది రాంపేజ్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని సమాచారం. పుష్ప, పుష్ప 2 సినిమాల కోసం అల్లు అర్జున్, సుకుమార్ గత ఐదారేళ్ల సమయాన్ని కేటాయించారు. పుష్ప వరల్డ్ నుంచి బయటకు వచ్చి మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతుండగా...సుకుమార్...రామ్‌చరణ్ ఓ మూవీని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే పుష్ప 3 షూటింగ్ మొదలుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2028లోనే పుష్ప 3 సెట్స్‌పైకి రానుందని ప్రచారం జరుగుతోంది.