Rice Flour Roti Recipe: బియ్యం పిండితో ఈ తీరులో రొట్టెలు చేయండి.. మృధువుగా, రుచికరంగా అదుర్స్ అనిపిస్తాయి-akki roti recipe make rice flour roti like this for soft and tasty ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rice Flour Roti Recipe: బియ్యం పిండితో ఈ తీరులో రొట్టెలు చేయండి.. మృధువుగా, రుచికరంగా అదుర్స్ అనిపిస్తాయి

Rice Flour Roti Recipe: బియ్యం పిండితో ఈ తీరులో రొట్టెలు చేయండి.. మృధువుగా, రుచికరంగా అదుర్స్ అనిపిస్తాయి

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2024 11:30 AM IST

Rice Flour Roti Recipe: బియ్యం పిండితో కూడా రొట్టెలు చేయవచ్చు. అయితే కొన్నిసార్లు గట్టిగా వస్తాయి. అయితే, ఈ తీరులో రొట్టెలు చేస్తే మృధువుగా, రుచికరంగా ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Rice Flour Roti Recipe: బియ్యం పిండితో ఈ తీరులో రొట్టెలు చేయండి.. మృధువుగా, రుచికరంగా అదుర్స్ అనిపిస్తాయి
Rice Flour Roti Recipe: బియ్యం పిండితో ఈ తీరులో రొట్టెలు చేయండి.. మృధువుగా, రుచికరంగా అదుర్స్ అనిపిస్తాయి

రొట్టెలను ఎక్కువగా జొన్నలు, రాగులతో తయారు చేస్తారు. బియ్యం పిండితోనూ రొట్టెలు చేయవచ్చు. అయితే, బియ్యం పిండితో రొట్టెల చేస్తే గట్టిగా ఉంటాయని ఎక్కువ మంది తయారు చేసుకోరు. అయితే, ఓ తీరులో బియ్యం పిండితో రొట్టెలు చేస్తే మృధువు ఉండటంతో పాటు మంచి రుచిగా ఉంటాయి. బాగా తినాలనిపిస్తాయి. సాఫ్ట్‌గా ఉండే బియ్యం పిండి రొట్టెలను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

బియ్యం పిండి రొట్టెలకు కావాల్సిన పదార్థాలు

  • ఓ కప్పు బియ్యం పిండి
  • ఓ కప్పు నీరు
  • ఓ టేబుల్ అల్లం పేస్ట్
  • ఓ టేబుల్‍స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్
  • ఓ టేబుల్ స్పూన్ కత్తిమీర తరుగు
  • వంట నూనె
  • తగినంత ఉప్పు

బియ్యం పిండి రొట్టెలు తయారు చేసుకునే విధానం

  • ముందుగా స్టౌవ్‍పై కళాయి పెట్టి అందులో నీరు పోయాలి. కాస్త వేడెక్కాక అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తమీర తరుగు, సరిపడా ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ నూనె వేయాలి.
  • నీరు బాగా మరిగించాలి. నీరు మరిగాక అందులో బియ్యం పిండి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. పిండిని చల్లారనివ్వాలి.
  • ఆ రొట్టె పిండి చల్లాక చేతులతో బాగా కలుపుకోవాలి. అనంతరం దాన్ని చిన్న ఉండలు చేసుకోవాలి.
  • ఆ పిండి ఉండలను చపాతీ కర్రతో రొట్టెలా గుండ్రంగా వత్తుకోవాలి. పైన పొడిపిండి వేసి వీటిని వత్తుకోవాలి.
  • ఆ రొట్టెను వేడెక్కిన పెనంపై వేయాలి. మంటను మీడియంలో ఉంచి రెండువైపులా కాల్చుకోవాలి.
  • ఓ వైపు రొట్టె కాలి రంగు మారక కాస్త పొంగుతుంది. అప్పుడు నూనె వేయాలి. ఆ తర్వాత మరోవైపునకు తిప్పి నూనె వేసి కాల్చుకోవాలి. అంతే మృధువుగా ఉండే బియ్యం పిండి రొట్టెల రెడీ అవుతాయి.

బియ్యం పిండితో ఈ తరహాలో రొట్టెలు చూసుకుంటే మృధువుగా వస్తాయి. బియ్యం పిండిలో నేరుగా నీళ్లు కలిపి చేస్తే గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ తీరులో ట్రై చేయండి. ఇలా చేసిన బియ్యం పిండి రొట్టెలను కర్రీ లేకుండా నేరుగా తినేయవచ్చు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మంచి రుచిని, ఫ్లేవర్‌ను ఇస్తాయి.

Whats_app_banner