Alanna Pandey: బ్రాపై షర్ట్ వేసుకోవడం మరచిపోయావా?: ఓటీటీ స్టార్‌కు క్లాస్ పీకిన తండ్రి.. వీడియో వైరల్
08 October 2024, 13:26 IST
- Alanna Pandey: ఓటీటీ స్టార్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన అలనా పాండేకు ఆమె తండ్రి క్లాస్ పీకాడు. బ్రా వేసుకొని షర్ట్ వేసుకోవడం మరచిపోయావా అని ఆయన అడుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రాపై షర్ట్ వేసుకోవడం మరచిపోయావా?: ఓటీటీ స్టార్‌కు క్లాస్ పీకిన తండ్రి.. వీడియో వైరల్
Alanna Pandey: అనన్య పాండే తెలుసు కదా. లైగర్ మూవీతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరైన నటి ఆమె. ఇప్పుడామె కజిన్ అయిన అలనా పాండే వార్తల్లో నిలిచింది. ఈమె ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ది ట్రైబ్ షో ద్వారా పాపులర్ అయింది. తాజాగా అలనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అలనా పాండేకు తండ్రి క్లాస్
బాలీవుడ్ ప్రముఖ నటుడు చుంకీ పాండే తమ్ముడైన చిక్కీ పాండే కూతురే ఈ అలనా పాండే. ఈ ది ట్రైబ్ షోలో భాగంగా ఓ చిన్న వీడియోను ఈ మధ్య అలనా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఇందులో తన కుటుంబమంతా ఓ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం చూడొచ్చు. ఆ సమయంలో అలనా పాండే ఓ బ్రాలెట్ వేసుకొని కనిపించింది.
అది చూసిన ఆమె తండ్రి.. బ్రా వేసుకొని పైన షర్ట్ వేసుకోవడం మరచిపోయావా అని అడుగుతారు. దీనికి అలనా స్పందిస్తూ.. సీరియస్ గా అడుగుతున్నారా అని అంటుంది. దానిపైన ఓ షర్ట్ వేసుకోవచ్చు కదా అని తండ్రి అంటారు. ఈ డ్రెస్ తో వచ్చిన సమస్య ఏముంది అని అలనా అడుగుతుంది. ఇది బ్రాలెట్ అని చెబుతుంది.
అదే మరి బ్రాలెట్ అంటే బ్రానే కదా.. దానిపై షర్ట్ వేసుకోవాలి కదా.. ఇదేమీ లాస్ ఏంజిల్స్ కాదు.. బాంద్రా అని ఆయన అలనాకు క్లాస్ పీకుతారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆమె నవ్వుతూ అలా ఉండిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆయన చెప్పేది కరెక్టే కదా..
ఈ వీడియో వైరల్ గా మారిన తర్వాత చాలా మంది ఆమె తండ్రికి మద్దతు తెలిపారు. చిక్కీ పాండే చెప్పేది నిజమే అని అన్నారు. ఈ జనరేషన్ ఆడపిల్లలు డ్రెస్ వేసుకొనే మ్యానర్స్ మరచిపోయారంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. కుటుంబంతో కలిసి కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో ఆయన చెప్పేది నిజంగా కరెక్టే అని మరో యూజర్ అన్నారు.
మరోవైపు అలనాకు మద్దతుగా కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె తండ్రి ఇలా అందరి ముందూ అలా అనడం సరికాదని ఓ యూజర్ అనగా.. ఆమె శరీరం.. ఆమె ఇష్టం.. ఏ డ్రెస్ అయినా వేసుకుంటుంది అని మరొకరు అన్నారు.
ది ట్రైబ్ ఓ ఇండియన్ రియాల్టీ షో. దీనిని ఓంకార్ పొట్దార్ డైరెక్ట్ చేశాడు. అలనా పాండేతోపాటు మరికొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది.