War 2 Jr NTR: ఈ బాలీవుడ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకోవడానికి కారణం ఇదేనట.. ఆ హీరో కోసమే..-war 2 movie jr ntr roped in for hrithik roshan says a report devara star make his bollywood debut ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  War 2 Jr Ntr: ఈ బాలీవుడ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకోవడానికి కారణం ఇదేనట.. ఆ హీరో కోసమే..

War 2 Jr NTR: ఈ బాలీవుడ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకోవడానికి కారణం ఇదేనట.. ఆ హీరో కోసమే..

Hari Prasad S HT Telugu
Oct 07, 2024 04:14 PM IST

War 2 Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేయనున్న విషయం తెలుసు కదా. అయితే ఈ సినిమాలో అతన్ని తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణమే ఉందని, ఆ హీరో కోసమే అతన్ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ బాలీవుడ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకోవడానికి కారణం ఇదేనట.. ఆ హీరో కోసమే..
ఈ బాలీవుడ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకోవడానికి కారణం ఇదేనట.. ఆ హీరో కోసమే..

War 2 Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో తన బాలీవుడ్ డెబ్యూ కోసం కూడా సిద్ధమవుతున్నాడు. అతడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్న సంగతి తెలుసు కదా. అయితే ఈ మూవీలో తారక్ ను తీసుకోవడానికి కారణం హృతిక్ రోషనే అని వార్తలు వస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ అందుకే..

వార్ 2 మూవీలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే ముంబై వెళ్లి తారక్ ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. ఈ తెలుగు సూపర్ స్టార్ వార్ 2లో ఉండటంతో హృతిక్ మరో హిట్ కొట్టినట్లే అని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా అనుకోవడానికి ఓ బలమైన కారణమే ఉంది.

బాలీవుడ్ గ్రీక్ గాడ్ గా పేరున్న హృతిక్ రోషన్ గత ఐదేళ్లలో మంచి హిట్సే కొట్టాడు. 2019లో వచ్చిన వార్, ఈ ఏడాది వచ్చిన ఫైటర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకు ఓ లింకు ఉంది. వీటిలో హృతిక్ ఒంటరిగా కాకుండా టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్ లాంటి ఇతర స్టార్లతో నటించాడు. ఇక గతేడాది సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3లోనూ హృతిక్ ఓ గెస్ట్ రోల్లో కనిపించాడు. నిజానికి అంతకుముందు వచ్చిన విక్రమ్ వేదా సినిమాలోనూ హృతిక్ తోపాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. ఆ సినిమా కూడా హిట్ అయింది.

దీంతో మల్టీ స్టారర్ సినిమాలే హృతిక్ కు బాగా కలిసి వస్తాయన్న ఓ నమ్మకం ఏర్పడింది. ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోని వార్ 2 మూవీలోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పుడీ వార్ 2తో ఈ ఇద్దరు సౌత్, నార్త్ హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని చూస్తున్నారు. తారక్ ఉండటంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రాబోతున్నాయి.

విలన్‌గా జూనియర్ ఎన్టీఆర్

వార్ 2 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఓ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే దేవర మూవీ ప్రమోషన్లలో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న తారక్.. వార్ 2 గురించి చెప్పుకొచ్చాడు. గతంలో యే జవానీ హై దివానీ, బ్రహ్మస్త్రలాంటి సినిమాలు చేసిన అయాన్ ముఖర్జీ ఇప్పుడీ ఇద్దరు స్టార్లతో ఏం చేయబోతున్నాడో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

అందులోనూ ఓ బాలీవుడ్ హీరోకి జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా ఉండటంతో ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి రేపుతోంది. తొలిసారి ఇలా ఓ నెగటివ్ రోల్లో తారక్ ఏం మాయ చేస్తాడో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ వార్ 2 మూవీని పెద్ద హిట్ చేస్తాయన్న అంచనా ఉంది. మరి హృతిక్ సెంటిమెంట్ ఈ మూవీకి ఎంత వరకూ కలిసి వస్తుందో చూడాలి.

Whats_app_banner