తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hit-2 First Song Released: హిట్ 2 నుంచి అదిరే మెలోడీ వచ్చేసింది.. హృదయాన్నే తాకేస్తుంది

Hit-2 First Song Released: హిట్ 2 నుంచి అదిరే మెలోడీ వచ్చేసింది.. హృదయాన్నే తాకేస్తుంది

10 November 2022, 14:49 IST

    • Hit-2 First Song Released: అడివి శేష్ హీరోగా రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ నుంచి మరో పాట విడుదలైంది. ఉరికే ఉరికే అంటూ సాగే ఈ పాట ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. సైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
హిట్ 2 నుంచి అదిరిపోయే మెలోడీ
హిట్ 2 నుంచి అదిరిపోయే మెలోడీ

హిట్ 2 నుంచి అదిరిపోయే మెలోడీ

Hit-2 First Song Released: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం హిట్: ది సెకండ్ కేస్. 2020లో వచ్చిన హిట్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా చేసింది. హిట్ ఫేమ్ సైలేష్ కొలను ఈ మూవీకీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్, టీజర్ ఆడియెన్స్‌లో చిత్రంపై బాగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ పాటను విడుదల చేశారు మేకర్స్.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

ఇటీవల విడుదలైన ప్రోమో సాంగ్‌కే ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ రాగా.. తాజాగా ఫుల్ సాంగ్ మరింత ఆకట్టుకుంటోంది. హృదయాన్ని టచ్ చేసేలా ఉన్న ఈ మెలోడీ సాంగ్‌లో అడివి శేష్, మీనాక్షి చౌదరి కెమెస్ట్రీ అదిరిపోయింది. ఈ పాటలో రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్లు లాంటి ఉండటంతో యువతను బాగా ఆకర్షిస్తోంది. అంతేకాకుండా ఎంఎం శ్రీలేఖ రూపొందించిన ఈ మెలోడీ ట్యూన్ ఎంతో సరికొత్తగా ఉంది. పాటలో ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేసింది. ఫలితంగా మ్యూజిక్ లవర్స్ నుంచి ప్రశంసల వర్షం వెల్లువెత్తుతోంది.

సిద్ శ్రీరామ్, రమ్య బెహ్రా ఎంతో మధురంగా ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించింన ఈ పాట అద్భుతంగా సాగింది. శ్రోతల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేస్తుండగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.