Adivi Sesh on Hit 2 teaser: షాకింగ్.. హిట్ 2 టీజర్‌ను యూట్యూబ్ నుంచి తీసేశారా.. ఇలా చూడండి
Adivi Sesh on Hit 2 teaser: హిట్ 2 టీజర్‌ను యూట్యూబ్ నుంచి తీసేశారన్న వార్త మేకర్స్‌ను షాక్‌కు గురి చేసింది. హింస ఎక్కువగా ఉండటంతో ఈ వీడియోను 18 ఏళ్లలోపు వారికి అనుమతించడం లేదు. దీంతో ఈ వీడియోను ఎలా చూడాలో అడివి శేష్ చెప్పాడు.
Adivi Sesh on Hit 2 teaser: డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ మూవీతో ఎంతటి సంచలనం సృష్టించాడో మనకు తెలిసిందే. ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని సక్సెస్ సాధించింది. ఇప్పుడిక ఈ మూవీ సీక్వెల్ హిట్ 2 వస్తోంది. డిసెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇందులో అడివి శేష్ లీడ్ రోల్‌లో నటించాడు. ఈ మూవీ టీజర్ ఈ మధ్యే రిలీజ్ కాగా.. దీనికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నంబర్ 1లో ట్రెండింగ్ అవుతూ ఇప్పటికే సుమారు కోటి వరకూ వ్యూస్ రావడం విశేషం.
అయితే ఇందులో కాస్త వయలెన్స్ డోసు ఎక్కువగా ఉంది. దీంతో యూట్యూబ్ ఈ వీడియోను బ్లాక్ చేసింది. ట్రెండింగ్ లిస్ట్‌లో నుంచి తీసేసి, వయసు పరిమితి విధించింది. ఈ విషయాన్ని కూడా మూవీ హీరో అడివి శేష్ వెల్లడించాడు. యూట్యూబ్ ఈ వీడియోను బ్లాక్ చేసిందని చెబుతూ.. దానిని తిరిగి ఎలా చూడాలో అడివి శేష్ ఓ వీడియోలో వివరించాడు.
ఈ వీడియోను యూట్యూబ్ బ్లాక్ చేస్తుందని తాము ముందుగానే ఊహించినట్లు అతడు చెప్పడం గమనార్హం. "మా టీమ్ ఊహించినట్లే యూట్యూబ్ మా టీజర్‌ను ట్రెండింగ్ లిస్ట్ నుంచి తొలగించింది. ఈ వీడియోపై ఇప్పుడు వయసు పరిమితి విధించారు. ఇది పిల్లలకు కాదని మా ట్వీట్లలోనే వెల్లడించాం. గ్రాఫిక్ విజువల్స్ ఉన్నట్లు టీజర్ చివరి కూడా చెప్పాము. అయినా టీజర్‌ను తీసేశారు.
ఇప్పుడు ఈ టీజర్‌ను మీరు చూడాలనుకుంటే సైన్ ఇన్ చేసి మీ వయసు 18కిపైగా ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాస్త హింస ఎక్కువగానే ఉంది కదా మరి. అయితే ఈ హింస మధ్యలో కాస్త రొమాన్స్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఉరికే ఉరికే అనే సిద్ శ్రీరామ్ పాడిన పాటను గురువారం రిలీజ్ చేయబోతున్నాం" అని అడివి శేష్ ఆ వీడియోలో చెప్పాడు.
నేచురల్ స్టార్ నాని ఈ మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో నిర్మితమైంది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.