Adivi Sesh Hit 2 Teaser: అడివిశేష్‌కు నోటిదూల ఎక్కువే - హిట్ -2 టీజర్ రిలీజ్
Adivi Sesh Hit 2 Teaser: అడివిశేష్ హీరోగా నటిస్తోన్న హిట్ -2 టీజర్ సోమవారం రిలీజైంది. ఇందులో నోటిదూల ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా డిఫరెంట్ క్యారెక్టర్‌లో అడివిశేష్ కనిపిస్తున్నాడు.
Adivi Sesh Hit 2 Teaser: అడివిశేష్ హిట్ 2 టీజర్ వచ్చేసింది. వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠను పంచుతోంది. కొంచెం రిక్రూట్‌మెంట్ విషయం చూడండి సార్ అంటూ రావురమేష్‌తో అడివిశేష్ చెప్పే డైలాగ్‌తో వినోదాత్మకంగా టీజర్ ప్రారంభమైంది.
అయినా ఇప్పుడు అంతా అర్జెన్సీ ఏముందిలే ఈ సిటీలో పెద్ద ప్రొఫైల్ క్రైమ్ ఏం జరుగుతాయి అనే రావురమేష్ అన్న డైలాగ్‌కు అవతలి టీమ్ వీక్ అని మన గోల్ కీపర్‌కు రెస్ట్ ఇవ్వలేముగా అని అడివి శేష్ పంచ్ డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత టీజర్‌లో నాయకానాయికల లవ్ స్టోరీని రొమాంటిక్‌గా చూపించారు.
నోటి దూల ఎక్కువగా ఉండే సరదా పోలీస్ అధికారికి ఓ సైకో కిల్లర్ కేసు ఎదురైనట్లుగా టీజర్‌లో చూపించడం ఆసక్తిని పంచుతోంది. యత్ర నార్యంతు పూజ్యంతే అంటూ టీజర్ చివరలో డిఫరెంట్ వాయిస్ తో శ్లోకం వినిపించడం ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 2న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిరినేనితో కలిసి హీరో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా 2020లో రిలీజైంది. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. ఫస్ట్ పార్ట్‌కు భిన్నంగా కొత్త క్యారెక్టర్, కథతో ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.