తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hit 2 Teaser Release Event: హిట్-2 భయపెడుతూ థ్రిల్ చేస్తుంది.. టీజర్ విడుదల కార్యక్రమంలో అడివి శేష్ వ్యాఖ్యలు

Hit 2 Teaser Release Event: హిట్-2 భయపెడుతూ థ్రిల్ చేస్తుంది.. టీజర్ విడుదల కార్యక్రమంలో అడివి శేష్ వ్యాఖ్యలు

03 November 2022, 16:32 IST

    • Hit 2 Teaser Release Event: అడివి శేష్ హీరోగా.. సైలేషన్ కొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రం హిట్-2. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మీడియాతో సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది చిత్రబృందం.
హిట్ 2 టీజర్ రిలీజ్ ఈవెంట్
హిట్ 2 టీజర్ రిలీజ్ ఈవెంట్

హిట్ 2 టీజర్ రిలీజ్ ఈవెంట్

Hit 2 Teaser Release Event: క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్-2’'. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను ఎంత బాగా అలరించిందో తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది.

ట్రెండింగ్ వార్తలు

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Vijay Deverakonda Birthday: విజయ్ దేవరకొండ పుట్టిన రోజున మూడు సినిమాల నుంచి అప్‍డేట్స్: వివరాలివే

NNS 7th May Episode: భూమ్మీదకు తిరిగి రానున్న అరుంధతి ఆత్మ.. అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తికి గుండెపోటు!

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. "హిట్ వన్ తర్వాత హిట్ 2 ప్లాన్ చేసుకున్నాను. శేష్ దగ్గరకు వెళ్దామని అనుకుంటే వెళ్లొద్దు. మనోడు కెలికేస్తాడు. అన్నీ మనోడే రాసేసుకుంటాడు అన్నారు. దాంతో ఫస్ట్ మీటింగ్‌లో నేను భయపడ్డాను. నచ్చుతుందా? నచ్చలేదా అన్నట్లు ఫేస్ పెట్టుకుని కూర్చున్నాడు. తనను చూసి నచ్చలేదని అనుకున్నాను. కానీ.. తనకు బాగా నచ్చింది. తను పర్‌ఫెక్ట్ జెంటిల్ మేన్. కె.డి అనే క్యారెక్టర్ ఎలా ఉండాలని అనుకున్నానో, దాని కంటే నాలుగైదు రెట్లు బాగానే ప్రెజంట్ చేశాడు తను. అందుకు తనకు థాంక్స్. నేను ఇక్కడ ఉండటానికి కారణం నానిగారే. ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. హిట్ వెర్సెకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యమేసింది. హిట్ యూనివర్స్‌ని ఇంకా గొప్పగా ఇవ్వాలనే ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది" అని అన్నారు.

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.."‘టీజర్ నచ్చిందని అందరికీ అర్థమైంది. మూవీ నాకు చాలా స్పెషల్. తెలుగులో నా మూడో చిత్రం. టాలెంటెడ్ టీమ్‌తో కలిసి వర్క్ చేశాను. ఆర్య అనే అమ్మాయి రోల్ ఇచ్చిన శైలేష్‌కి థాంక్స్. నేను ఆ పాత్రకు న్యాయం చేశానని అనుకుంటున్నాను. శేష్ వండర్ ఫుల్ ఆర్టిస్ట్. తనతో కలిసి పని చేయటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ.."‘చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. నా జర్నీ గురించి ఆలోచిస్తున్నాను. హీరోలందరికీ నచ్చే హీరో నేను. క్షణం సినిమాకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు బన్నీ ఇంత పెద్ద లెటర్ రాసి బ్యూటీఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మహేష్ సార్ నా క్షణం టీజర్ రిలీజ్ చేయటమే కాదు.. నాతో మేజర్ సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లారు. చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫేవరేట్ హీరో నాని. గూఢచారి, ఎవరు సినిమాల ట్రైలర్స్‌ని తనే లాంఛ్ చేశారు. ఓరోజు సడెన్‌గా వచ్చి ట్రైలర్స్ లాంచ్ చేయటం కాదు..ఓ హిట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తామని అన్నారు. హిట్ 2 సినిమా అలా లైన్‌కి వచ్చింది. మంచి సినిమా చేయాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్ సమయంలో హిట్ 2 సినిమా చేయటానికి టీమ్ ఎంతో కషపడింది. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సినిమా చాలా బావుంటుంది. ఎంజాయ్ చేస్తారు. టీజర్ చూడగానే విలన్ వాయిస్ బాగా నచ్చింది. హిట్ వెర్సెలో డిఫరెంట్ విజన్స్ ఉన్నాయి. అందుకనే హిట్ 2లో నేను యాక్ట్ చేశాను. హిట్ 1 క్వశ్చన్స్‌తో థ్రిల్ చేస్తే.. హిట్ 2 భయపెట్టి థ్రిల్ చేస్తుంది. శైలేష్ నన్ను కొత్తగా చూపించాడు. మంచి నటీనటులతో పని చేశాను. గ్యారీ ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేశారు. తను త్వరలోనే నిఖిల్ స్పైతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. మణికందన్.. ఫెంటాస్టిక్ టెక్నీషియన్. మీనాక్షి చౌదరి టాలెంటెడ్ ఆర్టిస్ట్. నేచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. హిట్ 2 డిసెంబర్ 2న రానుంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. థియేటర్స్‌లో కలుద్దాం." అని అన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.