తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kanguva Movie: కంగువా సినిమాలోని తప్పిదాల్ని ఒప్పుకున్న జ్యోతిక, ఆ విషయం మర్చిపోతే ఎలా? అంటూ ఫైర్

Kanguva Movie: కంగువా సినిమాలోని తప్పిదాల్ని ఒప్పుకున్న జ్యోతిక, ఆ విషయం మర్చిపోతే ఎలా? అంటూ ఫైర్

Galeti Rajendra HT Telugu

17 November 2024, 14:19 IST

google News
  • Actress Jyotika on Kanguva Movie: భారీ అంచనాల నడుమ విడుదలైన కంగువా మూవీ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. సినిమా రిలీజ్ రోజే.. మూవీలోని లోపాల్ని ఎత్తిచూపుతూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. 

జ్యోతిక, సూర్య
జ్యోతిక, సూర్య

జ్యోతిక, సూర్య

కంగువా సినిమాకి నెగటివ్ రివ్యూస్ రావడంపై నటి జ్యోతిక మండిపడ్డారు. తమిళ్ హీరో, జ్యోతిక భర్త సూర్య నటించిన కంగువా సినిమా గత గురువారం (నవంబరు 14)న రిలీజై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని దర్శకుడు శివ తెరకెక్కించగా.. భారీ అంచనాల నడుమ 8 భాషల్లో విడుదలైన కంగువా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర వసూళ్లని రాబట్టలేకపోతోంది.

సినిమాలో లోపాలేంటి?

వాస్తవానికి దర్శకుడు శివ కొత్త కథనే ఎంచుకున్నారు. వెయ్యేళ్ల కిందటి ఎమోషనల్ స్టోరీని వర్తమానానికి ముడిపెడుతూ కంగువా సినిమా తీశారు. కానీ.. సినిమా ఫస్ట్ హాఫ్ సాగదీతతో చాలా నీరసంగా ఉందని తేల్చేసిన రివ్యూయర్లు.. సెకండ్ హాఫ్ కాస్త ఆసక్తిగా సాగినా నాసిరకం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథని క్లారిటీగా ప్రేక్షకులకి చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యారని రాసుకొచ్చారు. అలానే సినిమాలో ప్రాధాన్యత లేని మూడు వంశాలను పరిచయం చేసి గజిబిజి వాతవరణాన్ని సృష్టించారని చాలా మంది నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

మూడు రోజులకే పడిపోయిన కలెక్షన్లు

కంగువా సినిమా రిలీజ్ రోజున మొదటి షోకే మిక్స్‌డ్ టాక్ రావడంతో.. ఆ ప్రభావం మూవీ కలెక్షన్లపై భారీగా పడింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాడులో కూడా ఈ సినిమా ఆశించిన మేర వసూళ్లని రాబట్టలేకపోతోంది. తొలి రోజు రూ.24 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టిన కంగువా సినిమా.. ఆ తర్వాత రెండో రోజుకే రూ.9.25 కోట్లకి పడిపోయింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్లు రూ.42.75 కోట్లే కావడం గమనార్హం.

అరగంట మాత్రమే కదా?

కంగువా సినిమా నెగటివ్ రివ్యూస్‌పై జ్యోతిక స్పందిస్తూ ‘‘కంగువా లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో చిన్న చిన్న లోపాలు ఉండటం చాలా సహజం. సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. నిజమే ఈ సినిమా మొదటి అరగంట అంచనాలకి తగినట్లు లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా కొన్ని సీన్లలో నాసిరకంగా ఉంది. అంతమాత్రాన రివ్యూస్ రాసే సమయంలో సినిమాలోని పాజిటివ్స్‌ను పూర్తిగా మర్చిపోతే ఎలా? గతంలో భారీ బడ్జెట్ సినిమాల్లో మహిళల్ని తక్కువ చేసి చూపించినా ఇలాంటి నెగటివ్ రివ్యూస్ నాకు కనిపించలేదు. కంగువాకి వచ్చిన నెగటివ్ రివ్యూస్ చూసి చాలా బాధ అనిపించింది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

టార్గెట్‌గా మారిన డీఎస్పీ

కంగువా సినిమాలో సూర్య సరసన దిశా పటాని నటించగా.. బాబి డియోల్ నెగటివ్ రోల్ చేశారు. కమెడియన్ యోగి బాబు, న‌ట‌రాజ‌న్, రెడిన్ కింగ్‌స్లే కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఏమాత్రం బాలేదని సూర్య అభిమానుల సైతం డీఎస్పీపై మండిపడుతున్నారు. కంగువా సినిమా రిలీజ్‌కి ముందే ఈ మూవీ రూ.1,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా బాహాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కంగువా మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం