Suriya Balakrishna: జ్యోతిక.. ఐ లవ్యూ అంటున్న సూర్య.. అన్‌స్టాపబుల్ షోలో కంటతడి పెట్టిన తమిళ స్టార్-suriya balakrishna unstoppable with nbk promo released kanguva promotions suriya jyothika ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Balakrishna: జ్యోతిక.. ఐ లవ్యూ అంటున్న సూర్య.. అన్‌స్టాపబుల్ షోలో కంటతడి పెట్టిన తమిళ స్టార్

Suriya Balakrishna: జ్యోతిక.. ఐ లవ్యూ అంటున్న సూర్య.. అన్‌స్టాపబుల్ షోలో కంటతడి పెట్టిన తమిళ స్టార్

Hari Prasad S HT Telugu

Suriya Balakrishna: తమిళ స్టార్ హీరో సూర్య అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో కంటతడి పెట్టాడు. అంతేకాదు తన భార్య జ్యోతికకు ఐ లవ్యూ అని చెప్పడం విశేషం. తాజాగా రిలీజైన ప్రోమో ఎంటర్టైనింగా సాగింది.

జ్యోతిక.. ఐ లవ్యూ అంటున్న సూర్య.. అన్‌స్టాపబుల్ షోలో కంటతడి పెట్టిన తమిళ స్టార్

Suriya Balakrishna: సూర్య నటించిన కంగువ మూవీ ఈ నెలలోనే రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అతనితోపాటు మూవీ విలన్ బాబీ డియోల్, డైరెక్టర్ శివ కూడా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్లతో కలిసి బాలయ్య మంచి ఎంటర్టైన్మెంట్ అందించినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. అయితే తన భార్య జ్యోతికకు సూర్య ఐ లవ్యూ చెప్పడం మాత్రం ప్రోమోలో హైలైట్ గా నిలిచింది.

బాలయ్య కాళ్లు మొక్కిన సూర్య

లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా గత వారం మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకి రాగా.. ఈ వారం తమిళ స్టార్ సూర్య వస్తున్నాడు. ఈ స్పెషల్ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం (నవంబర్ 8) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూడో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా వీడియో ఓటీటీ మంగళవారం (నవంబర్ 5) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందులో బాలయ్యతో సూర్య చేసిన సందడి ఆకట్టుకుంటోంది.

నేను సింహం అయితే అతడు సింగం.. నేను లెజెండ్ అయితే అతడు గజిని.. నేను అఖండ అయితే అతడు రోలెక్స్ అంటూ సూర్య గురించి బాలకృష్ణ తనదైన స్టైల్లో ఇచ్చిన ఇంట్రో అదిరింది. సూర్య రాగానే బాలయ్య కాళ్లు మొక్కడం విశేషం. ఆ తర్వాత గజిని మూవీలో హృదయం ఎక్కడున్నది పాటను బాలయ్య పాడగా.. సూర్య ఆ హుక్ స్టెప్ వేశాడు.

జ్యోతిక.. ఐ లవ్యూ అన్న సూర్య

ఇక ఈ ప్రోమోలో తన భార్య జ్యోతికకు సూర్య ఐ లవ్యూ చెప్పాడు. కొన్నాళ్లుగా వీళ్లిద్దరూ విడిపోతున్నారని, దూరంగా ఉంటున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో సూర్య ఆమె గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నీ ఫస్ట్ క్రష్ ఎవరు అని బాలయ్య అడగ్గా.. వద్దు సార్.. ప్రాబ్లం సార్.. ఇంటికెళ్లాలి అని సూర్య మొదట సరదాగా సమాధానమిచ్చాడు.

ఆ తర్వాత నీ సీక్రెట్స్ ను కార్తీతో షేర్ చేసుకుంటావా లేక జ్యోతికతోనా అని బాలకృష్ణ అడిగితే సూర్య కాస్త ఇబ్బంది పడ్డాడు. జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని, ఐ లవ్యూ అని సూర్య అన్నాడు.

సూర్య కంటతడి

ఇదే షోలో సూర్య కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది. తమిళంలో పెద్ద స్టార్ అయిన శివకుమార్ తనయుడిగా నీ బాధ్యత ఏంటి అని బాలయ్య అడిగాడు. దీనికి సూర్య స్పందిస్తూ.. మొదట తాను ఓ మంచి మనిషిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.

ఈ సందర్భంగా అతడు చేసిన సేవా కార్యక్రమాల గురించి కూడా ప్రోమోలో చూపించారు. అందులో తన సాయం అందుకున్న కొందరు తమ కష్టాల గురించి చెబుతుండగా.. సూర్య ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టాడు. సూర్యతో బాలకృష్ణ చేసిన ఈ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ మూడో ఎపిసోడ్ నవంబర్ 8న స్ట్రీమింగ్ కానుంది.