Suriya: జ్యోతిక నా గురువు, ఫిలాసఫర్: సూర్య.. ముంబైకు ఎందుకు మారారో చెప్పిన తమిళ స్టార్.. విడాకుల రూమర్లకు ఫుల్ స్టాప్-jyothika is my guru and shifted mumbai for her says kanguva actor suriya full stop for divorce rumours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya: జ్యోతిక నా గురువు, ఫిలాసఫర్: సూర్య.. ముంబైకు ఎందుకు మారారో చెప్పిన తమిళ స్టార్.. విడాకుల రూమర్లకు ఫుల్ స్టాప్

Suriya: జ్యోతిక నా గురువు, ఫిలాసఫర్: సూర్య.. ముంబైకు ఎందుకు మారారో చెప్పిన తమిళ స్టార్.. విడాకుల రూమర్లకు ఫుల్ స్టాప్

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 29, 2024 05:14 PM IST

Suriya on Jyothika: తాను, జ్యోతిక ముంబైకు ఎందుకు మారారో చెప్పారు తమిళ స్టార్ హీరో సూర్య. జ్యోతిక తనకు గురువు అని కూడా అన్నారు. కంగువ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను సూర్య వెల్లడించారు.

Suriya: జ్యోతిక నా గురువు, ఫిలాసఫర్: సూర్య.. ముంబైకు ఎందుకు మారారో చెప్పిన తమిళ స్టార్.. విడాకుల రూమర్లకు ఫుల్ స్టాప్
Suriya: జ్యోతిక నా గురువు, ఫిలాసఫర్: సూర్య.. ముంబైకు ఎందుకు మారారో చెప్పిన తమిళ స్టార్.. విడాకుల రూమర్లకు ఫుల్ స్టాప్

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన కంగువ చిత్రం నవంబర్ 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుసగా ప్రమోషన్ ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో సూర్య పాల్గొంటున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ప్రచారం చేస్తున్నారు. కాగా, సూర్య గతేడాది తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అప్పడు చాలా రూమర్లు వచ్చాయి. అయితే, తాము ఎందుకు ముంబైకు మారామో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూర్తిగా క్లారిటీ ఇచ్చారు సూర్య.

జ్యోతిక కోసమే ముంబైకు..

జ్యోతిక తన తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు తాము ముంబైకు మారామని సూర్య చెప్పారు. జ్యోతిక తన కోసం కుటుంబం, కెరీర్ ఇలా చాలా త్యాగాలు చేసిందని అన్నారు. అందుకే తన ఫ్యామిలీతో ఉండేందుకు, తనకు నచ్చిన విధంగా జీవించేందుకు తాను ముంబైకు షిఫ్ట్ అయ్యామని తెలిపారు. ది హాలీవుడ్ రిపోర్ట్ ఇండియా యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య ఈ విషయాలు వెల్లడించారు.

మార్పు అవసరం అనుకున్నా..

జ్యోతిక 27 ఏళ్ల క్రితం ముంబై నుంచి చెన్నైకు వచ్చేసిందని, సుమారు 19 ఏళ్ల వయసు నుంచే తనతో ఉంటోందని సూర్య తెలిపారు. “జ్యోతిక నాతో, నా కుటుంబంతో ఉంటున్నారు. ఇందుకోసం తన కెరీర్, స్నేహితులు, తన బంద్రా లైఫ్‍స్టైల్‍ను వదులుకున్నారు. కోవిడ్ తర్వాత, ఇక మార్పు అవసరమని నాకు అనిపించింది” అని సూర్య తెలిపారు.

జ్యోతిక.. సంతోషంగా..

ఇప్పుడు తన తల్లిదండ్రులతో సమయం గడుపుతుండటంతో జ్యోతిక సంతోషంగా ఉన్నారని సూర్య తెలిపారు. “27 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులతో పూర్తిగా ఉండటంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. పురుషులకు ఏం కావాలో.. మహిళలకు కూడా అది అవసరం. నాకు ఇది ఆలస్యంగా అర్థమైంది. ఆమెకు వెకేషన్స్, ఫ్రెండ్స్, ఆర్థిక స్వాతంత్య్రం కావాలి. ఆమెకు గౌరవం, జిమ్ టైమ్ కూడా కావాలి. తల్లిదండ్రుల నుంచి ఆమె సమయాన్ని, ఆమె ఒకప్పుడు ఇష్టపడిన లైఫ్‍స్టైల్‍ను ఎందుకు దూరం చేయాలని నేను అనుకున్నా. మనం ఎప్పుడు మారతాం? నా గురించి ఎప్పుడూ ఎందుకు? మేం ముంబైకి మారడం వెనుక ఈ ఆలోచనలు ఉన్నాయి” అని కంగువ హీరో సూర్య చెప్పారు.

నా గురువు.. నేను 10 రోజులు ముంబైలోనే..

జ్యోతిక తన గురువు అని సూర్య అన్నారు. తనకు సూర్ఫి కూడా ఇస్తుందని అన్నారు. “జ్యోతిక చాలా దయాగుణం ఉన్న వ్యక్తి. ఆమె నాకు గురువు, ఫిలాసఫర్. ఆమెతో కూర్చొని మాట్లాడడం నాకు చాలా ఇష్టం” అని సూర్య చెప్పారు. తాను ప్రస్తుతం నెలలో 20 రోజులు షూటింగ్‍ల్లో ఉంటానని, 10 రోజులు ముంబైకు వెళుతున్నానని సూర్య తెలిపారు. ఆ 10 రోజులు తాను కుటుంబానికే కేటాయిస్తున్నానని అన్నారు.

రూమర్లకు పూర్తిగా చెక్

సూర్య, జ్యోతిక మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ముంబైకు మారారనే రూమర్లు వచ్చాయి. వారిద్దరూ విడాకులు తీసుకోనున్నారని, అందుకే పుట్టింటికి జ్యోతిక వెళ్లారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఇప్పుడు ఈ మాటలతో ఈ రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టేశారు సూర్య. జ్యోతికతో తన అనుబంధం ఎంత గొప్పదో, ఆమె గురించి తాను ఎంత బాగా ఆలోచిస్తానో వివరించారు. సూర్య మాటలకు సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.

Whats_app_banner