Lucky Bhaskar: లక్కీ భాస్కర్ సినిమా ఛాన్స్‌ని వదిలేసుకున్న టాలీవుడ్ హీరో.. హిట్‌ని ఖాతాలో వేసుకున్న దుల్కర్ సల్మాన్-nani rejected lucky bhaskar movie and dulquer salmaan bagged the golden opportunity ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lucky Bhaskar: లక్కీ భాస్కర్ సినిమా ఛాన్స్‌ని వదిలేసుకున్న టాలీవుడ్ హీరో.. హిట్‌ని ఖాతాలో వేసుకున్న దుల్కర్ సల్మాన్

Lucky Bhaskar: లక్కీ భాస్కర్ సినిమా ఛాన్స్‌ని వదిలేసుకున్న టాలీవుడ్ హీరో.. హిట్‌ని ఖాతాలో వేసుకున్న దుల్కర్ సల్మాన్

Galeti Rajendra HT Telugu
Nov 03, 2024 04:10 PM IST

Dulquer Salmaan: లక్కీ భాస్కర్ మూవీ తొలుత దుల్కర్ సల్మాన్ చేయాల్సింది కాదట. టాలీవుడ్‌ హీరోకి మొదట దర్శకుడు వెంకీ అట్లూరి ఈ కథ చెప్పగా బాగానే ఉందన్న సదరు హీరో సినిమాకి మాత్రం నో చెప్పాడట.

లక్కీ భాస్కర్
లక్కీ భాస్కర్

దీపావళి రోజున విడుదలైన లక్కీ భాస్కర్ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటూ పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగులో సీతారామం సినిమాతో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్.. ఈ లక్కీ భాస్కర్ మూవీతో మరో హిట్‌ని సొంతం చేసుకున్నాడు.

పోటీలో రెండు సినిమాలు

మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే అంశాలకి ఎమోషన్‌ని జోడించిన దర్శకుడు వెంకీ అట్లూరి.. సార్ మూవీ తరహాలో ప్రేక్షకుల్ని మరోసారి ఆకట్టుకున్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబరు 31న విడుదలైన లక్కీ భాస్కర్ మూవీ.. తొలి మూడు రోజుల్లోనే రూ.18.07కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది.

ఈ సినిమాకి ప్రస్తుతం థియేటర్లలో అమరన్, క మాత్రమే పోటీలో ఉండటంతో.. ఈ వారం రోజులు కూడా బాగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అమరన్, క సినిమాలు కూడా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబడుతున్నాయి.

నాని ఎందుకు నో చెప్పాడంటే?

వాస్తవానికి లక్కీ భాస్కర్ మూవీ దుల్కర్ సల్మాన్ కాకుండా.. నేచురల్ స్టార్ నాని చేయాల్సి ఉందట. ఈ సినిమా కథని తొలుత వెంకీ అట్లూరి నానికి చెప్పగా.. లైన్ బాగుందని చెప్పిన నాని సినిమా మాత్రం చేయలేనని సున్నితంగా తిరస్కరించాడట. దానికి కారణం.. లక్కీ భాస్కర్ మూవీలో హీరోది తండ్రి పాత్ర కావడమేనట.

నాని తండ్రి పాత్రలో గతంలోనే నటించి మెప్పించాడు. జెర్సీ, హాయ్ నాన్న మూవీలో తండ్రిగా నాని నటనకి ప్రశంసలు కూడా దక్కాయి. కానీ.. లక్కీ భాస్కర్‌‌లో ఒకవేళ నటిస్తే ఆ తరహా కథగానే ప్రేక్షకులు చూస్తారని భావించిన నాని నో చెప్పాడట.

తండ్రి పాత్రలో మెప్పించిన దుల్కర్

నాని నిరాకరించగానే ఆ కథని దుల్కర్ సల్మాన్‌కి వెంకీ అట్లూరి చెప్పడం.. అతను ఓకే చెప్పడం రోజుల వ్యవధిలోనే జరిగిపోయిందట. ఇప్పుడు సినిమా హిట్ అవ్వడంతో ఒకవేళ నాని చేసి ఉంటే ఇంకా బాగుండేదని అతని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

బ్యాంక్ ఉద్యోగిగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తండ్రిగా సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. బ్యాకింగ్‌ రంగంలోని లొసుగుల్ని చూపిస్తూ సాగిన ఈ ఎమోషనల్ డ్రామా స్టోరీ నానికి పడి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని నెటిజన్లు జోస్యం చెప్తున్నారు.

ఓటీటీలోకి లక్కీ భాస్కర్ ఎప్పుడంటే?

లక్కీ భాస్కర్ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించగా.. దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి నటించింది. లక్కీ భాస్కర్ మూవీ ఈ నెల చివర్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 31న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Whats_app_banner