Kanguva Trolls: సూర్య ‘కంగువా’పై ఫన్నీ ట్రోల్స్ తెరపైకి.. సినిమాలో లోపాల్ని ఎత్తిచూపుతూ నెటిజన్స్ జోక్‌లు
Kanguva Netizens Review: కంగువా సినిమాపై నెటిజన్లు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సూర్య మొసలి ఫైట్, దిశా పటాని బికినీ సీన్స్‌ని పొగుడుతూనే.. దర్శకుడి చేసిన తప్పిదాల్ని ఎండగడుతున్నారు.
తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా భారీ అంచనాల మధ్య గురువారం (నవంబరు 14)న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదలైన ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని నటించగా.. బాబీ డియోల్ విలన్‌గా చేశారు. అలానే కమెడియన్ యోగి బాబు, నటరాజన్, కింగ్ స్లే తదితరులు నటించిన ఈ సినిమాలో ఒక హీరో అతిథి పాత్రలో మెరిశారు.
భారీ తారాగణంతో దాదాపు రూ.350 కోట్లకిపైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కంగువా సినిమా గురువారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కంగువా కథలో కొత్తదనం ఉన్నప్పటికీ దర్శకుడు శివ.. దాన్ని ఆసక్తికరంగా ప్రేక్షకులకి చెప్పడంలో నిరాశపరిచాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో సాగదీత ఎక్కువైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తొలి 20 నిమిషాలు సహనానికి పరీక్ష అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
సినిమాలో దిశా పటాని పాత్ర చాలా పరిమితంగా ఉన్నా.. ఉన్న కాసేపు అందంతో కట్టిపడేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. సాంగ్‌లో దిశా పటాని బికినీ, ఓ రెండు సీన్స్ గురించి ఎక్కువగా ప్రేక్షకులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. మరి కొంత మంది నెటిజన్లు అయితే.. కేవలం దిశా పటాని కోసం ఈ సినిమా చూడాలని సూచిస్తున్నారు.
సినిమాలో వెయేళ్ల నాటి కథ ఓకే.. కానీ ఐదు వంశాలు చూపించడం ద్వారా కన్‌ప్యూజ్ పెరిగిపోయిందని కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సాగర కోన, అరణ్యకోన, ప్రణవకోన, కపాల కోన, హిమ కోన వంశాలను సినిమాలో చూపించారు. ఇందులో మూడు వంశాల్లోని వారు బిగ్గరగా అరవడం మినహా సినిమాలో చేసిందేమీ లేదంటూ నెటిజన్లు జోక్‌లు వేస్తున్నారు.
కంగువా యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని కితాబిస్తున్న నెటిజన్లు.. మొసలితో ఫైట్ మాత్రం చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. కానీ.. కేవలం ఈ ఫైట్ మాత్రమే రూ.1000 కోట్లు వసూళ్లని రాబట్టలేదని జోక్‌లు వేస్తున్నారు. సినిమా రిలీజ్‌కి ముందు ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని మూవీ ప్రొడ్యూసర్, తమిళ్ మీడియా హడావుడి చేసిన విషయం తెలిసిందే.
సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంపై కూడా నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కొన్ని చోట్ల అతిగా అనిపించిందని.. మరికొన్ని చోట్ల తేలిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కంగువా సినిమా తొలిరోజు మిక్సెడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.