Trisha: సూర్యాతో 19 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టబోతున్న త్రిష.. కంగువా తర్వాత సూర్య జాగ్రత్తలు
20 November 2024, 17:27 IST
సూర్య, త్రిష ఇప్పటికే మూడు సినిమాల్లో నటించారు. కానీ.. గత 19 ఏళ్లుగా ఈ ఇద్దరూ కలిసి యాక్ట్ చేయలేదు. ఇటీవల సూర్య నటించిన కంగువా సినిమా ప్లాప్ అవ్వడంతో.. ఇప్పుడు నెక్ట్స్ మూవీ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
సూర్య, త్రిష
కంగువా సినిమా నిరాశపరచడంతో సూర్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెంచాడు. కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో సూర్య చేయబోయే నెక్ట్స్ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆరు సినిమా తర్వాత
మౌనం పేసియాదే, ఆయుత ఏడు, ఆరు చిత్రాల తర్వాత త్రిష, సూర్య మళ్లీ జతకట్టబోతున్నారు. 2005లో ఆరు చిత్రం విడుదలవగా.. ఆ తర్వాత ఈ జంట మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు.
సూర్య సినిమాలో యాక్ట్ చేసేందుకు ఇప్పటికే త్రిష సంతకం చేసిందని, నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ్‌లో ఇటీవల వరుసగా హిట్స్ అందుకుంటున్న త్రిష.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. దాంతో సెంటిమెంట్‌గా కూడా త్రిషతో సినిమాకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
త్రిష కారణంగా లేట్
వాస్తవానికి నవంబర్ 18న ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా త్రిషకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌లో భాగంగా కోయంబత్తూరులో చిత్రీకరణ జరుగుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి.
విడాకుల ప్రకటనతో ప్రస్తుతం వార్తల్లో ఉన్న మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన కంగువా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. పెద్ద ఎత్తున మ్యూజిక్‌పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సూర్య 45’ అనే వర్కింగ్ టైటిల్‌ను తాత్కాలికంగా ఖరారు చేశారు. ఇటీవల దర్శకుడు ఆర్జే బాలాజీ మాట్లాడుతూ తాను కాలేజీలో చదువుతున్నప్పుడు కాకా ఖాకా, గజిని, పితామగన్ సినిమాలు చూశానని చెప్పారు. తనకు వీరాభిమాని అయిన సూర్యను డైరెక్ట్ చేసే అవకాశం రావడం చాలా గర్వంగా, ఆనందంగా ఉందన్నారు.
రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువా సినిమా నవంబరు 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సూర్యతో పాటు దిశా పటాని, బాబి డియోల్ ఇందులో నటించినా.. కనీసం బడ్జెట్‌లో సగం కూడా ఇప్పటి వరకూ వసూలు చేయలేకపోయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకుడు బాలాజీ సినిమాపై పడింది. అలానే సూర్య తదుపరి చిత్రం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో చేయబోతున్నాడు.