Kanguva OTT: కంగువా సినిమా నుంచి 12 నిమిషాలు ట్రిమ్.. తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించి దిద్దుబాటు, మరి ఓటీటీలో?-suriya starrer kanguva movie trimmed by 12 minutes ahead of ott release date in amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kanguva Ott: కంగువా సినిమా నుంచి 12 నిమిషాలు ట్రిమ్.. తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించి దిద్దుబాటు, మరి ఓటీటీలో?

Kanguva OTT: కంగువా సినిమా నుంచి 12 నిమిషాలు ట్రిమ్.. తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించి దిద్దుబాటు, మరి ఓటీటీలో?

Galeti Rajendra HT Telugu
Nov 19, 2024 06:22 PM IST

Kanguva Movie: కంగువా ఓటీటీ రిలీజ్‌కి సన్నద్ధమవుతున్న తరుణంలో సినిమాలో నుంచి 13 నిమిషాల్ని మేకర్స్ ట్రిమ్ చేశారు. కొత్త వెర్షన్ ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. కానీ.. ఇప్పటికే నెగటివ్ టాక్ రావడంతో..?

కంగువాలో సూర్య
కంగువాలో సూర్య

తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా నుంచి 12 నిమిషాల్ని మేకర్స్ ట్రిమ్ చేశారు. నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కంగువా మూవీ.. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర వసూళ్లని రాబట్టలేకపోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. సూర్య భార్య హీరోయిన్ జ్యోతిక సైతం మూవీలోని తప్పిదాల్ని అంగీకరించింది.

తొలి 20 నిమిషాలు బోర్

వెయ్యేళ్ల కిందటి కథని.. వర్తమానానికి ముడిపెడుతూ దర్శకుడు శివ ప్రేక్షుకుల ఒప్పించడంలో విఫలమయ్యారు. సినిమా తొలి 20 నిమిషాలు సాగదీతతో ప్రేక్షకుల సహనానికి డైరెక్టర్ పరీక్ష పెట్టాడని కామెంట్స్ వినిపించాయి. అలానే కొన్ని యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో బీజీఎం అతిగా అనిపించిందని చాలా రివ్యూస్‌లో రాశారు. దాంతో ఆలస్యంగా తప్పిదాన్ని గుర్తించిన కంగువా మేకర్స్.. 12 నిమిషాల వరకూ మూవీని ట్రిమ్ చేశారు.

కొత్త వెర్షన్ అందుబాటులోకి

కంగువా కొత్త వెర్షన్‌ను ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శనకి ఉంచారు. అయితే.. ఇప్పటికే నెగటివ్ మౌత్ టాక్‌తో ఉన్న ఈ మూవీ మళ్లీ పుంజుకోవాలంటే కష్టమే. కానీ.. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటి వరకూ కనీసం హాఫ్ కూడా వసూళ్లు రాలేదు. దాంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా మేకర్స్ ఈ సీన్స్ ట్రిమ్ ప్లాన్‌ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

దేవిశ్రీ మ్యూజిక్‌పై విమర్శలు

కంగువా సినిమాలో సూర్య సరసన దిశా పటాని నటించగా.. బాబీ డియోల్ విలన్‌గా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే సూర్య అభిమానులు అతనిపై గుర్రుగా ఉన్నారు. సినిమాలోని పాటలకే కాదు పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు కూడా నాసిరకంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దాంతో థియేటర్లలో సౌండ్ రెండు పాయింట్లు తగ్గించాలని నిర్మాత ఉచిత సలహా కూడా ఇచ్చారు.

కంగువా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

కంగువా ఓటీటీ రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబరు చివరి వారంలో ఓటీటీలోకి కంగువా రావాల్సి ఉంది. కానీ.. నెగటివ్ టాక్, విమర్శల నేపథ్యంలో.. ముందుగానే స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబరు రెండో వారాంలోనే స్ట్రీమింగ్‌కి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఓటీటీలో ఆ 12 నిమిషాలు ట్రిమ్ చేసిన సీన్స్ ఉంటాయో లేదో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు. 

రెమ్యూనరేషన్‌ జోక్‌లు

కంగువా సినిమాకి సూర్య దాదాపు రూ.39 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుండగా.. బాబీ డియోల్‌కి రూ.5 కోట్లు, హీరోయిన్ దిశా పటానికి రూ.3 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకూ ఆ రెమ్యూనరేషన్ డబ్బు కూడా రాలేదంటూ నెటిజన్లు సరదాగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

Whats_app_banner