Romantic Comedy OTT: టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది -రిలీజ్ డేట్ ఫిక్స్
07 September 2024, 13:52 IST
Romantic Comedy OTT: టాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ఆయ్ ఓటీటీలోకి వస్తోంది. నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆయ్ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించాడు.
రొమాంటిక్ కామెడీ ఓటీటీ
Romantic Comedy OTT: టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఆయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఆయ్ మూవీలో ఎన్టీఆర్ బావమరిది, మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్ హీరోగా నటించాడు. రొమాంటిక్ కామెడీ కథతో తెరకెక్కిన ఈ మూవీతో అంజి కే మణిపుత్ర దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలకు పోటీగా...ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్...
ఆయ్ సినిమా ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఆయ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను వినాయకచవితి సందర్భంగా శనివారం నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయ్ మూవీ రిలీజ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
నయన్ సారిక హీరోయిన్...
ఆయ్ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, విద్యా కొప్పినీడు నిర్మించారు. ఆయ్ మూవీలో నార్నే నితిన్‌కు జోడీగా నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య కీలక పాత్రల్లో నటించారు. సీనియర్ హీరో వినోద్ కుమార్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఆయ్ సినిమాకు అజయ్ అరసాడ, రామ్ మిరియాల మ్యూజిక్ అందించారు.
ఆయ్ కథ ఇదే...
కార్తిక్ (నార్నేనితిన్) అమలాపురం కుర్రాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. పల్లవి (నయన్ సారిక) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు కార్తీక్. పల్లవి కూడా కార్తిక్‌ది తన కులం అనుకొని ఇష్టపడుతుంది. అసలు నిజం బయటపడటంతో అతడిని దూరం పెడుతుంది. ఆ తర్వాత ఏమైంది? పల్లవి ప్రేమను కార్తిక్ ఎలా గెలుచుకున్నాడు? పల్లవి, కార్తిక్‌లను కలిపేందుకు హరి, సబ్బు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? కొడుకు ప్రేమను కార్తిక్ తండ్రి బూరయ్య అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ఐదు కోట్ల బడ్జెట్...15 కోట్ల కలెక్షన్స్...
దాదాపు ఐదు కోట్ల బడ్జెట్‌తో విలేజ్ లవ్‌స్టోరీగా ఆయ్ మూవీ రూపొందింది. ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ 15 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
మ్యాడ్‌తో బ్లాక్‌బస్టర్...
మ్యాడ్‌తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకున్న నార్నే నితిన్ ఆయ్‌తో రెండు బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మ్యాడ్ సీక్వెల్‌లో నటిస్తున్నాడు. నార్నే నితిన్ హీరోగా నటించిన శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.