Kalki Collections: కల్కి హిందీ కలెక్షన్స్ -టార్గెట్ 85 కోట్లు - వచ్చింది 300 కోట్లు -బాలీవుడ్‌ను షేక్ చేసిన ప్రభాస్
Kalki Collections:కల్కి హిందీ వెర్షన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ప్రభాస్ మూవీ 295 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో నిర్మాతలకు హయ్యెస్ట్ ప్రాఫిట్స్ మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Kalki Collections: ప్రభాస్ కల్కి మూవీ హిందీలో అదరగొట్టింది. నిర్మాతలకు దాదాపు డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. అక్షయ్‌కుమార్ లాంటి బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు నిర్మాతలకు భారీగా నష్టాల్ని తెచ్చిపెడుతోండగా...ప్రభాస్ మూవీ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
85 కోట్ల టార్గెట్...
కల్కి 2898 ఏడీ హిందీ వెర్షన్ దాదాపు 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో రిలీజైంది.ఫుల్ థియేట్రికల్ రన్‌లో ఏకంగా 294 కోట్ల వరకు గ్రాస్, 148 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. హిందీ వెర్షన్ నిర్మాతలకు 63 కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. రీసెంట్ టైమ్‌లో హిందీలో నిర్మాతలకు ఎక్కువ లాభాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా కల్కి నిలిచింది.
ఫస్ట్ వీక్‌లో 155 కోట్లు...
కల్కి మూవీ తొలిరోజు హిందీలో 22 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టగా...నాలుగో రోజు ఏకంగా నలభై కోట్ల వరకు వసూళ్లను దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక్‌లోనే 155 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి చరిత్రను సృష్టించింది. సెకండ్ వీక్ నుంచి లాభాల్లోకి ఎంటరైంది.
కల్కి ఓవరాల్ కలెక్షన్స్...
కల్కి మూవీ వరల్డ్ వైడ్‌గా థియేటర్ల ద్వారా 1052 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. షేర్ కలెక్షన్స్ 532 కోట్లకుపైనే ఉంటాయని సమాచారం. మొత్తంగా 380 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కల్కి 2898 ఏడీ మూవీ రిలీజైంది. అన్ని భాషల్లో కలిపి నిర్మాతలకు ఈ మూవీ 160 కోట్ల వరకు లాభాలను సంపాదించినట్లు చెబుతోన్నారు.
కల్కి నంబర్ వన్.. స్త్రీ సెకండ్...
2024లో ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో కల్కి నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్‌లో శ్రద్ధాకపూర్ స్త్రీ మూవీ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. స్త్రీ మూవీ ఇప్పటివరకు 500 కోట్ల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి 2 తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 1814 కోట్ల గ్రాస్‌ను, 821 కోట్ల షేర్‌ను రాబట్టింది.
యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్...
కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు ఫిక్షనల్ వరల్డ్స్ కథతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీని తెరకెక్కించాడు. కమల్‌హాసన్ విలన్‌గా నటించిన ఈ మూవీలో అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకోణ్, దిశాపటానీ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్, అమితాబ్, ప్రభాస్ కాంబినేషన్‌లోని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు విజువల్స్, గ్రాఫిక్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ సూపర్ హీరోలకు ధీటుగా ఈ మూవీ ఉందంటూ నేషనల్ వైడ్‌గా ఆడియెన్స్ పేర్కొన్నారు.
టీజర్ అప్పుడే...
కల్కి తర్వత ప్రభాస్ రాజాసాబ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న రాజా సాబ్ టీజర్‌ను విడుదలచేయబోతున్నట్లు వార్తలొస్తోన్నాయి.
ఇటీవలే హను రాఘవపూడితో పీరియాడికల్ మూవీని సెట్స్‌పైకి తీసుకొచ్చారు ప్రభాస్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.