Double Ismart OTT: రామ్ డ‌బుల్ ఇస్మార్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-double simart ott reease date ram pothineni action entertainer movie ott streaming rights acquired by amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart Ott: రామ్ డ‌బుల్ ఇస్మార్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Double Ismart OTT: రామ్ డ‌బుల్ ఇస్మార్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Aug 15, 2024 11:16 AM IST

Double Ismart OTT: రామ్ డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకోన్న‌ట్లు స‌మాచారం. సెప్టెంబ‌ర్ నెలాఖ‌రున డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం. ఇస్మార్ట్ శంక‌ర్‌కు సీక్వెల్‌గా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ డ‌బుల్ ఇస్మార్ట్‌ను రూపొందించాడు.

డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీ
డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీ

Double Ismart OTT: హీరో రామ్‌, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ ఇండిపెండెన్స్ డే కానుక‌గా గురువారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇస్మార్ట్ శంక‌ర్‌కు సీక్వెల్‌గా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

మిక్స్‌డ్ టాక్‌...

డ‌బుల్ ఇస్మార్ట్ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్‌కు మిక్స్‌డ్ టాక్ ల‌భిస్తోంది. మాస్ రోల్‌లో రామ్ అద‌ర‌గొట్టాడ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. అత‌డి ఎన‌ర్జీ, డైలాగ్ డెలివ‌రీ బాగున్నాయ‌నే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. అయితే డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ టేకింగ్‌, మేకింగ్‌లో మాత్రం కొత్త‌ద‌నం మిస్స‌యింద‌ని చెబుతోన్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో...

కాగా డ‌బుల్ ఇస్మార్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స‌యింది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న‌ది. నాలుగు నుంచి ఆరు వారాల త‌ర్వాతే డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. సెప్టెంబ‌ర్ మూడు లేదా నాలుగో వారంలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. డ‌బుల్ ఇస్మార్ట్ స్ట్రీమింగ్ రైట్స్‌ను 33 కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది.

యాభై కోట్ల బ్రేక్ ఈవెన్‌...

పూరి జ‌గ‌న్నాథ్ లైగ‌ర్‌, రామ్ స్కంద మూవీ రిజ‌ల్ట్‌ల‌తో సంబంధం లేకుండా డ‌బుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. రామ్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రికార్డ్ నెల‌కొల్పింది. అయితే తొలిరోజే నెగెటివ్ కామెంట్స్ రావ‌డంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ గురువారం ఇస్మార్ట్ శంక‌ర్‌తో పాటు ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌, విక్ర‌మ్ తంగ‌లాన్‌తో పాటు ఆయ్ సినిమాలు పోటీగా రిలీజ్ కావ‌డం కూడా ఓపెనింగ్స్‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

లైగ‌ర్ డిజాస్ట‌ర్‌...

లైగ‌ర్ ప‌రాజ‌యంపై డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. డ‌బుల్ ఇస్మార్ట్ స‌క్సెస్‌తో ఈ విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని పూరి భావించాడు. కానీ అత‌డికి మ‌రోమారు నిరాశ ఎదుర‌వ్వ‌క‌త‌ప్ప‌ద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు.

రెమ్యున‌రేష‌న్ లేకుండానే...

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. ప‌దిహేను కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 75 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా డ‌బుల్ ఇస్మార్ట్ మూవీలో రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా రామ్ న‌టించిన‌ట్లు స‌మాచారం. ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకునే ఒప్పందం మీద ఈ మూవీని చేసిన‌ట్లు స‌మాచారం.

మ‌హేష్‌బాబుతో..

డ‌బుల్ ఇస్మార్ట్ త‌ర్వాత రామ్‌...మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి ద‌ర్శ‌కుడు మ‌హేష్‌బాబుతో ఓ కామెడీ ల‌వ్ స్టోరీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.