Raayan Review: రాయన్ రివ్యూ - హీరోగా, డైరెక్టర్‌గా ధనుష్ చేసిన యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
Raayan Review: ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రాయన్ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందంటే?
Raayan Review: తమిళంలో వైవిధ్యతకు కొత్తదనానికి పెట్టింది పేరు ధనుష్. ప్రతి సినిమాలో పాత్రల పరంగా ప్రయోగాలు చేస్తుంటాడు. ధనుష్ (Dhanush) హీరోగా నటించిన 50వ మూవీ రాయన్. యాక్షన్ ఎంట్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించాడు. సందీప్‌కిషన్ (Sundeep Kishan), దుషారా విజయన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించారు.
తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం ఈ మూవీ రిలీజైంది. రాయన్ ఎలా ఉంది? దర్శకుడిగా, నటుడిగా ధనుష్ ఈ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అంటే
రాయన్ కథ…
రాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతూ తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్‌కిషన్), మాణిక్యం (కాళిదాస్ జయరాం)తో పాటు చెల్లెలు దుర్గ (దుషారా విజయన్)ను కష్టపడి పెంచుతాడు. రాయన్ ఏరియాలో దురై, సేతురామన్ (ఎస్‌జే సూర్య) గ్యాంగ్స్ ఆధిపత్యం కోసం గొడవలుపడుతుంటాయి.
దురై అడ్డు తొలగించుకొని ఆ ఏరియాను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని సేతురామన్ ప్రయత్నాలు చేస్తుంటాడు. దురై హత్యతో అనుకోకుండా ఈ గ్యాంగ్‌స్టర్ గొడవల్లోకి రాయన్ రావాల్సివస్తుంది. అలా ఎందుకు జరిగింది?
దురైని చంపింది ఎవరు? తమ్ముళ్లతో పాటు చెల్లెలు ప్రాణంగా బతికిన రాయన్‌కు వాళ్లే ఎందుకు ఎదురు తిరగాల్సివస్తుంది? రాయన్‌ను చంపాలని సేతురామన్ ఎందుకు అనుకున్నాడు? ఈ గొడవలకు సిటీ పోలీస్ కమీషనర్‌కు (ప్రకాష్ రాజ్) ఎలాంటి సంబంధం ఉంది అన్నదే రాయన్ మూవీ(Raayan Review) కథ.
సక్సెస్ ఫార్ములా...
అన్నతమ్ముళ్ల సెంటిమెంట్ ఫార్ములా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఊపు ఊపేసింది. తమ్ముళ్ల బాగుకోసం అన్న ఏన్నో పోరాటాలు, త్యాగాలు చేయడం అనే సెంటిమెంట్ కథలతో రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు పలు సినిమాలు చేసి విజయాల్ని అందుకున్నారు. రాయన్ అదే ఫార్ములాతో వచ్చిన రెగ్యులర్ రివేంజ్ డ్రామా మూవీ.
ట్రీట్‌మెంట్ కొత్తది...
రొటీన్ స్టోరీకి తనదైన ట్రీట్‌మెంట్‌తో కొత్తదనం జోడించారు దర్శకుడు ధనుష్. సినిమా కంప్లీట్‌గా రా అండ్ రస్టిక్‌గా సాగుతుంది. మాస్ యాంగిల్ వల్లే సినిమాలో ప్రెష్‌నెస్ కనిపించింది. సినిమాలో ధనుష్(Raayan Review) క్యారెక్టర్ మొత్తం అండర్‌ప్లేతో సాగుతుంది. అతడికి ఓ భీభత్సమైన ఫ్లాష్‌బ్యాక్ ఏదో ఉంటుందని సస్పెన్స్ క్రియేట్ చేస్తూవెళ్లాడు డైరెక్టర్. సినిమా బోర్‌గా సాగిపోతూ ట్రాక్ తప్పుతుందన్న టైమ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్‌తో నిలబెట్టాడు ధనుష్.
రొటీన్‌కు భిన్నంగా...
సినిమా ఫస్ట్ హాఫ్ కుటుంబం కోసం ధనుష్ పడే పాట్లు, ముత్తువేల్ లవ్‌స్టోరీ, దుర్గ, మాణిక్యంలతో రాయన్‌కు ఉన్న అనుబంధం చుట్టూ నడుస్తుంది. మరోవైపు దురై, సేతురామన్ మధ్య గొడవలను అంతర్లీనంగా చూపిస్తూ వెళ్లాడు ధనుష్. దురైని చనిపోయే ట్విస్ట్‌తోనే సెకండాఫ్‌పై(Raayan Review) ఇంట్రెస్టింగ్‌ను కలిగించారు.
తమ్ముళ్ల కారణంగా ధనుష్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరకు అన్నయ్యే ఆ తమ్ముళ్లు ఎదురుతిరిగే సీన్స్ చుట్టూ సెకండాఫ్‌ను ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు. సెకండాఫ్‌లో దుషారా విజయన్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వడం బాగుంది. క్లైమాక్స్‌ను రొటీన్‌కు భిన్నంగా ఎండ్ చేశాడు.
వందశాతం న్యాయం...
పాత్ర ఏదైనా అందులో వందశాతం ఒదిగిపోతుంటాడు ధనుష్. రాయన్‌గా (Raayan Review)ధనుష్ నటన, లుక్ బాగున్నాయి. గత సినిమాల ఛాయలేవి తన నటనలో కనిపించకుండా చక్కటి వేరియేషన్ చూపించాడు. సందీప్‌కిషన్ ఫుల్‌లెంగ్త్ రోల్‌లో కనిపించాడు. ధనుష్ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసేందుకు అతడి పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
దుషారా విజయన్ క్యారెక్టర్‌ను సర్‌ప్రైజింగ్‌గా రాసుకున్నాడు. తన యాక్టింగ్‌తో అదరగొట్టింది. ఎస్‌జే సూర్య, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్ ప్రతి ఒక్కరూ పోటాపోటీగా నటించారు. ఈ సినిమాకు టెక్నికల్‌గా ఏఆర్ రెహమాన్ హీరోగా నటించాడు. అతడి బీజీఎమ్ చాలా సీన్స్‌లో గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది.
Raayan Review - రా అండ్ రస్టిక్
రాయన్ రా అండ్ రస్టిక్‌గా సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. ధనుష్ యాక్టింగ్ కోసం ఈ మూవీ చూడొచ్చు. అయితే తమిళ నేటివిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల తెలుగు ప్రేక్షకులు ఈ కథ ఎంత వరకు కనెక్ట్ అవుతుందని చూడాల్సిందే.
రేటింగ్: 2.5/5