తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aamir Khan Divorce: ఆమిర్ ఖాన్‌తో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను: మాజీ భార్య షాకింగ్ కామెంట్స్

Aamir Khan Divorce: ఆమిర్ ఖాన్‌తో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను: మాజీ భార్య షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

22 July 2024, 8:48 IST

google News
    • Aamir Khan Divorce: ఆమిర్ ఖాన్ తో విడాకుల గురించి కిరణ్ చెప్పిన మాటలు విన్న తర్వాత మీకు కూడా కొంచెం వింతగా అనిపిస్తుంది. విడాకుల తర్వాత తాను చాలా హ్యాపీగా ఉన్నానని ఆమె చెప్పడం విశేషం.
ఆమిర్ ఖాన్‌తో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను: మాజీ భార్య షాకింగ్ కామెంట్స్
ఆమిర్ ఖాన్‌తో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను: మాజీ భార్య షాకింగ్ కామెంట్స్

ఆమిర్ ఖాన్‌తో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను: మాజీ భార్య షాకింగ్ కామెంట్స్

Aamir Khan Divorce: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకుని మూడేళ్లు అయింది. 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2021లో తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ విడాకులపై ఇన్నేళ్ల తర్వాత కిరణ్ రావ్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. నిజానికి చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది.

విడాకుల తర్వాతా కలిసే..

నిజానికి విడాకుల తర్వాత కూడా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ తరచూ కుటుంబంతో, తమ కొడుకుతో సరదాగా గడుపుతుంటారు. ఈ మధ్యే లాపతా లేడీస్ మూవీని కిరణ్ డైరెక్ట్ చేసింది. ఆ సినిమాను ఆమిర్ ఖాన్ నిర్మించడం విశేషం. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. నెట్‌ఫ్లిక్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

అయితే తాజాగా ఆమిర్ తో విడాకుల గురించి కిరణ్ చెప్పిన మాటలు వింటే మీకు కూడా కొంచెం వింతగా అనిపిస్తుంది. విడాకుల తర్వాత తాను చాలా హ్యాపీగా ఉన్నానని ఆమె చెప్పడం విశేషం. ఇంతకీ ఆమె ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందో చూడండి.

చాలా హ్యాపీగా ఉన్నాను: కిరణ్

కిరణ్ రావు ఇటీవల ఫయే డిసౌజా షోలో కనిపించింది. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా మాట్లాడింది. "అప్పుడప్పుడూ మీరు మీ సంబంధాన్ని మళ్లీ పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, మనం ఎదిగే కొద్దీ మనిషిగా చాలా మారిపోతాం. మనకు భిన్నమైన అంశాలు కావాలి. విడాకుల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నానని భావిస్తున్నాను. మీరు దీనిని సంతోషకరమైన విడాకులు అని పిలవవచ్చు"అని కిరణ్ అనడం గమనార్హం.

తాను ఎందుకు సంతోషంగా ఉన్నానో కూడా వివరిస్తూ.. “పెళ్లి చేసుకోకుండా చాలా కాలం ఒంటరిగా ఉన్నాను. పెళ్లికి ముందు నా జీవితాన్ని, స్వేచ్ఛను బాగా ఆస్వాదించాను. నేను అప్పుడు ఒంటరిగా ఫీలయ్యేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే నేను నా కుమారుడు ఆజాద్ తో ఉన్నాను. విడాకుల తర్వాత చాలా మంది ఒంటరిగా ఫీలవుతారని నేను అనుకుంటున్నాను. కానీ ఆమిర్, నా కుటుంబం నుంచి నాకు పూర్తి మద్దతు లభిస్తున్నందుకు నేను ఎప్పుడూ ఆ ఒంటరితనాన్ని అనుభవించలేదు. అందుకే ఇది మంచి విషయం అని అన్నాను. ఇవి చాలా సంతోషకరమైన విడాకులు” అని చెప్పుకొచ్చింది.

మా మధ్య ఇంకా ప్రేమ ఉంది

ఆమిర్ ఖాన్ తో విడాకుల ద్వారా విడిపోయినా.. తమ మధ్య ఇంకా ప్రేమ ఉందని కిరణ్ చెప్పింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. “విడిపోవడానికి మాకు ఒకే పేపర్ (విడాకుల పేపర్) కావాలి. కానీ మేము నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకున్నామని మాకు తెలుసు. ఈ రోజు కూడా మా మధ్య చాలా ప్రేమ ఉంది, చాలా గౌరవం ఉంది, చాలా గతం ఉంది. వాటిని నేను ఎప్పుడూ కోల్పోవటానికి ఇష్టపడను” అని కిరణ్ స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం