Aadujeevitham OTT: ఆడుజీవితం మూవీ ఓటీటీలోకి ఎప్పుడు? ఆలస్యమవుతోంది ఇందుకేనా?
27 May 2024, 13:57 IST
- Aadujeevitham The Goat Life OTT: ‘ఆడుజీవితం - ది గోట్‍లైఫ్’ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మాత్రం ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యమవుతూనే ఉంది.
Aadujeevitham OTT: ఆడుజీవితం మూవీ ఓటీటీలోకి ఎప్పుడు? ఆలస్యమవుతోంది ఇందుకేనా?
Aadujeevitham OTT: ఇటీవలి కాలంలో సూపర్ హిట్ అయిన కొన్ని మలయాళ సినిమాలు ఓటీటీల్లోకి ఆలస్యంగా వస్తున్నాయి. చాలా రోజుల నిరీక్షణ తర్వాత అడుపెడుతున్నాయి. ముంజుమ్మల్ బాయ్స్ మూవీ అలాగే థియేటర్లలో రిలీజైన 70 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. కాగా, ఇప్పుడు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆడుజీవితం - ది గోట్‍లైఫ్’ సినిమా కూడా ఇలాగే అవుతోంది. ఈ ఎమోషనల్ సర్వైవల్ డ్రామా మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. థియేటర్లలో రిలీజై సుమారు రెండు నెలలు అయినా ఇంకా ఓటీటీలోకి రాలేదు. చాలా మంది ప్రేక్షకులు ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ కోసం నిరీక్షిస్తున్నారు.
మళ్లీ వాయిదా!
ఆడుజీవితం సినిమా మే 26వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే సమాచారం చక్కర్లు కొట్టింది. ఆరోజు తప్పకుండా ఓటీటీలోకి అడుగుపెడుతుందనే టాక్ నడిచింది. అయితే, హాట్‍స్టార్ ఓటీటీ మాత్రం మళ్లీ ఆలస్యం చేసింది. మే 26న కూడా స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదు.
ఆడుజీవితం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా కూడా హాట్‍స్టార్ ఓటీటీని చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే, హాట్‍స్టార్ ఇంకా ఈ మూవీ స్ట్రీమింగ్‍పై క్లారిటీ ఇవ్వలేదు.
ఆలస్యం ఇందుకేనా?
డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీ దుమ్మురేపుతోంది. మే 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చిన ఆ సినిమా భారీ వ్యూస్ సాధిస్తోంది. ఇంకా హాట్‍స్టార్ ట్రెండింగ్‍లో టాప్‍లో కొనసాగుతోంది. మంజుమ్మల్ బాయ్స్ మూవీపై ఇంకా బజ్ నడుస్తోంది. అందుకే ఆడుజీవితం ఓటీటీ స్ట్రీమింగ్‍ను హాట్‍స్టార్ ఆలస్యం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంజుమ్మల్ బాయ్స్ హోరు తగ్గాక ఆడుజీవితం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్.
జూన్ తొలి వారంలోనే ఆడుజీవితం చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరి అప్పుడైనా తేస్తుందా.. ఇంకా ఆలస్యం చేస్తుందా అనేది చూడాలి.
ఆడుజీవితం కలెక్షన్లు
ఆడుజీవితం సినిమా నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా థియేటర్లలో మార్చి 28వ తేదీన రిలీజ్ అయింది. మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. ఈ మూవీకి సుమారు రూ.160కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మలయాళంలో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. అయితే, తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లను దక్కించుకుంది. అయితే, ఈ మూవీతో పృథ్విరాజ్ సుకుమారన్ బ్లాక్‍బస్టర్ కొట్టారు.
ఆడుజీవితం మూవీకి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. 10ఏళ్లకు పైగా ఈ సినిమా కోసమే ఆయన పని చేశారు. ఈ చిత్రం నజీబ్ మహమ్మద్ అనే పాత్ర పోషించారు పృథ్విరాజ్ సుకుమారన్. ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లి బానిసగా మారి.. ఎడారి నుంచి తప్పించుకునేందుకు పోరాడిన నజీబ్ అనే వ్యక్తి జీవితంపై ఈ మూవీ రూపొందింది. బెన్యామిన్ రచించిన పాపులర్ బుక్ ఆడుజీవితం ఆధారంగా అదే పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ బ్లెస్సీ. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో పృథ్విరాజ్ నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి.