తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Janasena Confusion: పోటీ పరిమితమే అయినా అభ్యర్థుల ప్రకటనలో జాప్యం… జనసేన శ్రేణుల్లో అయోమయం

Janasena Confusion: పోటీ పరిమితమే అయినా అభ్యర్థుల ప్రకటనలో జాప్యం… జనసేన శ్రేణుల్లో అయోమయం

Sarath chandra.B HT Telugu

27 March 2024, 11:20 IST

google News
    • Janasena Confusion: జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడంలో జాప్యం కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి దాదాపు నెలముందే కసరత్తు ప్రారంభించినా ఇంకా కొలిక్కి రాలేదు. 
జనసేన అభ్యర్థుల ప్రకటనపై కొనసాగుతున్న సందిగ్ధత
జనసేన అభ్యర్థుల ప్రకటనపై కొనసాగుతున్న సందిగ్ధత (Telugu Desam Party X)

జనసేన అభ్యర్థుల ప్రకటనపై కొనసాగుతున్న సందిగ్ధత

Janasena Confusion: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కొలిక్కి వచ్చాయి. అధికార వైసీపీYCPని ఓడించడమే లక్ష్యంగా జనసేన సీట్ల సర్దుబాటు కూడా చేసుకుంది. పోటీ చేసే స్థానాల సంఖ్యను భారీగా కుదించుకున్నా వాటిలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించడంలో జాప్యం తప్పడం లేదు.

జనసేన Jansenaపార్టీకి కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయడంలో ఎడతెగని జాప్యం కొనసాగుతోంది.  TDP టీడీపీ-జనసేన మధ్య Alliance సీట్ల సర్దుబాటు కుదిరిన తర్వాత తొలుత జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. ఎన్డీఏ కూటమిలో రెండు పార్టీలో చేరిన తర్వాత జనసేన 21 స్థానాలకు పరిమితం అయ్యింది. ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా ఇంకా స్పష్టత కొరవడింది.

అటు బీజేపీకి BJP కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీకి బలం లేని స్థానాలను కేటాయించారంటూ ఆ పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాము కోరుతున్న స్థానాలను ఇవ్వాల్సిందేనని బీజేపీ ఒత్తిడి చేస్తోంది.

దీంతో బీజేపీతో సర్దుబాటు కొలిక్కి వచ్చే వరకు జనసేన అభ్యర్థుల ప్రకటనకు అటంకంగా మారుతోంది. ఇప్పటి వరకు జనసేన అధికారికంగా ప్రకటించిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కాకుండా, మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ అభ్యంతరాల నేపథ్యంలో కొన్ని స్థానాల్లో అనివార్యమైన మార్పులు తప్పవనే అంచనాతో జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడానికి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి.

మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో మొదట 24 సీట్లు జనసేనకు కేటాయించినా ఆ తర్వాత అది 21కు తగ్గింది. బీజేపీకి పది అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాలు కేటాయించారు. మిగిలిన 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. రెండు విడతల్లో అభ్యర్థుల్ని ప్రకటించినా మరో 16 స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

బీజేపీకి కేటాయించిన 10 సీట్ల విషయంలో స్పష్టత వస్తే తప్ప జనసేన అభ్యర్థుల ఖరారు కాని పరిస్థితి నెలకొంది. జనసేనకు కేటాయించిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అధికారికంగా ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. అనధికారికంగా 16 అసెంబ్లీ స్థానాల్లో పోటీపై పవన్‌ స్పష్టత ఇచ్చారని , ప్రచారం చేసుకోవాలని చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఫిబ్రవరి 24వ తేదీన చంద్రబాబుతో కలిసి పవన్ జనసేన అభ్యర్థుల్ని ప్రకటించారు. అందులో  నెలిమర్ల, తెనాలి, అనకాపల్లి, రాజానగరం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గ జనసేన అభ్యర్థుల పేర్లను పవన్‌కళ్యాణ్‌ అధికారికంగా ప్రకటించారు. తర్వాత నిడదవోలు అభ్యర్థిని ప్రకటించారు. పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పెందుర్తి, ఎలమంచిలి, ఉంగుటూరు, రాజోలు, తిరుపతి అభ్యర్థులతో భేటీ సందర్భంగా వారికి ఎన్నికల్లో పోటీపై  స్పష్టత ఇచ్చారు. ఆ స్థానాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినా వారిని ఖరారు చేసినట్టేనని హామీ ఇచ్చారు. పోటీ చేసే స్థానాలు తక్కువే అయినా వాటిని పూర్తిగా ప్రకటించకపోవడంపై జనసేనలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పవన్‌ కళ్యాణ్‌ హామీతో తిరుపతిలో ప్రచారం ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు ప్రకటించారు.

దీంతో తిరుపతి జనసేనలో అసమ్మతి రేగింది. ఆరణి శ్రీనివాసులకు సహకరించేది లేదని తిరుపతి జనసేన నాయకులు తేల్చి చెబుతున్నారు. చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులు అనుచరులు గతంలో తిరుపతి జనసేన నేతలను అవమానించారని గుర్తుచేస్తున్నారు. ఆరణికి టికెట్‌ ఇస్తే పనిచేసేది లేదంటూ తీర్మానం చేసి ఆ లేఖను అమరావతికి పంపారు. విజయవాడ పశ్చిమలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

తదుపరి వ్యాసం