AP Welfare Schemes: తప్పనిసరి పథకాలకే ఏటా రూ.52వేల కోట్లు.. చంద్రబాబువైతే రూ.1.40 లక్షల కోట్లు.. పంపకం మీదే నమ్మకం
27 March 2024, 11:48 IST
- AP Welfare Schemes: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాకర్షక పథకాల రూపంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు బదిలీ పథకాల మీదే పార్టీలు ఆధారపడుతున్నాయి. ఏటా రూ.52వేల కోట్లను ఇస్తోన్న తమనే నమ్మాలని, చంద్రబాబు రూ.1.40లక్షల కోట్ల హామీలను నమ్మొద్దని సిఎం జగన్ చెబుతున్నారు.
నగదు బదిలీ పథకాల మీదే ఏపీలో పార్టీల ఆశలన్నీ....?
AP Welfare Schemes: ఆంధ్రప్రదేశ్‌లో ఏటా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల DBT Schemes రూపంలో ఏటా రూ.52వేల కోట్ల రుపాయల్ని పంచుతున్న తమనే నమ్మాలని, చంద్రబాబు రూ.1.40లక్షల కోట్లు పంచుతామని మోసపు హామీలిస్తున్నారని సిఎం జగన్ మేదరమెట్ల medarametla సిద్ధం Siddhamసభలో ఆరోపించారు.
ఏపీలో సంక్షేమ పథకాల్లో భాగంగా తప్పనిసరిగా అందించే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా ఏటా లబ్దిదారులకు బదిలీ చేస్తున్న సొమ్మ అక్షరాలా రూ.52వేల కోట్ల రుపాయలుగా జగన్ Ys jagan లెక్కలతో చెప్పారు. చంద్రబాబు Chandra babuఇచ్చే హామీలతో కలిపితే రూ.1.40లక్షల కోట్లు కానుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల రూపంలో లబ్దిదారులకు కొన్ని పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేస్తున్నారు. వీటిలో కొన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయనేది జగన్ మాట…. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా తమను గెలిపిస్తే జనాలకు ఏమి చేస్తామో వివరిస్తూ వరాలు కురిపిస్తున్నాయి.
ఆదివారం మేదరమెట్లలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఓ ఆసక్తికరమైన లెక్కలను వివరించారు. ఏపీలో ఏటా తప్పనిసరిగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకే రూ.52వేల కోట్ల రుపాయలను ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఐదేళ్లలో రూ.2లక్షల 70వేల కోట్ల రుపాయలను ప్రజలకు నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా అందించామని చెప్పారు.
కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలు ఇంటి ఇంటికి అందించామని చెప్పారు.నేరుగా మహిళల ఖాతాల్లోకి నగదు జమ చేసినట్టు చెప్పారు. నాన్- డీబీటీ ఖర్చు రూ.1.10లక్ష కోట్లు, డిబిటి పథకాలకు రూ.2.60లక్షల కోట్లు అందించామన్నారు. ఈ రెండు కలిపితే మొత్తం రూ.3.70 లక్షల కోట్లను ప్రజలకు ఖర్చు చేసినట్లు చెప్పారు.
ప్రజలకు సంవత్సరానికి రూ.70వేల కోట్లు లంచాలు లేకుండా నేరుగా అందించామన్నారు. ఏపీలో ఏటా 66 లక్షల మంది పింఛన్లకు రూ. 24వేల కోట్లుఉచితంగా విద్యుత్ అందించే పథకాలకు రూ.11వేల కోట్లు, సబ్సిడీ బియ్యం అందించడానికి రూ.4600కోట్లు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108- 4,400కోట్లు, ఫీజు రీయంబర్సెమెంట్, విద్యా దీవెన, వసతి దీవెన- 5000కోట్లు,సంపూర్ణ పోషణకు రూ 2000కోట్లు, గోరు ముద్ద పథకానికి రూ1900 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పథకాలన్నింటికి కలిపి ఏటా రూ.52,750కోట్ల ఖర్చు చేస్తున్నట్టు వివరించారు.
జగన్ రూ.52వేల కోట్లు… బాబు వస్తే రూ.1.40లక్షల కోట్లు...
వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలకే రూ.52వేల కోట్లను ఏటా చేయాల్సి ఉంటే, చంద్రబాబు ఇచ్చిన హామీలు కలిపితే అది రూ.1.40లక్షల కోట్లు అవుతుంది. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ఏటా రూ.73,440కోట్ల రుపాయలు అవసరమని ఏపీ ఆర్ధిక శాఖ అంచనా వేసినట్టు సిఎం జగన్ సిద్ధం సభలో చెప్పారు.
ఇటీవల బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ పథకాన్ని కూడా కలుపుకుంటే మరో రూ.13,872 కోట్ల రుపాయలు అవసరం అవుతాయన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఏడు పథకాలకు 87,312 కోట్ల రుపాయలు అవసరం కానున్నాయి. ఇప్పటికే అమలు చేస్తున్న డిబిటి పథకాలతో కలిపితే అది రూ.1.40లకక్షల కోట్లకు చేరనుంది.
సూపర్ సిక్స్‌తో టీడీపీ మ్యానిఫెస్టో....
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం గత ఏడాది నవంబర్‌లో టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలను చేకూర్చిన పలు పథకాలను మ్యానిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది.
గత ఏడాది రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారంటీల మినీ మ్యానిఫెస్టోను టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత జనసేన కూడా జత కలవడంతో ఇప్పుడు మరో ఐదు గ్యారంటీలు కలుపుకుని మొత్తం 11 గ్యారంటీలతో ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోగా ప్రకటించారు.
గతంలో టీడీపీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ.10లక్షల వరకూ రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు. ఆరు గ్యారంటీల్లో మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు వంటి హామీలు ఉన్నాయి.
పంచడంలో పోటీ….
ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు రాజకీయ పార్టీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒకరు ఇప్పటికే రూ.70వేల కోట్లను ఏటా పంచిపెడుతున్నామని చెబుతుంటే మరో పార్టీ రూ.1.40లక్షల కోట్లను పంచడానికి సిద్ధమని ప్రకటిస్తోంది.