AP DBT Schemes: ఏపీలో మరో 2.62లక్షల మందికి సంక్షేమ పథకాలు అమలు…సిఎం జగన్
AP DBT Schemes: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 2.62లక్షల మందికి నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలను వర్తింప చేస్తున్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లబ్దిదారులకు వర్చువల్‌గా పథకాల నిధులను విడుదల చేశారు.
AP DBT Schemes: ఇంటింటికి మంచి చేయాలనే తాపత్రయంతోనే రాష్ట్రంలో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీల ప్రస్తావన చూడకుండా, ఓటు వేయకపోయినా ఫర్లేదు, ఖచ్చితంగా సంక్షేమం అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఏపీ సిఎం జగన్ చెప్పారు.
నవరత్నాల పాలన భాగంగా అర్హత ఉండి,ఏ కారణంతోనైనా అందాల్సిన ప్రయోజనాలు దక్కకపోతే వారికి కూడా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా కారణాలతో సంక్షేమ పథకాలు అందకపోతే వారికి కూడా దరఖాస్తు చేసుకుంటే తనిఖీ చేసి పథకాలను వారికి అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ పథకాలు అందకుండా మిగిలిపోయిన వారికి లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పారు. అధికారం అంటే ప్రజలకు మంచి చేయడం కోసం నాలుగు అడుగులు ముందుకు వేసే బాధ్యతగా తాము భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో వివిధ కారణాల వల్ల పథకాలు అందుకోలేకపోయిన 2.62లక్షల మంది లబ్దిదారులకు, గత ఆర్నెల్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అన్నింటిని ఒకేసారి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అర్హుల ఖాతాల్లో రూ.216కోట్లు జమ చేస్తున్నామన్నారు. ఆర్నెల్లుగా జరిగిన వివిధ పథకాలు అందుకోలేకపోయిన అర్హులకు మేలు చేస్తున్నామన్నారు.
కొత్తగా 1,49,875 పెన్షన్లు…..
ఆర్నెల్ల వ్యవధిలో కొత్త పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల స్థలాను అంద చేస్తున్నామని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా 2.62లక్షల మందికి రూ216 కోట్ల నగదును వారి ఖాతాలకు బదిలీ చేసినట్లు సిఎం చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 1,49,875మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు సిఎం చెప్పారు.కొత్తగా మరో 2,00,312మందికి య్యం కార్డులు పంపిణీ చేసినట్లు చెప్పారు. 4327 ఆరోగ్య శ్రీ కార్డులు, 12069ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు1,49,875మందితో కలిపి 64.27లక్షలకు చేరిందన్నారు. గతంలో 39లక్షల మాత్రమే పెన్షన్లు ఉండేవన్నారు.
గతంలో 39లక్షల పెన్షన్లు మాత్రమే…
2018 అక్టోబర్ ముందు వరకు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 39లక్షలు మాత్రమేనని సిఎం జగన్ చెప్పారు. ఇప్పుడు వాటి సంఖ్య 64.27లక్షలకు ఆ సంఖ్య చేరిందన్నారు. గతంలో పెన్షన్ వెయ్యి మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు రూ.2750 చెల్లిస్తున్నామని చెప్పారు. బియ్యం కార్డులు 2,00312 కొత్తగా మంజూరు చేశామని, రాష్ట్రంలో 1,48,12,334 బియ్యం కార్డులు ఉన్నాయని చెప్పారు. కొత్తగా ఇస్తున్న 4300ఆరోగ్య శ్రీకార్డులతో కలిపి 1,42,14,820మందికి ఆరోగ్య శ్రీ ఉందన్నారు.
12,069ఇళ్ల పట్టాలతో కలిపి 30.84లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు. వివిధ పథకాల్లో కొత్తగా 2.62 లక్షల మందికి లబ్ది కలుగుతుందని చెప్పారు. రకరకాల పరిస్థితుల్లో మిగిలిపోయిన వారందరికి మేలు చేస్తున్నామని సిఎం చెప్పారు.
జగనన్న చేదోడు 43,170మందికి, వైఎస్సార్ మత్స్యకార భరోసాలో 207, సున్న వడ్డీ పథకంలో ఇన్‌పుట్ సబ్సిడీలో లక్షా 8వేల మందికి కొత్తగా మేలు చేస్తున్నామని చెప్పారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా కొత్తగా 32,770మంది తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నట్లు చెప్పారు. మరో 36,890మందికి వసతి దీవెన డబ్బులు ఇస్తున్నామన్నారు. ఈబీసీ నేస్తం 8753మందికి , నేతన్న నేస్తంలో అమ్మఒడి 16,753మందికి లబ్దిదారులకు ఆర్ధిక సాయం అందిస్తున్నామని చెప్పారు.