తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Priyanka Gandhi : కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ ఫిక్స్​!

Priyanka Gandhi : కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ ఫిక్స్​!

Sharath Chitturi HT Telugu

14 June 2024, 8:13 IST

google News
  • Priyanka Gandhi : ప్రియాంక గాంధీ ఎన్నికల రాజకీయాల ఎంట్రీకి సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేరళ వయనాడ నుంచి ఆమె పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రియాంక గాంధీ..
ప్రియాంక గాంధీ.. (PTI)

ప్రియాంక గాంధీ..

Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్​ పార్టీకి గత కొన్నేళ్లుగా వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నికల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్​ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్​ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?

2019 నుంచి కాంగ్రెస్​లో క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ.. ప్రియాంక గాంధీ ఇంకా ఎన్నికల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కొన్నేళ్ల క్రితం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా పోటీ చేస్తారని కాంగ్రెస్​ శ్రేణులు కూడా భావించారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని, తన మనసులో మాట కూడా బయటపెట్టారు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు.

ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ రెండు సీట్లల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అవి.. తల్లి సోనియా గాంధీకి చెందిన రాయ్​బరేలీ, 2019లో తాను గెలిచిన కేరళ వయనాడ్​ సీటు. ఈసారి.. ఆయన ఆ రెండు సీట్లల్లోనూ విజయం సాధించారు. రాజ్యాంగం ప్రకారం.. ఆ రెండింట్లో ఒకటి ఒదులుకోక తప్పదు. వయనాడ్​, రాయ్​బరేలీల్లో రాహుల్​ గాంధీ ఏ సీటు వదులుకుంటారు? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Priyanka Gandh Congress : అయితే.. రాహుల్​ గాంధీ.. కేరళ వయనాడ్​ సీటును వదులుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంపైనా ఇటీవలే సంకేతాలిచ్చారు రాహుల్​ గాంధీ.

"నా సోదరి వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీని 2,3 లక్షల ఓట్ల తేడాతో ఓడించేది," అని అన్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత.

దేశ రాజకీయాల్లో సోదరుడు రాహుల్​ గాంధీకి సాయం చేస్తూనే.. యూపీ కాంగ్రెస్​ని తన భుజాల మీద మోస్తున్నారు ప్రియాంక. లోక్​సభ ఎన్నికల్లోనూ అక్కడ కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా.. ఈసారి కాంగ్రెస్​ ఆరు సీట్లు గెలుచుకోగలిగింది. 2019లో ఇది కేవలం ఒక్కటి మాత్రంగానే ఉంది.

Priyanka Gandh Wayanad : ఈ దఫా ఎన్నికల్లో బీజేపీకి యూపీ నుంచి గట్టి షాక్​ తగిలిన విషయం తెలిసింది. 80 సీట్లల్లో బీజేపీ కనీసం సగం కూడా దాటలేకపోయింది. సమాజ్​వాదీ పార్టీ- కాంగ్రెస్​ ఇండియా కూటమి 43 సీట్లల్లో గెలిచింది. ఎన్నికల ఫలితాల అనంతరం.. ప్రియాంక గాంధీపై సోదరుడు రాహుల్​ గాంధీ, ప్రశంసల వర్షం కురిపించారు.

తదుపరి వ్యాసం