తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Zaheerabad Bjp : పార్టీలో చేరిన 24 గంటల్లోనే టికెట్, మరి కేడర్ సహకరిస్తుందా?- బీబీ పాటిల్ ముందు బిగ్ ఛాలెంజ్

Zaheerabad BJP : పార్టీలో చేరిన 24 గంటల్లోనే టికెట్, మరి కేడర్ సహకరిస్తుందా?- బీబీ పాటిల్ ముందు బిగ్ ఛాలెంజ్

HT Telugu Desk HT Telugu

03 March 2024, 15:28 IST

google News
    • Zaheerabad BJP : బీజేపీ తొలి జాబితాలో జహీరాబాద్ టికెట్ ను బీబీ పాటిల్ కు కేటాయించారు. పార్టీలో చేరిన 24 గంటల్లో ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించింది. అయితే జహీరాబాద్ టికెట్ ఆశించిన స్థానిక నేతలు ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నారు.
బీబీ పాటిల్
బీబీ పాటిల్

బీబీ పాటిల్

Zaheerabad BJP : బీజేపీలో జాయిన్ అయినా 24 గంటల్లోనే జహీరాబాద్ టికెట్ పొంది జాక్ పాట్ కొట్టిన బీబీ పాటిల్(BB Patil) కు... స్థానిక బీజేపీ నాయకుల మద్దతు కూడగట్టుకోవడం మాత్రం అంత తేలికైన పనికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులతో, క్యాడర్ తో కలిసి పనిచేయడం అంత తేలిక కాదని ఆయనకు టికెట్ ప్రకటించక ముందే బహిర్గతం అయ్యింది. బీజేపీ తొలి జాబితా(BJP First List)లో పాటిల్ కు టికెట్ ప్రకటిస్తారని తెలియడంతో, అదే టికెట్ ఆశిస్తున్నా జహీరాబాద్ బీజేపీ నాయకుడు ఎం జైపాల్ రెడ్డి వర్గీయులు హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ కు చేరుకొని నిరసనను వ్యక్తం చేశారు.

పాటిల్ కు టికెట్- పార్టీ కోసం పనిచేసిన వారికీ అన్యాయం

పాటిల్ కు టికెట్ ఇచ్చి, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి అన్యాయం చేయొద్దని బీజేపీ నాయకులు పార్టీ నాయకత్వాన్ని కోరారు. అయినా పార్టీ నాయకత్వం తొలి జాబితాలో తెలంగాణ నుంచి ప్రకటించిన 9 మందిలో బీబీ పాటిల్ పేరును కూడా చేర్చింది. జైపాల్ రెడ్డి, తన వర్గీయులే కాకుండా, పార్టీ టికెట్ ఆశించిన మిగతా బీజేపీ నాయకులను కూడా నాయకత్వం నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసింది. మూడు నెల ముందుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, బీఆర్ఎస్ ఎంపీగా పాటిల్ జహీరాబాద్ లోక్ సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోను బీజేపీ (BJP)అసెంబ్లీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు. బీజేపీ నాయకులూ ఎవరు కూడా ఇంకా ఇది మర్చిపోలేదని పార్టీ నాయకులూ అంటున్నారు. జహీరాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్న, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది.

వెంకటరమణ రెడ్డి సహకరిస్తారా?

కామారెడ్డి(Kamareddy)లో గెలిచినా కాటిపల్లి వెంకటరమణ రెడ్డే ఇక్కడ జహీరాబాద్(Zaheerabad) లోక్ సభ పార్లమెంట్ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. కామారెడ్డిలో... పాటిల్ బీఆర్ఎస్ అభ్యర్థి అయినా మాజీ సీఎం కేసీఆర్(KCR) మద్దతుగా, వెంకటరమణ రెడ్డికి(KV Reddy) వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. వెంకటరమణ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఎంతమేరకు పాటిల్ సహకరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇదే విధంగా, పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసినా పార్టీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలె భాస్కర్, 2019 లో పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన బాణాల లక్ష్మా రెడ్డి, టికెట్ ఆశించిన పారిశ్రామికవేత్త మేడపాటి ప్రకాష్ రెడ్డి, మిగతా నాయకులు ఎంతమేరకు పాటిల్ కు ఎన్నికల ప్రచారంలో సహకరిస్తరనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇన్నిరోజులు బీజేపీ అంటే, పార్టీలో సంస్థాగతంగా పనిచేసినవారికే పదవులు ఇస్తారనే ఒక నమ్మకం ఉండేదని, కానీ పార్టీ నాయకత్వం తాజా నిర్ణయంతో నాయకుల నమ్మకాన్ని తుంగలో తొక్కినట్టయ్యిందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. టికెట్ ఆశించి దక్కని నాయకులు, తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీలో కానీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇదే జరిగితే బీజేపీకి జహీరాబాద్ లో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని అంటున్నారు విశ్లేషకులు.

తదుపరి వ్యాసం