Navaneeth Vs Owaisi: ఒవైసీ సోదరుకులకు నవనీత్‌కౌర్ వార్నింగ్, అసదుద్దీన్ కౌంటర్.. పదేళ్ల కిందటి వ్యాఖ్యలపై దుమారం
09 May 2024, 12:41 IST
- Navaneeth Vs Owaisi: పదేళ్ల క్రితం ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గతంలో 15నిమిషాలు పక్కకు తప్పుకుంటే సత్తా చూపిస్తామని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తమకు 15సెకన్ల సమయం చాలని ఎన్నికల ప్రచారంలో కౌర్ అన్నారు.
నవనీత్‌రాణా వ్యాఖ్యలపై ఒవైపీ ఆగ్రహం
Navaneeth Vs Owaisi: పదేళ్ల క్రితం పోలీసులు 15నిమిషాలు పక్కకు తప్పుకుంటే జనాభా లెక్కలు సరిచేస్తామంటూ 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నవనీత్ కౌర్ తమకు 15 సెకన్ల సమయం చాలని వ్యాఖ్యనించారు. 2013లో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలను బీజేపీ నేత నవనీత్ రాణా ప్రస్తావించారు.
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బుధవారం ఎన్నికల ప్రచారంలో ఒవైసీ సోదరులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
దేశంలో హిందూ-ముస్లిం నిష్పత్తిని సరిచేయడానికి తమకు 15 నిమిషాలు పడుతుందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నవనీత్ స్పందించారు. బీజేపీ టికెట్ పై అమరావతి నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న నవనీత్ ఓవైసీ సోదరులపై విరుచుకుపడ్డారు.
'15 నిమిషాల పాటు పోలీసులను తొలగించండి, మేము ఏమి చేయగలమో చూపిస్తామని తమ్ముడు అన్నాడని... నేను ఆ తమ్ముడికి (అక్బరుద్దీన్) ఓ సంగతి చెబుతానని, మీకు 15 నిమిషాలు పట్టచ్చేమో , కానీ మాకు 15 సెకన్లు మాత్రమే పడుతుందని... మేము ముందుకు వస్తే మనందరికీ 15 సెకన్ల సమయం పడుతుంది" అని నవనీత్ తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ లో ఒవైసీ సోదరులను ట్యాగ్ చేశారు.
2013లో జరిగిన ఓ సభలో అక్బరుద్దీన్ 15 నిమిషాల పాటు పోలీసులను ఉపసంహరించుకుంటే ఏం చేయాలో తమ వర్గం చూపిస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత తరఫున ప్రచారం సందర్భంగా నవనీత్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగుసార్లు లోక్ సభ ఎంపీగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రత్యర్థిగా బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపడం ఇదే తొలిసారి.
అసదుద్దీన్ 2004 నుంచి హైదరాబాద్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో తొలిసారి గెలిచిన ఒవైసీ గెలవడానికి ముందు ముందు 1984 నుంచి ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ లోక్ సభ స్థానంతో పాటు గోషామహల్ మినహా హైదరాబాద్ లోని అన్ని అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం ఆధీనంలో ఉన్నాయి.
హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో బహదూర్పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, మలక్పేట్, యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం గోషామహల్ మినహా అన్ని అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం ఆధీనంలో ఉన్నాయి. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది.
15 నిమిషాలు కాదు 15గంటలు తీసుకోవాలన్న ఒవైసీ…
నవనీత్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 15 సెకన్లు మాత్రమే ఎందుకు15 గంటల సమయం తీసుకోవాలని అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. వారు ముస్లింలను ఏమి చేయాలనుకుంటే ఏమి చేయాలన్నారు. అధికారమంతా మీ దగ్గరే ఉందని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని మాటలెందుకు అనుకున్నది చేసి చూపించాలన్నారు. 15 సెకన్లు కాదు 15గంటల సమయం తీసుకోవాలన్నారు.
హైదరాబాద్‌ను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై స్పందించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ప్రజలు పశువులు కాదని, వారు పౌరులు, రాజకీయ పార్టీల ఆస్తులు కాదని అన్నారు.
మోడీ బుధవారం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ సీటును ఒవైసీకి లీజుకు ఇచ్చారని చెప్పారని హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు, మేము పౌరులం, ప్రజలు రాజకీయ పార్టీల సొత్తు కాదన్నారు. నలభై ఏళ్లుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడించి ఎంఐఎంకు అప్పగించిందన్నారు. హిందుత్వం మళ్లీ ఓడిపోతుంది' అని ఓవైసీ ట్వీట్ చేశారు.