తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ycp Rajyasabha Mps: లోక్‌సభ, అసెంబ్లీలో కూడా టీడీపీని ఖాళీ చేస్తామన్న ఎంపీ సుబ్బారెడ్డి..

YCP Rajyasabha MPs: లోక్‌సభ, అసెంబ్లీలో కూడా టీడీపీని ఖాళీ చేస్తామన్న ఎంపీ సుబ్బారెడ్డి..

Sarath chandra.B HT Telugu

21 February 2024, 12:03 IST

    • YCP Rajyasabha MPs: రానున్న అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీని ఖచ్చితంగా ఖాళీ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ తీసుకున్నారు.
రాజ్యసభ సభ్యులుగా వైసీపీ  అభ్యర్ధుల గెలుపు
రాజ్యసభ సభ్యులుగా వైసీపీ అభ్యర్ధుల గెలుపు

రాజ్యసభ సభ్యులుగా వైసీపీ అభ్యర్ధుల గెలుపు

YCP Rajyasabha MPs: 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభలో టీడీపీని ఖాళీ చేశామని ఇప్పుడు ఇక పెద్దల సభలోనూ టీడీపీని ఖాళీ చేశామని వైవీ సుబ్బారెడ్డి YV Subbareddy అన్నారు. సాధారణ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఖాళీ చేస్తామన్నారు. పార్టీ మారిన వాళ్లు మళ్లీ తిరిగి వైసీపీలోకి వస్తారని జోస్యం చెప్పారు. ప్రజాబలం ముందు ప్రలోభాలు పనిచేయవన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

TS Lok Sabha Elections : అగ్రనేతలకు అగ్ని పరీక్షే- లోక్ సభ ఎన్నికల ఫలితాలే కీలకం!

రాజ్యసభ సభ్యుడిగా అసెంబ్లీ Assembly ఆవరణలో ధ్రువీకరణ పత్రం తీసుకున్న వై వి సుబ్బారెడ్డి, పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయాలని భావించిందని, వైసీపీ ఎమ్మెల్యేలు అంతా సీఎం జగన్ పట్ల విశ్వాసంతో ఉన్నారని, అందుకే రాజ్యసభలో ఏకగ్రీవంగా గెలవగలిగామని చెప్పారు.

టీడీపీని రాజ్యసభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వై ఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని సుబ్బారెడ్డి చెప్పారు.. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని తర్వాత లోక్ సభ, శాసనసభ లో కూడా క్లీన్ స్వీప్ అవుతుందన్నారు. వైసీపీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగివస్తున్నారన్నారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని, సీఎం జగన్ తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుందన్నారు. సీఎం జగన్‌తో జనం ఉన్నారని చెప్పారు.

ఏపీలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేసిన వేశారు. ఈ మూడు స్థానాల గెలుపుతో.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఏకగ్రీవమైన రాజ్యసభ సభ్యులకు ఎన్నికల అధికారులు ధృవ పత్రాలను అందించారు.

తాజా ఎన్నికలతో రాజ్యసభలో టీడీపీ ప్రాతినిథ్యం లేకుండా పోయింది. పార్టీ ఏర్పడిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేకుండా పోయారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఓడిపోతే వాటి ప్రభావం ఎన్నికలపై ఉంటుందనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేయలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం