తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections : రేపే లోక్​సభ ఎన్నికల 4వ దశ పోలింగ్​- పూర్తి వివరాలు..

Lok Sabha Elections : రేపే లోక్​సభ ఎన్నికల 4వ దశ పోలింగ్​- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu

12 May 2024, 18:20 IST

google News
  • Lok Sabha Elections 2024 live updates : 2024 లోక్​సభ ఎన్నికల 4వ దశ పోలింగ్​, ఆంధ్ర ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది! పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2024 లోక్​సభ ఎన్నికల కోసం సర్వం సిద్ధం..
2024 లోక్​సభ ఎన్నికల కోసం సర్వం సిద్ధం.. (PTI)

2024 లోక్​సభ ఎన్నికల కోసం సర్వం సిద్ధం..

2024 Lok Sabha elections phase 4 : మే 13, సోమవారం.. లోక్ సభ ఎన్నికల 4వ దశ పోలింగ్ జరగనుంది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ దఫా పోలింగ్​ జరగనున్నాయి.

నాలుగో దశలో.. ఆంధ్రప్రదేశ్​లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 28 అసెంబ్లీ స్థానాలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి.

2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ వరకు.. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 283 లోక్​సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా సాగింది. మొత్తం 7 దశ పోలింగ్​ ప్రక్రియ ముగిసిన తర్వాత.. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి.

ఫేజ్ 4లో ఏయే రాష్ట్రాల్లో లోక్​సభ ఎన్నికలు జరుగుతాయి? పోలింగ్ సమయం ఏంటి? పోలింగ్ రోజున వాతావరణ సూచన ఏంటి? ఎంత మంది అభ్యర్థులు, ఓటర్లు పాల్గొంటారు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2024 లోక్​సభ ఎన్నికల 4వ దశ పోలింగ్​..

Andhra Pradesh Lok Sabha elections : 1. ఫేజ్ 4లో పోలింగ్: ఆంధ్రప్రదేశ్​లోని మొత్తం 25 లోక్​సభ నియోజకవర్గాలు, బీహార్​లో 5, జమ్మకశ్మీర్లో 1, జార్ఖండ్, ఒడిశాల్లో 4, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 8 చొప్పున, తెలంగాణలో 17, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్​లో 13 లోక్​సభ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది.

2. ఓటింగ్ సమయం: పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అయితే, పోలింగ్ సమయాలు ముగియడం.. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా భిన్నంగా ఉండవచ్చు.

ఇదిలావుండగా, తెలంగాణలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం 17 నియోజకవర్గాల్లోని కొన్ని సెగ్మెంట్లలో ఓటింగ్ సమయాన్ని పెంచింది.

3. ఫేజ్ 4లో పాల్గొనే అభ్యర్థుల సంఖ్య: లోక్​సభ ఎన్నికల నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 1717 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

Odisha Lok Sabha elections 2024 : 4. ఫేజ్ 4లో ఎంతమంది ఓటర్లు పాల్గొంటారు? ఫేజ్ 4లో 8.97 కోట్ల మంది పురుషులు, 8.73 కోట్ల మంది మహిళా ఓటర్లు సహా 17.70 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు పైబడిన 12.49 లక్షల మంది, నాలుగో దశలో 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని, వారికి ఇళ్ల నుంచే ఓటు వేసే అవకాశం కల్పించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

5. ఫేజ్ 4 పోలింగ్ సందర్భంగా వాతావరణ సూచన: ఎన్నికల సంఘం ప్రకారం పోలింగ్ రోజున వడగాలుల అంచనా లేదు. పోలింగ్ జరిగే పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు (±2 డిగ్రీలు) నమోదయ్యే అవకాశం ఉంది. పోలింగ్ రోజున ఈ ప్రాంతాల్లో వడగాల్పులు లాంటి పరిస్థితులు ఉండవని ఎన్నికల సంఘం తెలిపింది.

అయితే ఓటర్ల సౌలభ్యం కోసం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నీరు, షామియానా, ఫ్యాన్లు వంటి సౌకర్యాలతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఈసీ తెలిపింది.

తదుపరి వ్యాసం