తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi Praised Madhavi Latha : బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై ప్రధాని మోదీ ప్రశంసలు, కారణం ఇదే?

PM Modi Praised Madhavi Latha : బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై ప్రధాని మోదీ ప్రశంసలు, కారణం ఇదే?

07 April 2024, 22:34 IST

google News
    • PM Modi Praised Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడిన విషయాలో ఎంతో సమాచారాన్ని అందిస్తు్న్నాయన్నారు.
 మాధవీ లతపై ప్రధాని మోదీ ప్రశంసలు
మాధవీ లతపై ప్రధాని మోదీ ప్రశంసలు

మాధవీ లతపై ప్రధాని మోదీ ప్రశంసలు

PM Modi Praised Madhavi Latha : హైదరాబాద్ (Hyderabad)పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీ లతను(Madhavi Latha) ప్రధాని మోదీ(PM Modi) ప్రశంసించారు. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో మాధవీ లత పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి సామాజిక మాధ్యమంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ...ఆ విషయాలు చాలా ప్రత్యేకమైనవని అన్నారు. మాధవీ లత ఆలోచనల్లో ప్యాషన్ తో పాటు లాజిక్ ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాధవీ లత ఎన్నో ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారని కొనియాడారు.

ప్రధాని మోదీ ట్వీట్

"మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీరు చాలా దృఢమైన పాయింట్లు చెప్పారు. మీ ఆలోచనల్లో తర్కం, అభిరుచి కలగలిసి ఉంది. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ పునః ప్రసారాన్ని చూడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. మీ అందరికీ ఇది చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది" అని మాధవీ లతను ఎక్స్ లో ప్రధాని మోదీ ట్యాగ్ చేశారు.

ఎవరీ మాధవీ లత?

హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)పై హిందుత్వ వాది మాధవీ లతను బీజేపీ రంగంలోకి దింపింది. కొంపెల్ల మాధవీ లత విరించి హాస్పిటల్స్ ఛైర్‌పర్సన్, ఆమె భరతనాట్యం డాన్సర్. ఆమె స్థాపించిన లతామా ఫౌండేషన్ తో ఎన్నో స్వచ్ఛంద సేవలు చేస్తున్నారు. ఈ ఛారిటబుల్ సంస్థ ద్వారా ఆమె హైదరాబాద్‌లో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మాధవి లత కోఠి ఉమెన్స్ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదివారు. మాధవి లత హిందూ ధర్మ ప్రసంగాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొంపెల్ల మాధవి లత ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేక పోరాటంతో వెలుగులోకి వచ్చారు. మాధవి లత ఎన్.సి.సి క్యాడెట్‌గా చేశారు. ఆమె పొలిటికల్ సైన్స్ చదివారు. మాధవి లత భర్త విశ్వనాథ్ విరించి హాస్పిటల్ వ్యవస్థాపకుడు. మాధవి లత హిందు మత వక్తగా ప్రసిద్ధి చెందారు. హిందువుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. మాధవి లత లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 49 ఏళ్ల మాధవి లత హైదరాబాద్‌లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న తొలి మహిళా అభ్యర్థి.

తదుపరి వ్యాసం