Hyderabad Congress Candidates : హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు...?
Hyderabad Lok Sabha Constituency News: హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి(Hyderabad Congress MP Candidate) ఎవరనేది ఇంకా తేలలేదు. పలువురి పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ… అధినాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Hyderabad Congress MP Candidate 2024: హైదరాబాద్ లోక్ సభ స్థానానికి(Hyderabad Lok Sabha Constituency) అభ్యర్థి ఎంపిక అంశం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారింది.అయితే తమ అభ్యర్ధులను ప్రకటించి బీజేపీ,బిఆర్ఎస్ ముందంజలో ఉండగా......అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ఈ స్థానం నుంచి పోటీకి రోజుకో పేరు వినిపిస్తుంది. తాజాగా హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు వలివుల్లా పేరు తెరపైకి వస్తుంది.వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి అలీ మస్కథి బరిలో ఉంటారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.అయితే పాతబస్తీలో మజ్లిస్ పార్టీ ఒక్కసారే ప్రచార స్పీడును పెంచి పరోక్షంగా అలీ మస్కథికి హెచ్చరికలు జారీ చేసిందని అందుకే అలీ మాస్కథి ఇప్పుడు పోటీకి నిరాకరిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
బరిలో డీసీసీ అధ్యక్షుడు సమీర్......?
ఢిల్లీలో జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయవాది శాహనాజ్ పేరు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశమైంది. కానీ ఆ తర్వాత విడుదలైన వరుస జాబితాలో హైదరాబాద్ లోక్ సభ సీటుకు మాత్రం చోటు దక్కలేదు.పోటీకి మరికొందరి ప్రముఖుల పేర్లు గట్టిగా వినిపించినా..... ఆ పార్టీ వర్గాలే వారికి అంత సీన్ లేదని కొట్టిపారేస్తున్నాయట.వాస్తవానికి హైదరాబాద్ లోక్ సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆశలతో పాటు పట్టు కూడా అంతగా లేదు.అయినప్పటికి..... పాతబస్తీలో ఉనికి కోసమైనా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే స్థానిక నేతనే బరిలో దింపాలని పార్టీ భావిస్తోంది.అందులో భాగంగానే హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడు సమీర్ వాలివుల్ల అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సమీర్ వలీవుల్లాసైతం పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయన అభ్యర్థితత్వానికి పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థుల ప్రకటనలో కాస్త ముందంజలో ఉన్న బిజెపి, బిఆర్ఎస్ పార్టీలలో ఎన్నికల ప్రచార దూకుడు మాత్రం కనిపించడం లేదు. ఒకవైపు మజ్లిస్ పార్టీ పక్షాన ఆ పార్టీ అధినేత,హైదరాబాద్ సిట్టింగ్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల బరిలో దిగడం లాంఛనమే. దీంతో గత నెల రోజుల నుంచి వివిధ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతూ ప్రచార స్పీడును పెంచారు. పాదయాత్రలు, రంజాన్ ఇఫ్తార్ విందులతో ప్రజలతో మమేకమవుతున్నారు అసదుద్దీన్. మరో వైపు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ......కనీసం పార్లమెంట్ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించడం లేదని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారట. ఇక బీజేపీ మహిళా అభ్యర్థి, విరించి హాస్పిటల్స్ అధినేత మాధవి లత అప్పుడో ఇప్పుడో ప్రజల మధ్యకు వచ్చినట్టు కనిపిస్తున్నా....ఎక్కువ సమయం మాత్రం యూట్యూబ్ ఇంటర్వ్యూలకే కేటాయిస్తున్నారట.దాంతో పాటు పలువురు బీజేపీ నేతలు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే రాజా సింగ్.....
గ్రేటర్ లో బిజెపి తరపున ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ (RajaSingh)పార్లమెంట్ ఎన్నికలకు దూరం పాటిస్తున్నట్లు కనిపిస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్ లో జరిగే హిందూ సమ్మేళనంలో ఆయన బిజీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు హైదరాబాద్ పార్లమెంటు స్థానం అభ్యర్థిత్వంపై ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల నుంచి జహీరాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ వచ్చిన ఆయన......గతేడాది మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఆయన పై సస్పెన్షన్ వేటు వేసి అసెంబ్లీ ఎన్నికల ముందు ఎత్తివేసింది. గోషామహల్ స్థానం నుంచి తిరిగి బరిలో దిగిన రాజా సింగ్ మరోసారి విజయం సాధించారు. అయినప్పటికీ...... జహీరాబాద్ పార్లమెంట్ స్థానంపై పట్టు పట్టారు. కానీ అధిష్టానం మాత్రం అయన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో గుర్రుగా ఉన్న రాజా సింగ్..... హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.కానీ బీజేపీ మాధవి లత (Madhavi Latha)ను ప్రకటించడంతో" మీకు మోగాల్లే దొరకలేదా అంటూ " అధిష్టానం పై సంచలన వ్యాఖ్యలు చేశారు రజాసింగ్.ఏది ఏమైనప్పటికీ.....హాట్ కేక్ లా మారిన హైదరాబాద్ లో ఈసారి ఎవరు జెండా ఎవరు వేస్తారో వేచి చూడాలి.
రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా.
సంబంధిత కథనం