BJP Madhavi Latha : ఓవైసీ అడ్డాలో 'నారీశక్తి' అస్త్రం పని చేస్తుందా?
Hyderabad BJP Madhavi Latha : హైదరాబాద్ లో బలమైన మజ్లిస్ ను ఢీకొట్టేందుకు హిందుత్వవాది మాధవి లతను బీజేపీ బరిలో నిలిపింది. అసలు ఎవరీ మాధవి లత, ఆమె నేపథ్యం ఏంటో తెలుసుకుందాం.
Hyderabad BJP Madhavi Latha : బీజేపీ తొలి జాబితాలో హైదరాబాద్ (Hyderabad Lok Sabha )లోక్ సభ స్థానానికి కొంపెల్లి మాధవి లత(Madhavi Latha) పేరు ప్రకటించింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)పై హిందుత్వ వాది మధవి లతను బీజేపీ రంగంలోకి దింపింది. కొంపెల్ల మాధవి లత విరించి హాస్పిటల్స్ ఛైర్‌పర్సన్, ఆమె భరతనాట్యం డాన్సర్. ఆమె స్థాపించిన లతామా ఫౌండేషన్ తో ఎన్నో స్వచ్ఛంద సేవలు చేస్తున్నారు. ఈ ఛారిటబుల్ సంస్థ ద్వారా ఆమె హైదరాబాద్‌లో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మాధవి లత కోఠి ఉమెన్స్ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదివారు. మాధవి లత హిందూ ధర్మ ప్రసంగాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
అసదుద్దీన్ పై పోటీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 2004 నుంచి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో ఒవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ గెలిచినప్పటి నుంచి హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మజ్లిస్ కు కంచుకోట. 2004 నుంచి ఈ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ వరుసగా గెలుస్తున్నారు. అయితే ఈసారి అసదుద్దీన్ పై పోటీగా హిందుత్వ ఫేమ్ మాధవి లతకు బీజేపీ బరిలోకి దింపింది. ఆమె అసదుద్దీన్ పై తరచూ విమర్శలు చేస్తుంటారు. దీంతో ఈసారి మజ్లిస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు డాక్టర్ మాధవి లతను బీజేపీ రంగంలోకి దింపింది. బీజేపీ(BJP First List) 195 మంది అభ్యర్థుల తొలిజాబితాలో మాధవి లత పేరును ప్రకటించడంతో బలహీన నియోజకవర్గాలపై బీజేపీ సీరియస్‌గా దృష్టి సారించిందని తెలుస్తోంది.
మాధవి లత ఎవరు?
కొంపెల్ల మాధవి లత ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేక పోరాటంతో వెలుగులోకి వచ్చారు. సాంస్కృతిక కార్యకర్త అయిన డాక్టర్ మాధవి హైదరాబాద్‌లోని విరించి ఆసుపత్రి ఛైర్మన్‌గా ఉన్నారు. మాధవి లత ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డ్యాన్సర్. ఆమెకు ముగ్గురు పిల్లలు. మాధవి లత ఎన్.సి.సి క్యాడెట్‌గా చేశారు. ఆమె పొలిటికల్ సైన్స్ చదివారు. మాధవి లత భర్త విశ్వనాథ్ విరించి హాస్పిటల్ వ్యవస్థాపకుడు. మాధవి లత హిందు మత వక్తగా ప్రసిద్ధి చెందారు. హిందువుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. మాధవి లత లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 49 ఏళ్ల మాధవి లత హైదరాబాద్‌లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న తొలి మహిళా అభ్యర్థి.
సంబంధిత కథనం