తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar Congress : రసవత్తరంగా 'కరీంనగర్‌' రాజకీయాలు - ఎన్నికల వేళ దీక్షకు దిగిన కాంగ్రెస్

Karimnagar Congress : రసవత్తరంగా 'కరీంనగర్‌' రాజకీయాలు - ఎన్నికల వేళ దీక్షకు దిగిన కాంగ్రెస్

HT Telugu Desk HT Telugu

14 April 2024, 16:07 IST

google News
    • Congress Protest in Karimnagar : కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ దీక్షకు దిగింది. బీజేపీ పదేళ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఈ దీక్షను చేపట్టింది. మంత్రి పొన్నం, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
దీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్
దీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్

దీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్

Congress Protest in Karimnagar : బిజేపి పదేళ్ళ పాలనపై తెలంగాణ కు అన్యాయం జరిగిందని కరీంనగర్ లో(Karimnagar Lok Sabha constituency) కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టింది. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన దీక్షలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం పాల్గొని బిజేపి తీరు..బండి సంజయ్ వైఖరిపై మండిపడ్డారు. బిజేపి విభజన హామీలు నెరవేర్చలేదని ఆరోపించిన నేతలు, పదేళ్ళలో ఎవ్వరి అకౌంట్లలోనైనా పదిలక్షలు పడ్డాయా అని ప్రశ్నించారు. నల్ల చట్టాలు తీసుకువచ్చిన బిజేపి ప్రభుత్వం, ఢిల్లీలో రైతులపై దమనకాండకు పాల్పడిందని ఆరోపించారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టడం తప్పా బిజేపి చేసిందేమిలేదన్నారు పొన్నం ప్రభాకర్. పార్లమెంటు సాక్షిగా విభజన హామీలను తుంగలో త్రోక్కిన బిజేపికి, రాముడు పేరుతో రాజకీయం చేస్తున్న వారికి సమాధి కావల్సిందేనన్నారు. గత ఎన్నికలలో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనే నినాదం బిఆర్ఎస్ ని బొందపెట్టిందని అలాంటి పరిస్థితే ఇప్పుడు బిజేపికి పడుతుందన్నారు.

 చర్చకు సిద్ధమా…? - మంత్రి పొన్నం

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్న ప్రభాకర్(Minister Ponnam) ఫైర్ అయ్యారు. తాను ఎంపీగా ఐదేళ్లలో ఏం చేశానో.. సంజయ్ ఎంపీగా(Bandi Sanjay) ఐదేళ్లలో ఏం చేశారో బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ అవినీతిపరుడు కాబట్టే అధ్యక్ష పదవినుండి తొలగించారని ఆరోపించారు. విధ్వేషాలు రెచ్చగొట్టే వారికి చరమగీతం పాడాలని కోరారు. తల్లి గురించి మాట్లాడిన వ్యక్తికి రాజకీయంగా సమాధి కట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యంగ‌ స్ఫూర్తిని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఎన్నికల వేళ కరీంనగర్ లో కాంగ్రెస్ నిరసన దీక్ష రాజకీయంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేయడంలో జాప్యం చేస్తున్న కాంగ్రెస్ నిరసన దీక్షతో రాజకీయం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విభజన హామీలపై గత పదేళ్లుగా కాంగ్రెస్ ఎందుకు పోరాడలేదని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థి దొరకని పరిస్థితుల్లో పార్టీ నాయకులు, ఓటర్లు చేజారి పోకుండా ఉండేందుకు కొత్త డ్రామాకు కాంగ్రెస్ తెర లేపిందని విమర్శిస్తున్నారు. ఓటు రాజకీయాలు మానుకొని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ పనిచేయాలని లేకుంటే ప్రజలు తగిన పాఠం చెబుతారని బిజెపి నేతలు హెచ్చరిస్తున్నారు.

రిపోర్టింగ్ - HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar

తదుపరి వ్యాసం