తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bjp Manifesto : యువత, పేదలు, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల..

BJP manifesto : యువత, పేదలు, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల..

Sharath Chitturi HT Telugu

14 April 2024, 11:08 IST

google News
  • BJP election manifesto 2024 : లోక్​సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. మోదీ కీ గ్యారెంటీ ట్యాగ్​లైన్​తో మేనిఫెస్టోను ఆవిష్కరించింది. బీజేపీ మేనిఫెస్టో హైలైట్స్​ ఇక్కడ చూడండి..

మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఆగ్రనేతలు..
మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఆగ్రనేతలు..

మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఆగ్రనేతలు..

BJP election manifesto 2024 : 2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో యువత, పేదలు, మహిళల అభ్యన్నతే లక్ష్యంగా.. మేనిఫెస్టోను విడుదల చేసింది అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ). ఈ మేనిఫెస్టోను సంకల్ప్​ పాత్రాగా అభివర్ణించిన కమలదళం.. 'మేదీ కి గ్యారెంటీ' అనే ట్యాగ్​లైన్​ను ఇచ్చింది. రాజ్యాంగ రూపకర్త, దళిత సమాజ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన డా. బీఆర్​ అంబేడ్కర్​ జయంతి రోజే.. బీజేపీ, తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉదయం ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​తో పాటు పలువురు పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో హామీలు..

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు చేస్తాము.

చికిత్స కోసం 75ఏళ్లు పైబడిన వారందరిని ఆయుష్మాన్​ భారత్​ యోజనలో చేరుస్తాము.

జన ఔషధ కేంద్రాల్లోని మందులపై 80శాతం వరకు రాయితీ ఇస్తాము.

BJP Manifesto 2024 : మరో 5ఏళ్ల పాటు ఉచిత రేషన్​ కార్డు పథకాన్ని కొనసాగిస్తాము.

ప్రస్తుతం రూ. 10లక్షలుగా ఉన్న ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలను.. రూ. 20లక్షలకు పెంచుతాము.

ఆయుష్మాన్​ భారత్​ పథకంలో ట్రాన్స్​జెండర్​ సమాజాన్ని కూడా జోడిస్తాము.

గిరిజన వారసత్వ సంపదనపై రీసెర్చ్​ చేస్తాము. డిజిటల్​ జన్​జాతీయ కాలా అకాడమీని స్థాపిస్తాము.

దేశవ్యాప్తంగా 'ఒకే దేశం ఒకే ఎన్నిక' అమలు చేస్తాము.

మరో 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తాము. సోలార్​ పవర్​ ప్రాజెక్ట్​ ద్వారా.. లక్షలాది ఇళ్లల్లో విద్యుత్​ బిల్లులను జీరో చేస్తాము.

బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "వికసిత్​ భారత్​కి చెందిన నాలుగు స్తంభాలపై దృష్టిపెట్టిన మేనిఫెస్టో ఇది. నారీ శక్తి, యువతా శక్తి, పేదలు, రైతులను దృష్టిలో పెట్టుకుని ఈ బీజేపీ మేనిఫెస్టోను రూపొందించాము. ప్రజలకు నాణ్యమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే మా మేనిఫెస్టో ఉద్దేశం. అన్ని ఇళ్లకు పైప్​లైన్ల్​ ద్వారా గ్యాస్​ ఇవ్వడం, ఉచిత విద్యుత్​ను అందించంపై ప్రభుత్వం ఫోకస్​ చేస్తుంది," అని అన్నారు.

పక్కా ప్రణాళికతో మేనిఫెస్టో..

2024 Lok Sabha elections BJP : హ్యాట్రిక్​ కొట్టి మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. మేనిఫెస్టో విషయంలో పక్కా ప్రణాళికలు రచించింది. రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో కూడిన హై లెవల్​ కమిటీ.. ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తులు చేసింది. ఈ కమిటీలో 27మంది సభ్యులు ఉండటం విశేషం. ప్రజల నుంచి సూచనలు పొందేందుకు.. బీజేపీ కార్యకర్తలు దేశ నలుమూలలకు ప్రయాణించారు.

543 సీట్ల కోసం జరిగే 2024 లోక్​సభ ఎన్నికలు.. ఏప్రిల్​ 19 నుంచి మొదలవుతాయి. మొత్తం 7 దశల్లో పోలింగ్​ జరుగుతుంది. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి.

కాంగ్రెస్​ పార్టీ ఇప్పటికే తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం