Lok sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వింతలు.. ‘చిత్ర’ విచిత్రాలు
భారత్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకర్షించడం కోసం అభ్యర్థులు వింత, వింత పోకడలు పోతున్నారు. గెలుపు సాధించడమే లక్ష్యంగా, ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోని ఈ వింతలను చిత్రాల్లో చూడండి.
(1 / 8)
పశ్చిమబెంగాల్ లోని దక్షిణ దినాజ్ పూర్ లోని బలూర్ ఘాట్ సమీపంలో బీజేపీ అభ్యర్థి సుకాంత మజుందార్ ఎన్నికల ప్రచారంలో క్రికెట్ ఆడుతున్న దృశ్యం.(ANI)
(2 / 8)
కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కేఎస్ ఈశ్వరప్ప నామినేషన్ దాఖలుకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు.(PTI)
(3 / 8)
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హుగ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ కూరగాయలు కొనుగోలు చేశారు. (PTI)
(4 / 8)
బుల్లెట్ రాణిగా పిలువబడే బైక్ రైడర్ రాజలక్ష్మి మందా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా బైక్ టూర్ చేపట్టారు.(PTI)
(5 / 8)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లాలో పార్టీ అభ్యర్థి జగదీశ్ చంద్ర బర్మా బసునియాకు మద్దతుగా ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు.(PTI)
(6 / 8)
రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో బీజేపీ అభ్యర్థి కన్హియా లాల్ మీనాకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.(PTI)
(7 / 8)
నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.(PTI)
ఇతర గ్యాలరీలు