Bandi Sanjay Nomination : ఈనెల 19న బండి సంజయ్ నామినేషన్, సర్వేలన్నీ బీజేపీ వైపేనని ధీమా!-karimnagar news in telugu bjp bandi sanjay files nomination on april 19th lok sabha elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bandi Sanjay Nomination : ఈనెల 19న బండి సంజయ్ నామినేషన్, సర్వేలన్నీ బీజేపీ వైపేనని ధీమా!

Bandi Sanjay Nomination : ఈనెల 19న బండి సంజయ్ నామినేషన్, సర్వేలన్నీ బీజేపీ వైపేనని ధీమా!

HT Telugu Desk HT Telugu
Apr 12, 2024 08:20 AM IST

Bandi Sanjay Nomination : ఈ నెల 19న కరీంనగర్ లోక్ సభ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కు వేలాది మంది కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

బండి సంజయ్
బండి సంజయ్

Bandi Sanjay Nomination : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్(Bandi Sanjay Nomination) ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న కరీంనగర్ లో నామినేషన్ వేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. నామినేషన్ కు వేలాది మంది కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అబద్దాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ రెండు పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ(BJP) గెలుస్తుందని సర్వేలన్ని తేలుస్తున్నాయని స్పష్టం చేశారు. కరీంనగర్ లో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మండల బీజేపీ అధ్యక్షులు ఇన్ ఛార్జ్ లతో బండి సంజయ్ సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. రెండో సెట్ నామినేషన్ పత్రాలను ఈ నెల 25న దాఖలు చేయనున్నారు బండి సంజయ్.

మంత్రి పొన్నంపై బండి ఫైర్

మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కొండగట్టు అంజన్న సాక్షిగా 6 గ్యారంటీలను అమలు చేశామని పచ్చి అబద్దాలాడారని మండిపడ్డారు. కొండగట్టు అంజన్న(Kondagattu Anjanna) చాలా పవర్ ఫుల్ అని, ఆయన సన్నిధిలో అబద్దాలాడిన, దొంగ హామీలిచ్చిన కేసీఆర్, ఆయన కుమార్తె కవితకు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ నేతలకు అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలను అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు, ఆరు గ్యారంటీ స్కీం(Congress Six Guarantees)లతో ఎంతమంది లబ్ది పొందారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, పంటలకు 500 రూపాయల బోనస్, మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సహాయం, పెట్టుబడి కింద రైతులకు ఎకరాల రూ.15000, కౌలు రైతులకు రూ.12,000, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్(Pensions) ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు.‌

వినోద్ కుమార్ చేసింది ఏమిలేదు

బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్(BRS Vinod Kumar) ఐదేళ్లు ఎంపీగా పని చేసి కరీంనగర్ కు చేసింది ఏమి లేదని విమర్శించారు బండి సంజయ్. 3 లక్షల మెజారిటీతో గెలుస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న వినోద్, బీఆర్ఎస్ అభ్యర్థి మంచోడేనట కానీ, ఆ పార్టీ మంచిది కాదని కొత్త ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. నిజంగా వినోద్ మంచోడైతే.. ఆయన ఫొటోతో ఎన్నికల్లోకి వెళతారా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫొటోతో ఎన్నికల్లోకి వెళతారా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిజానికి కరీంనగర్ కు ఆయన చేసిందేమీ లేదన్నారు. మంచోడనే ముసుగులో కేసీఆర్ కు దోచిపెట్టడం, ఆయన కుటుంబం దోచుకోవడం తప్పా చేసిందేమీ లేదన్నారు.

కేసీఆర్ బూతులపై ఎందుకు స్పందించారు

సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేతలను మాజీ సీఎం కేసీఆర్(KCR) కుక్కల కొడక, గాడిద, ముండా కొడకా తిడితే ఎందుకు మంత్రి గాని, సీనియర్ నేతలు గానీ ఎందుకు స్పందించరని బండి సంజయ్(Bandi Sanjay) ప్రశ్నించారు. ఏదో నామ మాత్రంగా కౌంటర్ ఇస్తారు.. కానీ నేను కాంగ్రెస్ విధానాలు, హామీలపై ప్రశ్నిస్తే... అడ్డగోలుగా తిట్టడమే పనిగా పెట్టుకున్న పొన్నం నన్ను ప్రశ్నిస్తున్న ఆ నేతను నేనడుగుతున్న.... కరీంనగర్ ప్రజలకు నువ్వు చేసిందేమిటి. నువ్వు నిజంగా ప్రజలకు మంచి చేస్తే కరీంనగర్(Karimnagar) ప్రజలు డిపాజిట్లు రాకుండా ఎందుకు చేస్తారు? కరీంనగర్ నుంచి హుస్నాబాద్ కు ఎందుకు పారిపోతారు? ఇవన్నీ నేనడుగుతుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలిద్దరూ ఒక్కటై నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు.‌ పైకి రెండు పార్టీల నేతలు తిట్టుకున్నట్లు కన్పించినా... లోలోపల మాత్రం నన్ను ఓడించడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లెన్ని కుట్రలు చేసినా సరే... నేను పట్టించుకోనని స్పష్టం చేశారు.

సర్వేలన్నీ బీజేపీ వైపే

దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని సర్వేల్లో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో(Karimnagar Lok Sabha Elections) బీజేపీ గెలుపు ఖాయమని తేలిందని తెలిపారు బండి సంజయ్. విచిత్రమేమిటంటే సర్వేలన్నీ బీజేపీ గెలుస్తుందని చెబుతుంటే... ఇక్కడి కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) కుమ్కక్కైనయ్, ఇద్దరు కలిసి నన్ను ఓడించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే బండి సంజయ్(Bandi Sanjay) ఏం చేసిండని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నేను చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలందరికీ తెలుసు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై బుక్ లెట్ ను ముద్రించి ఇంటింటికీ పంపిచానని తెలిపారు.

HT Correspondent K.V.REDDY, Karimnagar

Whats_app_banner

సంబంధిత కథనం