Siddipet News : బీఆర్ఎస్ సభకు హాజరు, 106 మంది ప్రభుత్వ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు-siddipet collector manu chaudhary suspended 106 govt staff attended brs meeting ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Siddipet News : బీఆర్ఎస్ సభకు హాజరు, 106 మంది ప్రభుత్వ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

Siddipet News : బీఆర్ఎస్ సభకు హాజరు, 106 మంది ప్రభుత్వ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

HT Telugu Desk HT Telugu
Apr 09, 2024 02:22 PM IST

Siddipet News : సిద్దిపేట జిల్లా కలక్టర్ మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నిర్వహించిన సభకు హాజరైన 106 మంది ప్రభుత్వ సిబ్బందిని ఈసీ ఆదేశాలతో సస్పెండ్ చేశారు.

 సిద్దిపేట కలెక్టర్ సంచలన నిర్ణయం,
సిద్దిపేట కలెక్టర్ సంచలన నిర్ణయం,

Siddipet News : సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి(Siddipet Collector) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన సభకు హాజరై, ఎన్నికల కోడ్ (Election Code)ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7వ తేదీ సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో వెంకట్రామిరెడ్డి సభ ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్న బీజేపీ నాయకులు, వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సీఈవో వికాస్ రాజ్(CEO Vikas Raj) కు ఆధారాలలో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సిద్దిపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరిని సీఈవో ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ చేసిన కలెక్టర్ 106 మంది ప్రభుత్వ సిబ్బంది ఈ సభలో పాల్గొన్నారని గుర్తించారు. ఆ 106 మందిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ (Siddipet Govt Staff Suspended)చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సస్పెండ్ అయిన ప్రభుత్వ సిబ్బంది(Suspended Govt Staff) వీళ్లే

  • సెర్ప్ ఉద్యోగులు 38 మంది(వారిలో ఏపీఎంలు-14, సీసీలు-18, వీవోఏలు-4, సీఓ-1, సీబీ ఆడిటర్స్-1)
  • ఈజీఎస్ ఉద్యోగులు - 68 మంది(వారిలో ఏపీవోలు-4, ఈసీలు -7, టీఏలు-38, సీఓలు-18, ఎఫ్ఎ-1)

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రొఫెసర్ సస్పెండ్

సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రొఫెసర్ గా(Jr College Professor Suspended) పనిచేస్తున్న రవికుమార్ గౌడ్‌ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని పండరి నాయక్, ఎల్లయ్య అనే వ్యక్తులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేయగా అది వాస్తవమేనని తెలిసింది. దీంతో ఆ ప్రొఫెసర్ పై చట్ట ప్రకారం సస్పెన్షన్ వేటు విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు(Collector Kranthi Valluru) ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉద్యోగులందరూ ఎన్నికల నియమాలకు కట్టుబడి పని చేయాలని ఆదేశించారు.

పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

కోహీర్ మండలంలో పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీ లక్ష్మణాచారిని సస్పెండ్ చేసినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు(Sangareddy Collector) తెలిపారు. డంపింగ్ యార్డ్‌లో సరైన పారిశుద్ధ్యం, గ్రామంలో సురక్షితమైన తాగునీటి సరఫరాలో విఫలమయ్యారన్న కారణాలతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. డంప్‌యార్డులో కాకుండా రోడ్లపైనే చెత్త వేస్తున్నట్లు గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేసి దహనం చేయడంతో పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారన్న కారణంతో సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు .

Whats_app_banner

సంబంధిత కథనం