తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cm Jagan : మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచే పాలన- సీఎం జగన్

CM Jagan : మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచే పాలన- సీఎం జగన్

27 April 2024, 15:14 IST

google News
    • CM Jagan : ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారు. విశాఖను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుస్తామన్నారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

CM Jagan : మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ రాజధానిగా(Visakha Capital) పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ అన్నారు. శనివారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మేనిఫెస్టో(Ysrcp Manifesto) విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ... రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా విశాఖ(Visakhapatnam)ను తీర్చి దిద్దుతామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలు(Kurnool)ను న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాత పథకాల కొనసాగింపు, విస్తరణతో మేనిఫెస్టో ప్రకటించారు. వైసీపీకి మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథం అన్నారు. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత ఇచ్చి 99 శాతం హామీలు అమలుచేశామన్నారు. ఓ ప్రొగ్రెస్‌ కార్డులాగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించామన్నారు. ఎప్పుడు ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ చేశామన్నారు.

ఆ హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా

2014లో మోసపూరిత హామీల్లో చంద్రబాబు(Chandrababu)తో పోటీ పడలేకపోయానని సీఎం జగన్(CM Jagan) అన్నారు. అప్పుడు చేయగలిగిందే చెప్పామన్నారు. అమలు చేయకున్నా, హామీలు ఇచ్చేద్దామని, కానీ నేను ఒప్పుకోలేదన్నారు. 2019లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేస్తామన్నారు. అందుకే ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు ఓ హీరోలా వెళ్తున్నానన్నారు. గత ప్రభుత్వాలకు వైసీపీ(Ysrcp) పాలనకు తేడా గమనించాలని సీఎం జగన్ అన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి 58 నెలల పాలనలో ఆ కష్టాలు తీర్చేందుకు పనిచేశానన్నారు. పేదల ఇంటికే సంక్షేమం అందించామన్నారు. ఆప్కాస్‌లో రూ.25 వేల వరకు జీతం పొందుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్ల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల పథకాలు వర్తింపజేశామన్నారు. తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లారన్నారు.

సామాజిక న్యాయం అమలు చేశాం

వైసీపీ(Ysrcp) అధికారంలోకి వచ్చాకే.. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం(Social Justice) అమలు అవుతోందన్నారు. సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామన్నారు. 50 శాతం రిజర్వేషన్లతో బలహీన వర్గాలకు నామినేటెడ్‌ పదవులు(Nominated Posts) ఇచ్చామన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో(AP Gram Ward Sachivalayas) గ్రామ స్వరాజ్యాన్ని సాధించి చూపించామన్నారు. పంటల కొనుగోలులో దళారుల వ్యవస్థ నిర్మూలించామన్నారు. వైసీపీ పాలనలో ఎక్కడా లంచాల ప్రస్తావన లేదని, నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే(DBT) డబ్బులు జమచేస్తున్నామన్నారు. వైసీపీ 58 నెలల్లో పాలనలో 2.31 లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్‌మెంట్‌, గోరుముద్ద, ఈ పథకాలన్నీ అమలు చేశామని, భవిష్యత్తులో వీటిని ఎవరూ ఆపలేరన్నారు. చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ (TDP Super Six)పథకాలకు 1.21 లక్షల కోట్లు అవసరమవుతాయన్నారు. వైసీపీ పథకాలకు(Ysrcp Schemes) ఏడాదికి 29,100 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సంపద సృష్టి జరగలేదని ఆరోపించారు, ప్రతీ ఏడాది రెవెన్యూ లోటు ఉందన్నారు. లోటు ఉన్నా... తాను సంపద సృష్టించానని చంద్రబాబు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు.

తదుపరి వ్యాసం