AP CM Jagan: జగన్, చంద్రబాబుకు నేనే డబ్బులిచ్చా.. వివరంగా చెప్పిన ప్రతినిధి 2 డైరెక్టర్ టీవీ5 మూర్తి-prathinidhi 2 director tv5 murthy comments on ap cm jagan chandrababu naidu pawan kalyan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ap Cm Jagan: జగన్, చంద్రబాబుకు నేనే డబ్బులిచ్చా.. వివరంగా చెప్పిన ప్రతినిధి 2 డైరెక్టర్ టీవీ5 మూర్తి

AP CM Jagan: జగన్, చంద్రబాబుకు నేనే డబ్బులిచ్చా.. వివరంగా చెప్పిన ప్రతినిధి 2 డైరెక్టర్ టీవీ5 మూర్తి

Sanjiv Kumar HT Telugu
Apr 21, 2024 10:38 AM IST

TV5 Murthy CM Jagan Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తానే డబ్బులు ఇచ్చానని ప్రముఖ జర్నలిస్ట్, టీవీ5 మూర్తి సంచలన కామెంట్స్ చేశారు. ప్రతినిధి 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్, చంద్రబాబుకు నేనే డబ్బులిచ్చా.. వివరంగా చెప్పిన ప్రతినిధి 2 డైరెక్టర్ టీవీ5 మూర్తి
జగన్, చంద్రబాబుకు నేనే డబ్బులిచ్చా.. వివరంగా చెప్పిన ప్రతినిధి 2 డైరెక్టర్ టీవీ5 మూర్తి

TV5 Murthy About Prathinidhi 2: హీరో నారా రోహిత్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ప్రతినిధి 2. ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారారు ప్రముఖ జర్నలిస్ట్, టీవీ5 మూర్తి దేవగుప్తాపు. ఇప్పటివరకు న్యూస్ ప్రజంటర్‌గా ఎన్నో రకలా ప్రోగ్రామ్స్‌తో పేరు తెచ్చుకున్న టీవీ5 మూర్తి ప్రతినిధి 2తో దర్శకుడి అవతారం ఎత్తారు.

రాజకీయాలపై సెటైర్లు

వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. సుకుమార్ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌కు బాగా రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా ఏపీ రాజకీయాలపై సినిమా ద్వారా సెటైర్లు వేశారని అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి.

స్ట్రాంగ్ కౌంటర్

ఇక ప్రతినిధి 2 సినిమాకు ఫండింగ్‌ అంతా చంద్రబాబు నాయుడిదే అంటూ పలు విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు టీవీ5 మూర్తి. ప్రతినిధి 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇచిన జర్నలిస్ట్ మూర్తి సంచలన కామెంట్స్ చేశారు.

నేనే డబ్బులిస్తా

"చంద్రబాబు నాకు డబ్బులు ఇవ్వడం కాదు. నేను చంద్రబాబుకు డబ్బులిస్తా. హెరిటేజ్ పాల ప్యాకెట్స్ రెండు కొంటాను. అలా బాబు గారికి ఫండింగ్ చేస్తున్నా. ఒకడిపై ఆధారపడే బతుకు నాది కాదు. నేనే వాళ్లకిస్తా. పవన్ కల్యాణ్ గారికి కూడా నేనే డబ్బులిస్తా. పవన్ కల్యాణ్ సినిమా వచ్చినప్పుడు 150 రూపాయలను పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా. అలా ఫండింగ్ చేస్తా" అని డైరెక్టర్ మూర్తి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

డబ్బులు తీసుకోను

"నేను ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఏపీ సీఎం జగన్ గారికి కూడా ఫండింగ్ చేశా. భారతీ సిమెంట్ బస్తా 350 రూపాయలు. ఎవడికైనా నేనే డబ్బులిస్తా కానీ, నేను డబ్బులు తీసుకోను. నా చేయి పైనే ఉంటుంది. కింద ఉండదు" అని చెప్పుకొచ్చారు ప్రతినిధి 2 మూవీ డైరెక్టర్, జర్నలిస్ట్ మూర్తి. దీంతో ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

జగన్ ప్రభుత్వంపై టార్గెట్

ఇక ప్రతినిధి 2 సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సీన్స్ చూపించారని పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కూడా మూర్తి వాటికి సమాధానం ఇచ్చారు.

ప్రతినిధి 2 ఎజెండా అదే

ప్రతినిధి 2 ఎజెండా ఏమిటి? అని అడిగిన ప్రశ్నకు "ప్రతినిధి 1 ఎజెండా వ్యవస్థని ప్రశ్నించడం. అందులో ఏ పార్టీని టార్గెట్ చేయలేదు. ప్రతినిధి 2 ఎజెండా కూడా అదే. అయితే ప్రతినిధి1లో సిస్టం బయట నుంచి ప్రశ్నిస్తాడు. ఇందులో సిస్టం లోపల ఉండి ప్రశ్నిస్తాడు" అని డైరెక్టర్ మూర్తి వివరించారు.

నాలుగైదు కథలు

"నాకు మొదటి నుంచి సినిమాపై ఆసక్తి ఉంది. కాలేజ్ డేస్‌లో నాటకాలు కూడా వేసేవాళ్లం. రోహిత్ గారిని ఓ సందర్భంలో కలిశాను. అప్పటికే నా దగ్గర నాలుగైదు కథలు ఉన్నాయి. అయితే, ఆయన ప్రతినిధి చూశాను. నేను రాసుకున్న ఈ కథలో ఆయన హీరోగా అయితే బాగుంటుంది అని అనిపించింది. ఆయన వాయిస్ ఈ కథకి మరింత బలం చేకూర్చుతుంది. రోహిత్ గారు సెటిల్డ్ నటుడు. మంచి చదువరి. వాయిస్ కల్చర్ అద్భుతంగా ఉంటుంది. ఈ కథకు ఆయన పర్ఫెక్ట్" అని మూర్తి తెలిపారు.

IPL_Entry_Point