CBN Election Affidavit : ఐదేళ్లలో భారీగా పెరిగిన చంద్రబాబు ఆస్తులు - భువనేశ్వరి వాటానే ఎక్కువ-tdp chief chandrababu naidu assets grow at 41 per cent to rs 810 crore in five years ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cbn Election Affidavit : ఐదేళ్లలో భారీగా పెరిగిన చంద్రబాబు ఆస్తులు - భువనేశ్వరి వాటానే ఎక్కువ

CBN Election Affidavit : ఐదేళ్లలో భారీగా పెరిగిన చంద్రబాబు ఆస్తులు - భువనేశ్వరి వాటానే ఎక్కువ

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 20, 2024 10:06 AM IST

Chandrababu Election Affidavit 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులు ఐదేళ్లలో 41 శాతానికి పెరిగి రూ.810 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తుండగా… ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్
చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ (Photo Source From @sudhakarudumula Twitter)

Chandrababu Election Affidavit 2024: గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ఆస్తుల విలువలు పెరిగాయి. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్ పత్రంలో ఆస్తిపాస్తి వివరాలను పేర్కొన్నారు. ఈ అఫిడవిట్ ప్రకారం….చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ ఆస్తులు గత ఐదేళ్లలో 41 శాతం పెరిగి రూ.810.42 కోట్లకు చేరుకున్నాయి. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేస్తుడంగా… శుక్రవారం ఆయన తరపున భార్య నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఒక్కొక్కటి రూ. 337.85 (మార్కెట్ విలువ) విలువ చేసే 2.26 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఫలితంగా భువనేశ్వరికి హెరిటేజ్‌ ఫుడ్స్‌లో ఉన్న షేర్ల విలువే రూ.763 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం షేర్ హోల్డింగ్ విలువ 2019లో రూ. 545.76 కోట్లగా ఉండగా.. ప్రస్తుతం రూ. 764 కోట్లకు చేరుకుంది. 

భువనేశ్వరి వద్ద 3.4 కిలోల బంగారం, దాదాపు 41.5 కిలోల వెండి ఉన్నట్లు అఫిడవిట్ లో వివరించారు. ఇక చంద్రబాబు స్థిరాస్తులను రూ.36.31 కోట్లుగా ప్రస్తావించారు. అయితే ఆయనకు ఎలాంటి బంగారం ఆభరణాలు లేవని తెలిపారు. ఇందులో చరాస్తులు రూ.4.80 లక్షలు విలువ చేసేవి ఉన్నాయి. అంబాసిడర్‌ కారు విలువ రూ.2,22,500గా ఉంది. భువనేశ్వరికి 6 కోట్లకు పైగా అప్పు ఉన్నట్లు తెలిపారు. స్థిరాస్తులు హైదరాబాద్, తమిళనాడు మరియు చిత్తూరులో ఉన్నట్లు అఫిడవిట్ లో వివరించారు. 2019 అఫిడవిట్ ప్రకారం వీరిద్దరి ఆస్తులు విలువ రూ. 668 కోట్లుగా ఉంది. 2019 అఫిడవిట్ తో పోల్చితే ప్రస్తుతం దాదాపు 40 శాతానికి పైగా ఆస్తులు పెరిగాయి.

చంద్రబాబుపై 24 కేసులు

తాజా అఫిడవిట్ ప్రకారం చంద్రబాబుపై మొత్తం 24 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ స్కామ్, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ తో పాటు మరికొన్ని కేసులు ఉన్నాయి.2019కు ముందు చంద్రబాబుపై  రెండు కేసులు ఉండగా….ఈ ఐదళ్లలో 22 కేసులు నమోదయ్యాయి.

ఆర్కే రోజా ఆస్తులు….

వైసీపీకి చెందిన మంత్రి, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా(RK Roja) ఆస్తులు కూడా పెరిగాయి. 2019లో ఆస్తులను రూ. 9 కోట్లుగా చూపగా… ప్రస్తుతం దాఖలు చేసిన అఫిడవిట్ లో రూ. 13.7 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో 5 కోట్ల విలువ చేసే చరాస్తులు, 7 కోట్ల విలువు చేసే స్థిరాస్తులు ఉన్నాయి.ప్రస్తుతం బెంజ్ తో సహా 9 కార్లు ఉన్నాయని ప్రస్తావించారు.  ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు. ఇంటర్మీడియట్ చదివినట్లు వెల్లడించారు. 

తెలంగాణకు చెందిన బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy Assets) ఆస్తులు పెరిగాయి. గడిచిన ఐదేళ్లలో ఆయన కుటుంబ ఆస్తులు 136 శాతానికి పెరిగాయి. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం… కిషన్ రెడ్డి మొత్తం ఆస్తులు 2019లో రూ.8.1 కోట్లగా ఉంది. ప్రస్తుతం రూ.19.2 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు.  ఇందులో రూ. 8.3 కోట్ల చరాస్తులు, దాదాపు రూ. 10.8 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. స్వగ్రామం అయిన తిమ్మాపూర్(రంగారెడ్డి జిల్లా) లో 8 ఎకరాల భూమి ఉంది. ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. కిషన్ రెడ్డి… ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

 

 

 

 

Whats_app_banner